ETV Bharat / offbeat

కరకరలాడే "మినప గట్టి గారెలు" - ఇలా చేస్తే నూనె అస్సలు పీల్చవు! ఈవెనింగ్​ బెస్ట్ స్నాక్​! - MINAPA GATTI GARELU

పక్కా కొలతలతో "మినప గట్టి గారెలు" - సింపుల్​గా ఇలా ట్రై చేయండి!

Minapa Gatti Garelu Recipe in Telugu
Minapa Gatti Garelu Recipe in Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 8, 2025 at 1:28 PM IST

3 Min Read

Minapa Gatti Garelu Recipe in Telugu : సాధారణంగా పండుగ వేళల్లో, నాన్ వెజ్ కూరలు వండుకున్న సమయంలో మినప్పప్పు, పచ్చిశనగపప్పు కాసేపు నానబెట్టి గారెలు చేస్తుంటారు. అప్పటికప్పుడు చేసే ఈ గారెలు క్రిస్పీగా ఎంతో రుచిగా ఉంటాయి. అయితే, ఇప్పుడు మనం పొట్టు మినప్పప్పుతో కరకరలాడే "గట్టి గారెలు" ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ చెప్పిన విధంగా గట్టి గారెలు చేస్తే 2 వారాలపాటు తాజాగా ఉంటాయి. ఈవెనింగ్ టీ టైమ్​లో ఏదైనా​ కారంగా తినాలనుకునే వారికి ఈ రెసిపీ బెస్ట్​ ఆప్షన్!​

కావాల్సిన పదార్థాలు:

  • పొట్టుతో ఉండే మినప్పప్పు - 2 కప్పులు
  • పచ్చిశనగపప్పు - అరకప్పు
  • జీలకర్ర - 2 చెంచాలు
  • అల్లం ముక్కలు - 5
  • పచ్చిమిర్చి - 5
  • ఉప్పు - రుచికి సరిపడా
  • నూనె - డీప్​ ఫ్రైకి సరిపడా
Black Urad Dal
Black Urad Dal (Getty Images)

కరకరలాడే "మిరియాల కారపూస" - ఈ టిప్స్​ పాటిస్తే చాలు గుల్లగుల్లగా, రుచిగా వస్తాయి!

తయారీ విధానం:

Minapa Gatti Garelu Process
Minapa Gatti Garelu Process (ETV Bharat)
  • గట్టి గారెలు చేయడం కోసం ముందుగా పొట్టుతో ఉండే మినప్పప్పు శుభ్రంగా కడిగి 12 గంటలు నానబెట్టుకోవాలి. అనంతరం వీలైనంత పొట్టు కడిగి తీసుకోండి.
  • అలాగే అరకప్పు పచ్చిశనగపప్పు శుభ్రంగా కడిగి 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఆపై మరోసారి నీటితో శుభ్రంగా కడగాలి.
  • తర్వాత మినప్పప్పు, పచ్చిశనగపప్పు నీళ్లు పోయేలా జాలి గిన్నెలోకి తీసుకొని రెండు గంటలపాటు పక్కన పెట్టుకోవాలి.
  • ఒక మిక్సీ గిన్నెలో 2 చెంచాలు జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి పేస్ట్​ని చిన్న గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టండి.
  • ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేసి కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పప్పు ఎంత బరకగా ఉంటే గట్టి గారెలు అంత క్రిస్పీగా వస్తాయి.
  • ఆ విధంగా గ్రైండ్​ చేసుకున్న పిండిని ఒక మిక్సింగ్​ బౌల్లోకి తీసుకోండి. ఇందులో పచ్చిమిర్చి పేస్ట్​ వేసి బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్​లోనే రుచికి సరిపడా ఉప్పు చెక్​ చేసుకోవాలి.
  • అనంతరం ఒక కాటన్​ వస్త్రాన్ని నీళ్లతో తడిపి గట్టిగా పిండుకోవాలి. ఇప్పుడు మంచంపై కాటన్ క్లాత్​ పరిచి చేతి గాజు తీసుకొని అందులో కొద్దిగా పిండి ముద్దను పెట్టి ఫ్లాట్​గా వత్తుకోవాలి. అనంతరం మధ్యలో చిన్న హోల్ చేసుకోవాలి.
  • ఇలా పిండితో గట్టి గారెలు తయారు చేసుకోవాలి.
  • గారెలు ఫ్రై చేయడం కోసం స్టవ్​పై కడాయి పెట్టి సరిపడా ఆయిల్​ వేసి వేడి చేయండి.
  • ఆయిల్​ హీటైన తర్వాత రెడీ చేసుకున్న గారెలు ఆయిల్​లో వేసుకోండి.
  • స్టవ్​ మీడియం ఫ్లేమ్​లో అడ్జస్ట్​ చేసి గారెలు 50 శాతం వేయించండి. ఆ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత గారెలను ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలానే మిగిలిన గారెలు ఫ్రై చేసుకొని కాసేపు చల్లారనివ్వండి.
Minapa Gatti Garelu
Minapa Gatti Garelu (ETV Bharat)
  • తర్వాత వేడివేడిగా ఉన్న నూనెలో మరోసారి సగం వేగిన గారెలు వేసుకొని ఎర్రగా మారే వరకు కలుపుతూ వేయించండి.
  • గారెలు క్రిస్పీగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి.
  • గట్టి గారెలు పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్​టైట్​ డబ్బాలో స్టోర్​ చేసుకుంటే 2 వారాల పాటు నిల్వ ఉంటాయి.
  • అంతే ఇలా సులభంగా చేసుకుంటే కరకరలాడే మినప గట్టి గారెలు రెడీ! ఈవెనింగ్ టైమ్ ఏదైనా స్నాక్​ తినాలనిపిస్తే ఇవి రెండు తింటే చాలు. గట్టి గారెలు తయారీ విధానం నచ్చితే మీరు ఓసారి ట్రై చేయండి.

"ప్యూర్ వెజ్ ఆమ్లెట్" - రుచి చూస్తే ఎగ్​ ఆమ్లెట్ మర్చిపోతారు! అంత బాగుంటుంది!

పల్లీ, పుట్నాలు లేకుండానే ఇడ్లీ, దోసెల్లోకి సూపర్ చట్నీ - వారం రోజులు నిల్వ ఉంటుంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.