ETV Bharat / offbeat

ఆంధ్రా స్పెషల్​ "గోదారోళ్ల పాల ముంజలు" - ఈ కొలతలతో చేస్తే ఒకటికి రెండు ఇష్టంగా తింటారు! - PALA MUNJALU SWEET

గోదావరి జిల్లాల స్పెషల్ పాల ముంజలు - ఇలా చేస్తే మెత్తగా టేస్టీగా వస్తాయి!

Pala Munjalu Sweet Recipe In Telugu
Pala Munjalu Sweet Recipe In Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 6, 2025 at 4:37 PM IST

2 Min Read

Pala Munjalu Sweet Recipe In Telugu : ​గోదావరి జిల్లాల్లో లభించే స్వీట్లలో తీయటి పాల ముంజలు కూడా ఒకటి. పచ్చికొబ్బరి, బెల్లంతో తయారు చేసే పాల ముంజలు నెయ్యి పరిమళంతో రుచి అద్భుతంగా ఉంటాయి. కొన్ని టిప్స్​ పాటిస్తూ ఇక్కడ చెప్పిన విధంగా ట్రై చేస్తే చాలా టేస్టీగా వస్తాయి. పిల్లలు పెద్దలందరూ ఈ పాల ముంజలు ఇష్టంగా తింటారు. మరి సులభంగా పాల ముంజలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

Milk
Milk (Getty Images)

స్టఫింగ్ కోసం కావాల్సిన పదార్థాలు:

  • పచ్చికొబ్బరి ముక్కలు - రెండు కప్పులు
  • బెల్లం తురుము - 1 కప్పు
  • నీళ్లు- అరకప్పు
  • యాలకులు పొడి - టీస్పూన్​
  • నెయ్యి - టీస్పూన్
Pala Munjalu
Pala Munjalu (ETV Bharat)

పాల ముంజల్లోని పై పిండి తయారీ కోసం :

  • పాలు - 2 కప్పులు
  • చక్కెర - 2 టీస్పూన్లు
  • బొంబాయి రవ్వ - అరకప్పు
  • బియ్యం పిండి - అరకప్పు

పులిహోర కలపడం రావట్లేదా? - "పులి ఉప్మా" చేయండిలా - సేమ్ టేస్ట్!

Pala Munjalu
Pala Munjalu (ETV Bharat)

పాల ముంజలు తయారీ విధానం :

  • ఒక మిక్సీ గిన్నెలోకి రెండు కప్పులు పచ్చికొబ్బరి ముక్కలు తీసుకోండి. వీటిని మెత్తగా గ్రైండ్​ చేసుకోండి. ఈ పచ్చి కొబ్బరి తురుముని ఒక గిన్నెలోకి తీసుకోండి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి కడాయి పెట్టి పావు కప్పు నీళ్లు పోయండి. ఇందులో కప్పు బెల్లం తురుము వేసుకుని కరిగించండి. బెల్లం కరిగిన తర్వాత పచ్చి కొబ్బరి తురుముని వేసి కలపండి.
  • స్టఫింగ్​లోని నీళ్లు ఇగిరిపోయి దగ్గర పడిన తర్వాత ఒక టీస్పూన్​ యాలకులు పొడి, టీస్పూన్ నెయ్యి వేసి బాగా కలపండి.
  • తర్వాత ఈ పచ్చికొబ్బరి బెల్లం మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్​ బాల్స్​ ప్రిపేర్​ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
  • పాల ముంజల్లోని పై పిండి తయారీ కోసం స్టవ్​పై కడాయి పెట్టి 2 కప్పుల పాలు, 2 టీస్పూన్లు చక్కెర వేసి వేడి చేయండి.
  • పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత లో ఫ్లేమ్​లో మంట అడ్జస్ట్​ చేసి అరకప్పు చొప్పున బొంబాయి రవ్వ, బియ్యం పిండి, చిటికెడు ఉప్పు వేసి ఉండలు కట్టకుండా బాగా కలపాలి.
  • పిండి కాస్త దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
  • పిండి చల్లారిన తర్వాత చేతులకు నెయ్యి అప్లై చేసుకొని పెద్ద సైజ్​ నిమ్మకాయ మాదిరిగా ఉండలు చేసుకోవాలి.
  • ఇప్పుడు ఒక ఉండను చేతిలోకి చిన్న అప్పాలుగా చేసుకోవాలి. తర్వాత పచ్చికొబ్బరి బెల్లం స్టఫింగ్​ పెట్టి నిదానంగా క్లోజ్​ చేయాలి. ఇలా పిండితో పాల ముంజలు ప్రిపేర్​ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • అనంతరం స్టవ్​పై కడాయి పెట్టి డీప్​ ఫ్రైకి సరిపడా ఆయిల్​ వేసి వేడి చేయండి. నూనె వేడైన తర్వాత స్టవ్​ మీడియం ఫ్లేమ్​లో అడ్జస్ట్​ చేసి పాల ముంజలు వేసి రెండు నిమిషాలు అలా వదిలేయాలి.
  • తర్వాత గరిటెతో నిదానంగా తిప్పుతూ వేయించుకోవాలి.
  • పాల ముంజలు దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే మిగిలిన పాల ముంజలను వేయించుకుంటే సరి!
  • అంతే ఈ పద్ధతిలో పాల ముంజలు చేసుకుంటే చాలా రుచిగా వస్తాయి. ఇంట్లో వాళ్లందరూ ఇష్టంగా తింటారు. పాల ముంజలు తయారీ విధానం నచ్చితే మీరు ఓసారి ట్రై చేయండి.

"హెల్దీ పూరీలు" మైదా లేకుండా పెసరపప్పుతో ఇలా చేయండి! - టేస్ట్​ అద్భుతంగా ఉంటాయి!

కరకరలాడే "రాగి పిండి పకోడీ" - నూనె కూడా పీల్చవు - రుచి అదుర్స్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.