ETV Bharat / offbeat

హోటళ్లలో ఎక్కడా దొరకని "హెల్దీ పచ్చడి" ఇది - ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది!

ఔషధ గుణాలున్న నల్లేరు పచ్చడి - ఇలా ఈజీగా చేసుకోండి

nalleru_pachadi_in_telugu
nalleru_pachadi_in_telugu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 18, 2025 at 4:02 PM IST

3 Min Read
Choose ETV Bharat

Nalleru pachadi in Telugu : తెలుగు రాష్ట్రాల్లో చేసుకున్న రోటి పచ్చళ్లు రుచి మాత్రమే కాదు ఎన్నో ఔషధ గుణాలు కూడా కలిగి ఉంటాయి. అలాంటి వాటిల్లో నల్లేరు పచ్చడి ఎంతో ముఖ్యమైనది. ఈ నల్లేరులో ఫ్లేవనాయిడ్లు, విటమిన్లు, ఖనిజాలు అనేక యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. (నల్లేరు ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ క్లిక్ చేయండి) ఇలాంటి ఎన్నో మంచి లక్షణాలున్న నల్లేరు పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

"జొన్న చపాతీలు" రోజూ చేసుకోవచ్చు - ఇలా ట్రై చేయండి - పెనంపై పొంగుతాయి!

nalleru_pachadi_in_telugu
nalleru_pachadi_in_telugu (ETV Bharat)

ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

  • ముందుగా చేతి వేళ్లకు నూనె రాసుకుని కాడల పీచు తీసుకోవాలి.
  • చాకుతో పీచు తొలగించుకుంటే మంచిది. లేదంటే దురద కలిగిస్తాయి.
  • పీచు తీసి పెట్టుకున్న నల్లేరు కాడలను ఉప్పు నీటిలో శుభ్రం చేసుకోవాలి.
  • రెండు, మూడు సార్లు ఉప్పు నీటిలో, చివరగా మంచి నీటిలో కడగాలి.
  • మిక్సీ పట్టుకోవడం కంటే రోట్లో రుబ్బుకుంటే రుచి ఎక్కువగా ఉంటుంది.
nalleru_pachadi_in_telugu
nalleru_pachadi_in_telugu (ETV Bharat)

కావాల్సిన పదార్థాలు

  • నల్లేరు కాడలు - పావుకిలో
  • నూనె - 1 టేబుల్ స్పూన్
  • పల్లీలు - 1 టేబుల్ స్పూన్
  • పచ్చిశనగ పప్పు - 1 స్పూన్
  • మినప్పప్పు - 1 స్పూన్
  • ధనియాలు - 1 స్పూన్
  • జీలకర్ర - 1 స్పూన్
  • ఎండు మిర్చి - 6
  • ఎండు కొబ్బరి - 2 టేబుల్ స్పూన్లు
  • ఉల్లిపాయలు -1
  • టమోటాలు - 1
  • పచ్చి మిర్చి - 6
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పసుపు - పావు టీ స్పూన్
  • చింతపండు - చిటికెడు
  • తెల్ల నువ్వులు - ఒక చెంచా
  • వెల్లుల్లి పాయలు - 6
nalleru_pachadi_in_telugu
nalleru_pachadi_in_telugu (ETV Bharat)

పోపు కోసం

  • నూనె - 1 స్పూన్
  • ఆవాలు - అర స్పూన్
  • పచ్చిశనగపప్పు - 1 స్పూన్
  • మినప్పప్పు - - 1 స్పూన్
  • జీలకర్ర - అర స్పూన్
  • ఎండు మిర్చి -3
  • కరివేపాకు - 1 రెమ్మ
  • తెల్ల నువ్వులు - అర స్పూన్
nalleru_pachadi_in_telugu
nalleru_pachadi_in_telugu (ETV Bharat)

తయారీ విధానం

  • ముందుగా ఒక కడాయిలో కొద్దిగా నూనె వేసుకుని పల్లీలు, పచ్చిశనగ పప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసుకుని సన్నటి సెగపై దోరగా వేయించాలి. ఆ తర్వాత ఎండు కొబ్బరి కూడా వేసుకుని కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత వీటిని ఒక ప్లేట్​లోకి తీసుకుని చల్లార్చుకోవాలి.
  • ఇపుడు ఓ కడాయిలో స్పూన్ నూనె పోసుకుని, ఉల్లిపాయలు, టమోటా ముక్కలు వేసుకుని వేయించాలి. 3నిమిషాల తర్వాత నల్లేరు కాడలు కూడా వేసుకుని ఆ తర్వాత పచ్చిమిర్చి చీలికలు వేయించుకోవాలి. ఐదారు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్​లో మాడిపోకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ మగ్గించుకోవాలి. 90శాతం ఉడికించుకున్న తర్వాత ఉప్పు, పసుపు, చింతపండు కొద్దిగా వేసుకుని వేయించాలి. చింత పండు పూర్తిగా ఆప్షనల్ ముందుగా టమోటా ముక్కలు వేసుకున్నాం కాబట్టి చింతపండు అవసరం పడదు. చివరగా ఒక చెంచా తెల్ల నువ్వులు వేసుకుని కలిపేసి మంట ఆర్పేస్తే సరిపోతుంది. ఈ సమయంలో పచ్చి వెల్లుల్లిపాయలు 6 వేసుకుని చల్లార్చుకోవాలి.
nalleru_pachadi_in_telugu
nalleru_pachadi_in_telugu (ETV Bharat)
  • ఇపుడు పోపు కోసం మరో కడాయి పెట్టుకుని నూనె వేసుకుని ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎండు మిర్చి వేసుకుని వేయించుకోవాలి. చివరగా కాస్త కరివేపాకు, తెల్ల నువ్వులు వేసుకుని దించుకుంటే సరిపోతుంది.
  • ఇపుడు మసాలా పేస్ట్ కోసం చల్లారిన పప్పులను మిక్సీ పట్టుకోవాలి. సగం రుబ్బుకున్న తర్వాత నల్లేరు, ఉల్లిపాయలు, టమోటా మిశ్రమాన్ని కూడా వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. మెత్తగా కావడానికి కొద్దిగా నీళ్లు చిలకరించుకుంటే సరిపోతుంది. ఈ సమయంలో వచ్చే వాసన ఎంతో కమ్మగా ఉంటుంది. చివరగా ఈ చట్నీని పోపు కలుపుకొని తింటుంటే అద్భుతంగా ఉంటుంది.

"పాయసం" ఇలా చేస్తే ఎవ్వరైనా 'ఫిదా' అవ్వాల్సిందే - ఈ టేస్ట్ సీక్రెట్ ఎవ్వరికీ చెప్పకండి!

లంచ్ బాక్సుల్లోకి సూపర్ రెసిపీ - అన్నీ కలిపేసి కుక్కర్​లో చేసుకోవడమే!