ETV Bharat / offbeat

"హెల్దీ పూరీలు" మైదా లేకుండా పెసరపప్పుతో ఇలా చేయండి! - టేస్ట్​ అద్భుతంగా ఉంటాయి! - MOONG DAL POORI RECIPE

మైదా, గోధుమపిండితో పూరీలు చేయడం అందరికీ తెలిసిందే! - కొత్తగా ఇలా తయారు చేసుకోండి

Moong Dal Puri Recipe In Telugu
Moong Dal Puri Recipe In Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 6, 2025 at 4:05 PM IST

2 Min Read

Moong Dal Puri Recipe In Telugu : సాధారణంగా హోటల్స్​లో మైదా పిండితో పూరీలు చేస్తుంటారు. కొందరు ఇంట్లో మైదా పిండితో కాకుండా గోధుమపిండితో పూరీలు ట్రై చేస్తుంటారు. అయితే, మీరు ఎప్పుడైనా పెసరపప్పుతో పూరీలు ప్రిపేర్​ చేశారా? ఇక్కడ చెప్పిన విధంగా పెసరపప్పు పూరీలు చేస్తే పొంగుతూ ఎంతో మృదువుగా వస్తాయి. మరి ఇక ఆలస్యం చేయకుండా సింపుల్​గా పెసరపప్పు పూరీలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

Moong Dal
Moong Dal (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • పెసరపప్పు - 1 కప్పు
  • గోధుమ పిండి - 1 కప్పు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • వేయించిన జీలకర్ర పొడి - అరటీస్పూన్
  • కారం - అరటీస్పూన్
  • గరంమసాలా - పావుటీస్పూన్
  • పసుపు - చిటికెడు
  • ఆయిల్ - వేయించడానికి తగినంత
Moong Dal Puri
Moong Dal Puri (ETV Bharat)

చికెన్ ముక్క తెల్లగా ఉంటే నచ్చట్లేదా?! - ఎండు మిర్చి పేస్ట్​తో "చిల్లీ చికెన్ కర్రీ" ఇలా చేయండి!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో పెసరపప్పు తీసుకొని రెండుమూడు సార్లు శుభ్రంగా నీటిలో కడగండి. ఆపై ఇందులో సరిపడా నీళ్లు పోసి అరగంటపాటు నానబెట్టుకోండి.
  • తర్వాత ఒక మిక్సీ గిన్నెలో నానబెట్టిన పెసరపప్పు నీళ్లు వడకట్టుకుని తీసుకోండి. ఇందులో కొన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
  • ఇలా గ్రైండ్​ చేసుకున్న పిండిని ఒక ఒక మిక్సింగ్ బౌల్​లో తీసుకోండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, కారం, గరంమసాలా, పసుపు ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని బాగా కలుపుకోవాలి.
  • అనంతరం గోధుమ పిండి వేసుకొని మిక్స్​ చేయాలి. ఈ పిండి కలపడం కోసం నీళ్లు యాడ్​ చేయాల్సిన అవసరం లేదు. పూరీలు చేయడం కోసం పిండి పూరీ పిండిలా కాస్త గట్టిగానే ఉండాలి. పిండిని ఎంత బాగా వత్తుకుంటే పూరీలు పొంగుతూ, అంత సాఫ్ట్​గా వస్తాయి.
  • ఆ విధంగా పిండిని రెడీ చేసుకున్న తర్వాత టేబుల్​స్పూన్ నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఆపై గిన్నెపై మూత పెట్టి 15 నిమిషాలు అలా వదిలేయండి.
  • ఇప్పుడు కొద్దికొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
  • అనంతరం చపాతీ పీటపై ఒక ఉండను పెట్టి కాస్త పొడి పిండి చల్లుకుంటూ పూరీ మాదిరిగా రోల్ చేసుకోవాలి.
  • ఇలా రోల్ చేసుకున్న పూరీలను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​పై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్​ బాగా వేడయ్యాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూరీలని వేసి వదిలేయాలి.
  • తర్వాత చిల్లుల గరిటెతో పూరీలను రెండు వైపులా దోరగా ఫ్రై చేసుకోవాలి.
  • చక్కగా వేగిన పూరీలను ఒక ప్లేట్లోకి తీసుకోండి. మిగిలిన పిండితో ఇలా సింపుల్​గా పూరీలు చేసుకుంటే సరి!
  • ఇలా చేసిన పెసరపప్పు పూరీలు చాలా రుచిగా ఉంటాయి. పెసరపప్పుతో చేసిన పూరీలు హెల్దీ. ఈ పూరీ తయారీ విధానం నచ్చితే మీరు ఓసారి ట్రై చేయండి.

పాలు, పంచదార లేకుండా స్వీట్ - ఇంట్లో ఉండే వాటితో ఇలా చేస్తే నోట్లో వెన్నలా కరిగిపోతుంది!

బర్డ్ ఫ్లూ భయంతో "చికెన్ కర్రీ" మిస్ అవుతున్నారా? " - ఇలా చేస్తే రుచి అచ్చం కోడికూరలానే ఉంటుంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.