ETV Bharat / offbeat

365 రోజులూ తాగాల్సిన అంబలి - అద్దిరిపోయే రుచి, అద్భుతమైన ఆరోగ్యం!

- ఎంతో మేలు చేసే సిరిధాన్యాల అంబలి - ప్రతి ఒక్కరూ తప్పకుండా తినాల్సిన రెసిపీ

Millets Ambali
Millets Ambali (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 18, 2025 at 2:54 PM IST

2 Min Read
Choose ETV Bharat

Ambali : "ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా" అంటూ ఆరోగ్యంతో సంబంధం లేకుండా నచ్చిన ఫుడ్ ఐటమ్ తినేస్తుంటారు కొందరు! ఆరోగ్యమే ప్రధానం అంటూ రుచికరంగా లేని ఆహారాన్ని కూడా కొలుచుకొని మరీ తింటుంటారు మరికొందరు!! అయితే ఇటు అద్భుతమైన ఆరోగ్యాన్ని, అటు చక్కటి రుచిని అందించే ఆహార పదార్థాలు కూడా కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి అంబలి!

వేసవి కాలంలో ఒంటికి ఎంతో మేలు చేస్తుంది. అటు మిగిలిన కాలాల్లో కూడా పొట్టలో ప్రోబయోటిక్స్​ను పెంపొందిస్తూ ఎంతో ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అయితే ఈ అంబలిని మిల్లెట్స్​తో చేస్తే పూర్తిస్థాయి ప్రయోజనాలు అందుతాయని నిపుణులు చెబుతుంటారు. మరి, సిరి ధాన్యాలతో ఈ అంబలిని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలేంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.

సిరిధాన్యాల అంబలి
సిరిధాన్యాల అంబలి (ETV Bharat)

కావాల్సిన పదార్థాలు :

  • మిల్లెట్స్ ఏవైనా సరే (కొర్రలు, అండు కొర్రలు, ఊదలు, అరికెలు, సామలు) 1 కప్పు
  • 10 కప్పుల నీళ్లు

తయారీ విధానం :

  • ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి, మిల్లెట్స్​ వేసుకొని వాటిని దోరగా వేయించుకోవాలి. మంచి సువాసన వస్తుండగా దింపేయాలి.
  • ఆ తర్వాత వాటిని ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి. నీళ్లు మొత్తం వంపేసిన తర్వాత మిల్లెట్స్​ను మిక్సీ పట్టుకోవాలి.
  • పూర్తిగా మెత్తగా కాకుండా మూడ్నాలుగు ఫల్ప్స్​ ఇస్తే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేయడం ద్వారా కాస్త గింజలు, కాస్త పలుకు, కాస్త పిండి ఇలా మూడు దశల్లో ఉంటుంది.
సిరిధాన్యాల అంబలి
సిరిధాన్యాల అంబలి (ETV Bharat)
  • ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని, అందులో ఈ మిక్సీ పట్టిన మిల్లెట్స్​ను వేసుకొని 4 కప్పుల నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. (పైన చెప్పుకున్న 10 కప్పుల నీటిలో నుంచే తీసుకోవాలి.)
  • ఆ తర్వాత మట్టి పాత్ర తీసుకొని, అందులోకి మిల్లెట్ మిశ్రమాన్ని వడకట్టుకోవాలి. (వడ కట్టగా మిగిలిన మిల్లెట్స్​ను ఆ పాత్రలోనే ఉండనివ్వండి)
  • ఇప్పుడు ఈ మట్టి పాత్రను స్టౌ మీద పెట్టి ఆ లిక్విడ్​ను ఉడకనివ్వాలి. వేడెక్కిన తర్వాత పాత్రలో మిగిలిన మిల్లెట్స్​ను కూడా ఇందులో వేసేయాలి.
సిరిధాన్యాల అంబలి
సిరిధాన్యాల అంబలి (ETV Bharat)
  • మరోవైపు 10 కప్పుల నీటిలో 4పోగా మిగిలిన 6 కప్పులను వేరే గిన్నెలో పోసుకొని స్టౌమీద పెట్టి వేడిచేస్తూ ఉండండి.
  • ఇప్పుడు మట్టిపాత్రలోని మిల్లెట్స్​ లిక్విడ్ దగ్గరవుతున్నకొద్దీ.. పక్కన వేడవుతున్న 6 కప్పుల నీటిలోంచి కొద్ది కొద్దిగా తీసుకొని అందులో పోస్తూ కలుపుతూ ఉండాలి. (మూడు సార్లు 2 కప్పుల చొప్పున పోస్తే సరిపోతుంది)
  • కుక్ అవుతున్న మిల్లెట్స్​ను కలుపుతూ ఉండకపోతే ఉండలు కట్టే అవకాశం ఉంటుంది.
  • మొత్తం ఉడకడానికి గంట వరకూ సమయం పడుతుంది.
  • ఉడికిన తర్వాత దించేసి, ఒక ఖద్దరు క్లాత్ తీసుకొని ఆ మట్టి పాత్రను మూసేయండి. దాని పైనుంచి ప్లేట్ పెట్టాలి.
  • ఈ మట్టి పాత్రను 5 నుంచి 10 గంటల వరకు పక్కన ఉంచాలి. ఈ సమయంలో చక్కగా ఫర్మెంట్ అవుతూ ఉంటుంది. (ఎండా కాలంలో ఐదు గంటలు సరిపోతుంది. చలికాలంలో పది నుంచి 12 గంటలు కూడా పట్టొచ్చు.)
సిరిధాన్యాల అంబలి
సిరిధాన్యాల అంబలి (ETV Bharat)
  • ఆ తర్వాత క్లాత్ తీసేసి ఒకసారి కలుపుకొని, ఉప్పు వేసుకొని నచ్చిన కూరలతో లాగించొచ్చు.
  • పెరుగు వేసుకొని జావలాగా చేసుకొని తాగేయవచ్చు కూడా! ఆవయకాయతోనూ అద్భుతంగా ఉంటుంది.
  • ఈ అంబలి పొట్టలో ప్రోబయాటిక్స్ ను ఊహించని స్థాయిలో పెంచి, ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తుందని, రుచికూడా బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.

నాలుకను లబలబలాడించే "షార్జా షేక్" - ఈ కేరళ డ్రింక్ టేస్ట్ అదుర్స్!