Onion Samosa Recipe in Telugu : చాలా మంది ఇష్టపడే స్ట్రీట్ ఫుడ్‌లో సమోసా కూడా ఒకటి. బయట టీ తాగుతున్నప్పుడు, సినిమాకు వెళ్లినప్పుడు ఎక్కువగా ఆనియన్ సమోసా తింటారు. కరకరలాడే ఆనియన్ సమోసాలను అందరూ ఇష్టపడతారు. ఇక్కడ చెప్పిన విధంగా ట్రై చేస్తే ఇంట్లోనే రుచికరంగా సమోసాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి, అందుకు కావాల్సిన పదార్థాలు ? తయారీ విధానం ? ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :
- మైదా - 1 కప్పు
- ఉల్లిపాయలు - 4
- కారం - అర టీస్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- గరం మసాలా - పావు టీస్పూన్
- నూనె - వేయించుకోవడానికి తగినంత
- వాటర్ - తగినన్ని

వేసవి వేడిని తరిమేసే "పుదీనా జల్ జీరా డ్రింక్" - అతి తక్కువ ఖర్చుతో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు!
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆపై వాటిని ఒక కాటన్ క్లాత్‌పై పరచి కనీసం ఒక గంటపాటు గాలికి ఆరబెట్టుకోవాలి.
- ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో కప్పు మైదా వేసుకోవాలి. ఇందులో తగినన్ని గోరువెచ్చని వాటర్ పోసుకుంటూ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి.
- పిండి సాఫ్ట్‌గా కలుపుకున్నాక కొద్దికొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
- ఇప్పుడు చపాతీ పీటపై కాస్త పొడి పిండి వేసుకొని ఒక ఉండను పెట్టి చపాతీలా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న చపాతీని ప్లేట్లో పక్కన పెట్టుకోండి. ఇలా ఉండలతో అన్నింటిని చపాతీలుగా ప్రిపేర్ చేసుకోవాలి.
- అనంతరం వాటిపై కాస్త నూనె అప్లై చేసుకొని కొద్దిగా పొడి మైదా చల్లుకోవాలి.
- ఇప్పుడు నాలుగు రోటీలను ఒకదానిపై ఒకటి ఉంచి పొడి పిండి చల్లుకుంటూ సాధ్యమైనంత వరకు మరోసారి పల్చగా రోల్ చేసుకోవాలి. అప్పుడు అది ఒక మందపాటి రోటీలా తయారవుతుంది.
- ఇప్పుడు స్టవ్‌పై ఐరన్ పెనం పెట్టుకొని దానిపై ఆ రోటీని ఉంచి కాసేపు కాల్చుకోవాలి.
- అయితే, పెనం పై ఎక్కువ సేపు కాల్చుకోవద్దని గుర్తుంచుకోండి. అలా చేస్తే అప్పడాల మాదిరిగా మారి సమోసా షీట్స్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది.
- పెనం మీద కాల్చుకున్న రోటీని చపాతీ పీటపై ఉంచి స్కేల్ సహాయంతో స్క్వేర్ షేప్‌లో ఉండేలా నాలుగు అంచులను కట్ చేసుకోవాలి చేసుకోవాలి.
- అనంతరం స్క్వేర్ షేప్‌లో ఉన్న రోటీని సగానికి కట్ చేసుకోవాలి. ఇప్పుడు వాటిని సమోసా సైజ్‌కు సరిపోయే విధంగా చిన్న చిన్న షీట్స్ చేసుకోవాలి.
- అయితే, ఈ ప్రాసెస్ అంతా పెనం మీద నుంచి రోటిని తీసిన వెంటనే జరిగిపోయేలా చూసుకోవాలి.
- చిన్న చిన్న షీట్స్గా కట్ చేసుకున్న తర్వాత వాటిలో నుంచి ఒక్కొక్క లేయర్‌ను విడదీసుకోవాలి. విడదీసి ప్లేట్లో ఉంచే సమోసా షీట్స్‌పై ఒక క్లాత్ కప్పుకోవాలి. లేదంటే అవి డ్రై అయిపోయి విరిగిపోతాయని గుర్తుంచుకోండి.

- ఇప్పుడు ఒక బౌల్లో ఆరబెట్టుకున్న ఆనియన్స్ తీసుకొని కారం, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి.
- అనంతరం సమోసా షీట్స్ సీల్ చేయడం కోసం ఒక చిన్న బౌల్లో పావు కప్పు మైదా తీసుకొని కొన్ని నీళ్లు యాడ్ చేసుకొని చిక్కని పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి.
- ఇప్పుడు ఒక సమోసా షీట్‌ను చేతిలోకి తీసుకొని సరిగ్గా ట్రై యాంగిల్ వచ్చేలా మలుచుకోవాలి.
- అప్పుడు అందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని కొద్దిగా ఉంచి అన్ని చివరలకు మైదా పేస్ట్ అప్లై చేసి చక్కగా క్లోజ్ చేసుకోవాలి.
- ఇలా సమోసాలు ప్రిపేర్ చేసుకుంటూ ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి.
- అనంతరం స్టవ్‌పై పాన్ పెట్టి నూనె పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మంటను లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్‌కు మెయింటైన్ చేస్తూ సమోసాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
- అనంతరం వేడివేడి సమోసాలను ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి.
- అంతే ఇలా ప్రిపేర్ చేసుకుంటే నోరూరించే "ఆనియన్ సమోసా" మీ ముందు ఉంటుంది!
"ఉడుపి స్టైల్ పాయసం" - టేస్ట్ సీక్రెట్ ఏమిటో తెలుసా? - మీరూ ఇలా ట్రై చేయండి!
మళయాళీల ఫేవరెట్ "ముట్టా కర్రీ!" - ఇలా చేస్తే రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!