How to Make Onion Chutney : ఇంట్లో కూరగాయలు ఏవి లేనప్పుడు ఉల్లిపాయలతో అద్దిరిపోయే పచ్చడి చేసుకోవచ్చు. అవునండి.. ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి టేస్ట్ చేశారంటే.. మళ్లీ మళ్లీ చేసుకోవాలని అనిపిస్తుంది. అంత బాగుంటుంది ఈ చట్నీ. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి వేసుకుంటే.. దిల్ ఖుష్ అవుతుందంటే నమ్మాల్సిందే. కేవలం అన్నంలోకి మాత్రమే కాదు.. ఇడ్లీ, దోశ, వడ వంటి ఏ టిఫెన్లోకైనా కూడా సూపర్‌గా ఉంటుంది. మరి, ఇంకెందుకు ఆలస్యం? ఈ టేస్టీ అండ్ స్పైసీ ఉల్లిపాయ పచ్చడి ఎలా తయారు చేయాలి? ఇది ప్రిపేర్ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి ? అనేవి తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ పూర్తిగా చదవండి.
ఉల్లిపాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు..
- ఎండు మిర్చి-6
- పెద్ద ఉల్లిపాయలు-3
- ఆవాలు-టీస్పూన్
- జీలకర్ర -టీస్పూన్
- మినప్పప్పు-స్పూన్
- పచ్చిమిర్చి-3
- చిన్న ఉసిరికాయంత చింతపండు
- ఉప్పు - రుచికి సరిపడా
తాళింపు కోసం..
- 2 స్పూన్ల నూనె
- అర స్పూన్- ఆవాలు
- చిటికెడు ఇంగువ
- 2 రెబ్బలు కరివేపాకు
తయారీ విధానం..
- పచ్చడ తయారీలో భాగంగా.. మొదట ఉల్లిపాయలు, పచ్చిమిర్చీని సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
- ఆ తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేయాలి.
- ఇప్పుడు పాన్‌లో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసి వేయించుకోవాలి. అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకుని ఒక నిమిషం సేపు వేపుకోవాలి.
- తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే పాన్‌లో ఉల్లిపాయ ముక్కలు వేసి, కొద్దిగా ఆయిల్ వేసి 2 నిమిషాలు వేపుకోవాలి. తర్వాత చింతపండు వేసుకుని మరొక నిమిషం వేపుకోవాలి.
- తర్వాత మిక్సీ జార్లో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు ఫ్రై చేసుకున్నవి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- అలాగే ఇందులో ఫ్రై చేసుకున్న ఆనియన్స్, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి.
- ఇప్పుడు తాళింపు కోసం నూనె వేసుకుని వేడి చేయాలి. ఇందులో ఆవాలు, ఇంగువ, రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి.
- తాళింపును గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చడిలో కలుపుకుంటే సరిపోతుంది.
- అంతే.. నోరూరించే ఉల్లిపాయ చట్నీ రెడీ.
- చాలా సింపుల్‌గా రెడీ అయ్యే ఈ పచ్చడిని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా లాగిస్తారు.
ఇవి కూడా చదవండి :
సూపర్ టేస్టీ "టమాటా కొబ్బరి చట్నీ" - దీని టేస్ట్‌కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!
ఆంధ్రా "గోంగూర నువ్వుల పచ్చడి" - ఈ ప్రిపరేషన్ స్టైలే కేక!
నోరూరించే "బీరకాయ టమాట పచ్చడి" - ఇలా ప్రిపేర్ చేస్తే రుచికి రుచీ ఆరోగ్యానికి ఆరోగ్యం!