ETV Bharat / offbeat

మండు వేసవిలో మజానిచ్చే "లెమన్​ పంచ్​" - ఒక్కో సిప్​ తాగుతుంటే ఆ కిక్కే వేరు! - HOW TO MAKE LEMON PUNCH

-అతి తక్కువ పదార్థాలతో అద్దిరిపోయే రుచితో లెమన్​ జ్యూస్​ - సింపుల్​గా ప్రిపేర్ చేసుకోండిలా!

How to Make Lemon Punch
How to Make Lemon Punch (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 30, 2025 at 2:59 PM IST

2 Min Read

How to Make Lemon Punch : "లెమన్​ జ్యూస్​" - ఎండాకాలంలో చాలా మంది ఫేవరెట్​ డ్రింక్​. ఏదైనా పని మీద బయటికి వెళ్లినప్పుడు రోడ్​ సైడ్​ కనిపించే బండి దగ్గర చాలా మంది దీనిని టేస్ట్​ చేసే ఉంటారు. తియ్యగా, పుల్లగా, ఉప్పగా ఉండే దీనిని చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తాగుతారు.

ఇంట్లో కూడా నిమ్మకాయలతో చాలా మంది ఈ డ్రింక్​ తయారు చేస్తుంటారు. అయితే ఎప్పుడూ తాగినట్లు నిమ్మరసం పిండి, ఉప్పు, పంచదార కలిపి తాగితే ఏం బాగుంటుంది. అందుకే ఈసారి వెరైటీగా దీనిని ట్రై చేయండి. అదే లెమన్​ పంచ్​. కేవలం 5 నిమిషాల్లో తయారయ్యే ఈ డ్రింక్​ను ఒక్కొక్క సిప్​ తాగుతుంటే ఫుల్​ కిక్​ వస్తుంది. మరి లేట్​ చేయకుండా ఈ లెమన్​ పంచ్​ను ఇంట్లో ఎలా చేయాలో ఈ స్టోరీలో చూద్దాం.

Lemon Juice
Lemon Juice (Getty Images)

కావాల్సిన పదార్థాలు:

  • నిమ్మకాయలు - 2
  • ఉప్పు - పావు చెంచా
  • పచ్చిమిర్చి - 1
  • పంచదార - 3 టేబుల్​స్పూన్లు
  • ఐస్​క్యూబ్స్​ - తగిన్నని
  • చల్లటి నీళ్లు - 300ml
Green Chilli
Green Chilli (Getty Images)

తయారీ విధానం:

  • ఈ లెమన్​ పంచ్​కు అవసరమైన పదార్థాలన్నీ ముందు ప్రిపేర్​ చేసుకోవాలి. అందుకోసం నిమ్మకాయలను సగానికి కోసి రసం పిండి పక్కన ఉంచాలి.
  • అలాగే పచ్చిమిర్చిని వీలైనంత సన్నగా, రౌండ్​గా కట్​ చేసి పక్కన ఉంచాలి.
  • వెడల్పు మూత కలిగిన బాటిల్​లోకి నిమ్మరసం, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, పంచదార, 5 ఐస్​క్యూబ్స్, చల్లటి నీళ్లు​ పోసి ఓ రెండు నిమిషాల పాటు ఆపకుండా షేక్​ చేయాలి.
Ice Cubes
Ice Cubes (Getty Images)
  • ఓ గాజు గ్లాస్​లోకి మరో 3 ఐస్​క్యూబ్స్​ వేసి మిక్స్​ చేసుకున్న లెమన్​ మిశ్రమాన్ని పోసుకుని సర్వ్​ చేసుకుంటే జిల్​ అనిపించే లెమన్​ పంచ్​ రెడీ. పైన చెప్పిన కొలతలన్నీ ఒక సర్వింగ్​కు సరిపోతాయి. ఇద్దరు, ముగ్గురికి చేసుకోవాలనుకుంటే పైన చెప్పిన పదార్థాలను మీకు కావాల్సిన పరిమాణంలో తీసుకోవాలి.
Lemon Punch
Lemon Punch (ETV Bharat)

టిప్స్​:

  • బాటిల్​ బదులు లెమన్​ పంచ్​ చేయడానికి బయట మార్కెట్లో షేకర్​ బాటిల్స్​ అని సెపరేట్​గా దొరుకుతాయి. వాటిని ఉపయోగించవచ్చు.
  • మీరు తీసుకునే నిమ్మకాయలు మరీ లేతగా, మరీ పండినవి కాకుండా చూసుకోవాలి. అప్పుడే రుచి బాగుంటుంది.
  • ఇందులో ఉపయోగించిన పచ్చిమిర్చిని తింటూ ఈ డ్రింక్​ తాగాలి. అప్పుడే దీని టేస్ట్​ బాగుంటుంది.

టేస్టీ అండ్​ హెల్దీ "క్యారెట్​ యాపిల్​ జ్యూస్​" - ఒక్క గ్లాస్​తో ఎండల నుంచి బిగ్​ రిలీఫ్​!

ఇదొక్కటి వేసి "పుచ్చకాయ జ్యూస్" చేసుకోండి - జ్యూస్ సెంటర్​ని మించిన టేస్ట్​తో భలేగా ఉంటుంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.