ETV Bharat / offbeat

కుక్కర్​లో చేసుకునే "కట్టె పొంగలి" - ఈ టిప్స్​తో చేస్తే కమ్మగా నోట్లో వెన్నలా కరిగిపోతుంది! - KATTE PONGALI RECIPE

అందరికీ ఇష్టమైన కట్టె పొంగలి - ఇలా చేస్తే రుచి చాలా బాగుంటుంది!

Katte Pongali Recipe in Telugu
Katte Pongali Recipe in Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 20, 2025 at 3:21 PM IST

2 Min Read

Katte Pongali Recipe in Telugu : చాలా మంది ఇంట్లో పండగలప్పుడు కట్టె పొంగలి చేస్తుంటారు. గుడిలో ప్రసాదంగా పెట్టే కట్టె పొంగలి అందరికీ ఇష్టమే! ఘుమఘుమలాడే వాసనతో అద్భుతమైన రుచిని కలిగిన కట్టె పొంగలి మరికొంతమంది ఉదయం టిఫిన్​లోకి కూడా చేసుకుంటారు. అయితే, కమ్మటి కట్టె పొంగలి ఇంట్లోనే సింపుల్​గా కుక్కర్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Katte Pongali Recipe in Telugu
Katte Pongali Recipe in Telugu (ETV Bharat)

కావాల్సిన పదార్థాలు :

  • బియ్యం - 1 కప్పు
  • పెసరపప్పు - 1 కప్పు
  • వాటర్​ - 6 కప్పులు
  • నెయ్యి - ముప్పావు కప్పు
  • బటర్ - పావు కప్పు
  • అల్లం తరుగు - 2 టేబుల్​స్పూన్లు
  • మిరియాలు - 1 టేబుల్​స్పూన్
  • జీలకర్ర - అర టేబుల్​స్పూన్
  • పచ్చిమిర్చి - 8
  • ఎండుమిర్చి - 4
  • జీడిపప్పు పలుకులు - అర కప్పు
  • కరివేపాకు - 2
  • ఇంగువ - పావు టీస్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా

తయారీ విధానం :

  • ముందుగా స్టవ్​పై పాన్ పెట్టుకొని పెసరపప్పు వేసి లో ఫ్లేమ్​లో 8-10 నిమిషాల పాటు దోరగా వేయించుకుని ఓ గిన్నెలోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత వేయించిన పెసరపప్పులో బియ్యాన్ని పోసుకుని శుభ్రంగా రెండు మూడుసార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ బియ్యాన్ని, పప్పును వాటర్​ పోసి నానబెట్టాల్సిన అవసరం లేదు. కేవలం నీళ్లతో కడిగితే సరిపోతుంది.
  • ఇప్పుడు స్టవ్​ మీద కుక్కర్ పెట్టి బటర్ వేసుకుని కరిగించండి. ఆపై ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పు, బియ్యం మిశ్రమాన్ని వేసి మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. (ఇలా పెసరపప్పు, బియ్యం వేయించుకోవడం వల్ల కట్టె పొంగలికి కమ్మటి వాసన, మంచి రుచి వస్తుంది.)
  • ఆపై ఇందులో 6 కప్పుల వేడివేడి నీళ్లు పోసుకొని కుక్కర్​పై మూతపెట్టి మంటను మీడియం ఫ్లేమ్​లో 5 విజిల్స్​ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
  • తర్వాత కుక్కర్​లోని ప్రెజర్ పోయాక మూత తీసి ఉడికించుకోవాలి.
  • ఇప్పుడు తాళింపు కోసం వేరే స్టవ్​ మీద గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. వేడివేడి నెయ్యిలో మిరియాలు, అల్లం తరుగు, జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోవాలి.
  • అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీడిపప్పు వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి.
  • జీడిపప్పులు గోల్డెన్ కలర్​ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత కరివేపాకు, ఇంగువ వేసి ఒకసారి కలిపి స్టవ్​ ఆఫ్ చేసుకోవాలి.
  • ఇప్పుడు తాళింపును మరో బర్నర్ మీద ఉడికిస్తున్న పొంగలిలో వేసుకొని బాగా కలుపుకోవాలి.
  • అంతే ఇలా సింపుల్​గా ప్రిపేర్​ చేసుకుంటే ఎంతో రుచికరమైన "కట్టె పొంగలి" రెడీ!

"వడియాలు ఊరికే రావు!" - మిగిలిపోయిన అన్నంతో టేస్టీ, క్రిస్పీగా చేసుకునే సింపుల్ ట్రిక్!

మైదా పూరీలు మనకెందుకు?! - జొన్న పిండితో ఇలా చేస్తే సరికొత్త డిష్ రెడీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.