ETV Bharat / offbeat

కమ్మటి "పచ్చి మామిడికాయ రసం" - ఈ సీజన్​లో అస్సలు మిస్ కాకండి - సింపుల్​గా ట్రై చేయండిలా! - MAMIDIKAYA RASAM

మార్కెట్లో పచ్చి మామిడికాయలు - ఇలా టేస్టీ పచ్చి మామిడికాయ రసం ట్రై చేయండి!

Mamidikaya Rasam Recipe in Telugu
Mamidikaya Rasam Recipe in Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 16, 2025 at 10:48 AM IST

3 Min Read

Mamidikaya Rasam Recipe in Telugu : చాలా మంది ఈ సీజన్​లో లభించే మామిడితో తురుము పచ్చడి, పులిహోర, మామిడికాయ పప్పు వంటి రెసిపీలు ట్రై చేస్తున్నారు. పచ్చి మామిడితో చేసిన ఏ వంటలైనా పుల్లపుల్లగా నోటికి ఎంతో రుచిగా ఉంటాయి. అయితే, పచ్చి మామిడికాయతో రసం ఎక్కువ మందికి చేయడం రాకపోవచ్చు. అలాంటి వారు ఇక్కడ చెప్పిన విధంగా ఓసారి ప్రయత్నించండి. ఈ మామిడికాయ రసం తినడమే కాకుండా ఓ గ్లాసు తాగేస్తారు! రుచి అంత బాగుంటుంది. మరి సింపుల్​గా మామిడికాయ చారు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

Mamidikaya
Mamidikaya (Getty Images)

కావాల్సిన పదార్థాలు:

  • మిరియాలు - 1 టీ స్పూన్​
  • పచ్చి మామిడికాయ - 1 (మీడియం సైజ్​)
  • వెల్లుల్లి రెబ్బలు - 5
  • అల్లం - చిన్న ముక్క
  • పసుపు- పావు టీ స్పూన్​
  • ఉప్పు - రుచికి సరిపడా
  • ఆవాలు - అర టీ స్పూన్​
  • మినపప్పు - అర టీ స్పూన్​
  • నూనె - 2 టేబుల్​ స్పూన్లు
  • పచ్చి శనగపప్పు - అర టీ స్పూన్​
  • జీలకర్ర - అర టీ స్పూన్​
  • ఎండు మిర్చి - 2
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • నీళ్లు - 1 లీటర్​
  • టమోట - 1
  • పచ్చిమిర్చి - 4
  • బెల్లం తురుము - 1 టీ స్పూన్​
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
Pepper
Pepper (Getty Images)

మహారాజులు ధరించిన వజ్రం - వచ్చే నెలలోనే "గోల్కొండ బ్లూ" డైమండ్ వేలం - కళ్లు చెదిరే ధర!

తయారీ విధానం:

  • ఇందుకోసం ముందుగా పచ్చిమామిడి పై తొక్కు తీసి శుభ్రంగా కడగండి. ఆపై చిన్న చిన్న ముక్కలుగా కట్​ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
Mamidikaya
Mamidikaya (ETV Bharat)
  • అనంతరం మిక్సీ గిన్నె​లోకి మిరియాలు వేసి మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి. ఆపై ఇందులోకే అల్లం, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్​ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
  • ఇప్పుడు మిక్సీ గిన్నె​లోకి మామిడి ముక్కలు, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా వాటర్​ పోసుకుని మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • అనంతరం స్టవ్​ ఆన్​ చేసి కడాయి పెట్టి నూనె పోసుకోవాలి. ఆయిల్​ హీటెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి.
  • తాలింపు చక్కగా వేగిన తర్వాత కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్​ చేసుకున్న మిరియాల మిశ్రమం వేసుకుని ఓ రెండు నిమిషాలు మగ్గించుకోవాలి.
  • ఇప్పుడు గ్రైండ్​ చేసుకున్న పచ్చిమామిడి పేస్ట్​ వేసుకుని పచ్చి వాసన పోయేవరకు ఐదు నిమిషాలు లో ఫ్లేమ్​లో మగ్గించుకోండి.
  • పచ్చివాసన పోయిన తర్వాత లీటర్​ వాటర్​ పోసి బాగా కలుపుకోండి.
  • ఆపై టమోటను చిదిమి వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా మిక్స్ చేయాలి. ఈ స్టేజ్​లోనే మామిడికాయ రసంలో రుచికి సరిపడా ఉప్పు, కారం చెక్​ చేసుకోండి.
  • నార్మల్​గా రసంలో మిరియాలు, పచ్చిమిర్చిలోని ఘూటు సరిపోతుంది. ఒకవేళ మీకు ఘాటు సరిపోలేదనుకుంటే మీరు తినే కారానికి తగినట్లుగా కారం వేసుకొని కలుపుకోండి.
  • ఆపై స్టవ్​ని మీడియం ఫ్లేమ్​లో పెట్టి దాదాపు 15 నిమిషాలు మరిగించుకోవాలి.
  • రసం మరిగిన తర్వాత కొద్దిగా బెల్లం తురుము వేసి కలిపి లో ఫ్లేమ్​లో మరో 5 నిమిషాలు మరిగించుకోవాలి.
  • చివరిగా మామిడికాయ రసంలో కాస్త కొత్తిమీర తరుగు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే ఇలా సింపుల్​గా ప్రిపేర్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మామిడికాయ రసం రెడీ!
  • ఈ మామిడికాయ రసం తయారీ విధానం నచ్చితే మీరు ఓసారి ట్రై చేయండి.

చల్ల చల్లని "ఠండాయి" - ఇదొక్కసారి తాగితే ఇంకో డ్రింక్ గుర్తుకు రాదు! అంత బాగుంటుంది!

పాల పొడి​, క్రీమ్ లేకుండానే "కూల్​ ఐస్​క్రీమ్​" - ఇలా చేస్తే టేస్ట్​ అస్సలు మర్చిపోలేరు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.