Meal Maker Manchurian Recipe in Telugu : రెస్టారెంట్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్‌లో లభించే మంచూరియా ఇష్టపడని వారు ఉండరు. స్పైసీగా, జ్యూసీగా ఉండే మంచూరియా పిల్లలు, పెద్దలందరూ ఇష్టంగా తింటారు. నార్మల్‌గా మంచూరియా క్యాబేజీతో చేస్తుంటారు. అయితే, మీరు ఎప్పుడైనా మీల్ మేకర్‌తో మంచూరియా ట్రై చేశారా? ఇక్కడ చెప్పిన విధంగా మీల్ మేకర్ మంచూరియా చేస్తే టేస్ట్ అద్దిరిపోతుంది. మరి ఇక ఆలస్యం చేయకుండా మీల్ మేకర్ మంచూరియా ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :
- మీల్ మేకర్స్ - కప్పు
- ఉప్పు - రుచికి సరిపడా
- కార్న్‌ఫ్లోర్ - 2 టేబుల్‌స్పూన్లు
మంచూరియా ఫ్రై కోసం
- షెజ్వాన్ సాస్/చిల్లీ సాస్ - 2 టీస్పూన్లు
- సోయా సాస్ - 2 టీస్పూన్లు
- ఆయిల్ - తగినంత
- వెల్లుల్లి ముక్కలు - 1 టీస్పూన్
- అల్లం ముక్కలు - 1 టీస్పూన్
- సన్నగా తరుక్కున్న ఆనియన్స్ - కొన్ని
- పచ్చిమిర్చి - 2
- టమోటా సాస్ - టేబుల్‌స్పూన్లు
- సోయా సాస్ - అర టీస్పూన్
- వెనిగర్ - 1 టీస్పూన్
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- స్ప్రింగ్ ఆనియన్స్ తరుగు - కొంచం
- 200 ml వాటర్
- చైనీస్ చిల్లీ సాస్ లేదా షేజ్వాన్ - టేబుల్‌స్పూన్
- వైట్ పెప్పర్ పౌడర్ - అరటీస్పూన్
- వెజ్ అరోమాటిక్ పౌడర్ - అరటీస్పూన్
- మిరియాల పొడి - అరటీస్పూన్

తయారీ విధానం :
- ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకొని మూడు కప్పుల వాటర్, కొద్దిగా ఉప్పు వేసి నీళ్లు మరిగించుకోవాలి.
- నీళ్లు మరుగుతున్నప్పుడు మీల్ మేకర్స్ అందులో వేసి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
- ఆపై వాటిని ఒక గిన్నెలో చల్లటి నీళ్లు పోసి అందులోకి తీసుకోండి.
- రెండు నిమిషాల తర్వాత చేతితో మీల్ మేకర్స్‌లోని నీటిని గట్టిగా పిండి ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి.
- ఇందులోకి 2 టేబుల్‌స్పూన్లు కార్న్‌ఫ్లోర్, కొద్దిగా ఉప్పు వేసి మీల్ మేకర్స్‌కి పిండి బాగా కోట్ చేయండి.
- తర్వాత స్టవ్‌పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత నూనె వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక మీల్ మేకర్స్‌ని ఒక్కొటిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి.
- మీల్ మేకర్స్ చక్కగా వేగి క్రిస్పీగా, గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకోవాలి.
- మీల్ మేకర్ మంచూరియా చేయడం కోసం స్టవ్‌పై కడాయి పెట్టండి. ఇందులో రెండు టేబుల్స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేయండి. ఆపై సన్నని ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వెల్లుల్లి, అల్లం ముక్కలు వేసి హై ఫ్లేమ్ మీద కాసేపు ఫ్రై చేసుకోవాలి.
- అనంతరం టేబుల్‌స్పూన్ చైనీస్ చిల్లీ సాస్ లేదా షేజ్వాన్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ కోసం కారం మాత్రం ఉపయోగించకూడదు.
- ఇప్పుడు టీస్పూన్ వెనిగర్, అర టీస్పూన్ సోయా సాస్, టేబుల్‌స్పూన్ టమోటా కెచప్ వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి.
- అనంతరం 200 ml వాటర్ పోసి కలిపి ఒక పొంగు వచ్చే వరకు బాగా మరిగించుకోవాలి.

- ఆపై అరటీస్పూన్ చొప్పున వెజ్ అరోమాటిక్ పౌడర్, వైట్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపండి.
- అనంతరం ఫ్రైడ్ మీల్ మేకర్ వేసి హై ఫ్లేమ్ మీద నిమిషం పాటు వేయించండి.
- చివరిగా కాస్త కొత్తిమీర తరుగు, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే ఇలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకుంటే మీల్ మేకర్ మంచూరియా రెడీ!
బాలికలకు బలాన్నిచ్చే "బియ్యం పిండి పిట్టు"- ఆడపిల్లలు, మహిళలు తప్పక తినాల్సిన స్వీట్ ఇది!
బర్త్‌డే, పెళ్లిరోజుల్లో సింపుల్‌గా ఈ స్వీట్ చేసుకోండి - హల్వాను మించే చెట్టినాడు స్పెషల్ "ఉక్కారై"