ETV Bharat / offbeat

రాయలసీమ "ఉల్లికారం పాలకూర" - మిమ్మల్ని కచ్చితంగా నోరూరిస్తుంది! - PALAKURA ULLI KARAM RECIPE

పాలకూరతో పప్పు, పచ్చడి, కూర చేయడం రొటీన్​ - ఇలా పాలకూర ఉల్లికారం చేసేద్దాం!

Palakura Ulli Karam Recipe in Telugu
Palakura Ulli Karam Recipe in Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 29, 2025 at 2:05 PM IST

2 Min Read

Palakura Ulli Karam Recipe in Telugu : ఆకుకూరల్లో తోటకూర తర్వాత ఎక్కువగా వినిపించేది పాలకూర పేరే. ఎన్నో రకాల ఆకుకూరలున్నా కూడా చాలా మంది ఈ రెండింటితోనే ఎక్కువగా పప్పు, వేపుడు, కూరలు చేస్తుంటారు. అయితే, పాలకూరతో ఎప్పుడూ ఒకేలా కాకుండా ఓసారి ఇలా పాలకూర ఉల్లికారం ట్రై చేయండి. ఈ విధంగా కర్రీ వండితే ఆకుకూరలు తినని వారు కూడా ఇష్టంగా తింటారు. ఈ పాలకూర ఉల్లికారం అన్నం, చపాతీలతో ఎంతో రుచిగా ఉంటుంది. మరి ఈజీగా ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

Palakura
Palakura (Getty Images)

కావాల్సిన పదార్థాలు:

  • పాలకూర కట్ట - 1
  • ఉల్లిపాయ - 1
  • వెల్లుల్లి - 5
  • ఉప్పు, కారం -రుచికి సరిపడా
  • నూనె - 2 టేబుల్​స్పూన్లు
  • టీస్పూన్ జీలకర్ర
  • టీస్పూన్​ ఆవాలు
  • పచ్చిమిర్చి - 3
  • కరివేపాకు - 2
  • ధనియాల పొడి - టీస్పూన్​

కరకరలాడే "బొబ్బర్ల మసాలా వడలు" - మినప్పప్పు కంటే ఎంతో రుచిగా ఉంటాయి!

తయారీ విధానం

  • ముందుగా పాలకూర శుభ్రంగా కడిగి సన్నగా ముక్కలు కట్​ చేసుకోవాలి.
  • అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్​ చేసుకోండి.
  • ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, రుచికి సరిపడా కారం, కొన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఈ ఉల్లిపాయ పేస్ట్​ని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి.
  • అనంతరం స్టవ్​పై కడాయి పెట్టి 2 టేబుల్​స్పూన్లు నూనె వేసి వేడి చేయండి.
  • ఆయిల్​ హీటైన తర్వాత టీస్పూన్ జీలకర్ర, టీస్పూన్​ ఆవాలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి ఫ్రై చేయండి.
  • పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్​ వేసి 5 నిమిషాలు ఫ్రై చేయండి.
  • తర్వాత పాలకూర తరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి 2 నిమిషాలపాటు మగ్గించండి.
  • తర్వాత కొన్ని నీళ్లు పోసి కలిపి గిన్నెపై మూతపెట్టి లో ఫ్లేమ్​లో 10-15 నిమిషాలు ఉడికించుకోండి.
  • చివరిగా చిక్కగా మారిన కూరలో ధనియాలపొడి వేసి కలిపి స్టవ్​ ఆఫ్​ చేయండి.
  • అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే ఎంతో రుచికరమైన పాలకూర ఉల్లికారం మీ ముందుంటుంది.

ఈ పాలకూర ఉల్లికారం వేడివేడి అన్నం, చపాతీలతో ఎంతో రుచిగా ఉంటుంది. పాలకూర ఉల్లికారం తయారీ విధానం నచ్చితే మీరు ఓసారి ట్రై చేయండి.

"మామిడికాయ పులిహోర" స్పెషల్​ పొడి - ఈ టిప్​తో రుచి ఇంకా బాగుంటుంది!

"బెల్లం రవ్వ అప్పాలు" - అరిసెలు, పూరీలకు ఇవి సమీప బంధువులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.