అప్పటికప్పుడు వేడివేడిగా తినాలనిపిస్తే "అక్కి రొట్టె" చేసుకోండి - స్నాక్స్, లంచ్బాక్సుల్లోకి అదుర్స్!
మృదువుగా ఉండే కర్ణాటక స్టైల్ అక్కి రొట్టె - అప్పటికప్పుడు ఇలా చేసుకోవడమే

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 6, 2025 at 1:13 PM IST
Akki rotte Recipe in Telugu : తెలుగు ప్రజలు ప్రాంతాల వారీగా తపాలా చెక్క, సర్వ పిండి అని పిలుచుకునే ఈ రెసిపీ కర్ణాటకలో కొద్దిగా భిన్నంగా ఉంటుంది. అక్కి రొట్టె అని పిలుచుకునే ఈ రెసిపీ తీరు మాత్రం కాస్త భిన్నంగా ఉంటుందంతే! ఇది స్నాక్స్‌గానూ, లంచ్ లోకి, టిఫిన్స్ గా కూడా చాలా బాగుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆల్‌రౌండ్ రెసిపీ ఇది. ఎంతో మృదువుగా, నోరూరించే రంగు, రుచితో ఉంటుంది. చేయడానికి పెద్దగా సమయం కూడా పట్టదు. అప్పటికప్పుడు కూరగాయలన్నీ తరుగుకొని బియ్యం పిండిలో కలుపుకోవడమే! వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తే ఇలా రెడీ చేసుకోండి
పప్పు నానబెట్టే పని లేకుండా "పూర్ణం బూరెలు" - కొత్తవాళ్లైనా అప్పటికప్పుడు ఇలా చేసుకోవచ్చు!

కావాల్సిన పదార్థాలు :
- ఉల్లిపాయ తరుగు - అర కప్పు
- పచ్చిమిర్చి - 2
- మెంతులు - పావు కప్పు
- కరివేపాకు - 2 రెమ్మలు
- క్యాప్సికమ్ - 1
- కొబ్బరి ముక్కలు - చిన్న సైజు
- అల్లం - కొద్దిగా
- బియ్యం పిండి - 2 కప్పులు
- జీలకర్ర - అర స్పూన్
- క్యారెట్ - 1
- కొత్తిమీర 1 చిన్ కట్ట
- ఉప్పు - రుచికి సరిపడా
- నూనె - 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం :
- అక్కి రొట్టె తయారీలోకి పిండి కలుపుకోవడమే ముఖ్యం. ఈ పిండి ఎంత బాగా కలుపుకొంటే రుచి అంత బాగుంటుందని గుర్తుంచుకోవాలి. కూరగాయల్లోని రసం అంతా పిండిలోకి ఇంకి పోయి వేడి వేడిగా తింటుంటే ఎన్ని తింటున్నామో కూడా తెలియదు.
- ముందుగా ఒక గిన్నెలోకి ఉల్లిపాయ తురుము, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఆపై సోయగూర, కరివేపాకు సన్నగా తరిగి వేసుకోవాలి. ఆ తర్వాత క్యాప్సికం ముక్కలు, అల్లం తరుగు, తాజా కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. వీటన్నింటినీ గట్టిగా పిండుతూ కలుపుకోవాలి. అన్నింటిని చేతితో కలుపుకున్నాక 2 కప్పుల బియ్యం పిండి పోసుకోవాలి. ఆపై జీలకర్ర, క్యారెట్ తరుగు, కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మరోసారి బాగా కలపాలి. పిండిని చేతిలో బాగా పిసుకుతూ కలుపుకొంటే రుచి చాలా బాగుంటుంది.

- ఇపుడు దాదాపు 2 కప్పుల వేడి వేడి నీళ్లు కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. పిండిని ఎంత ఎక్కువ సేపు కలుపుకొంటే అంత మంచిది. ఇపుడు టేబుల్ స్పూన్ నూనె వేసి మళ్లీ కలిపి 30 నిమిషాల పాటు నాన బెట్టుకోవాలి. మీకు సమయం తక్కువగా ఉంటే కనీసం 15 నిమిషాలైనా నానబెట్టాలని గుర్తుంచుకోండి.
- ఈ పిండిని రొట్టెలకు కావాల్సిన సైజులో ఉండలుగా చేసుకోవాలి. ఆపై అరటి ఆకు లేదా బటర్ పేపర్ పై చల్లగా చేతి వేళ్లతో పరుచుకుని పెనంపై వేసుకోవాలి. ఈ రొట్టెలు మీడియం ఫ్లేమ్‌లో నిదానంగా కాలనివ్వాలి. రెండు, మూడు నిమిషాలు ఓ వైపు కాల్చిన తర్వాత మరోవైపు తిప్పుకొని నూనె వేసుకుని కాల్చుకోవాలి. ఇవి వేడి వేడిగా చాలా సాఫ్ట్ గా ఉంటాయి. చల్లారిన తర్వాత గట్టిపడిపోతాయి. మీరు అదనపు రుచి కోరుకుంటే పిండి కలుపుతున్నపుడు నువ్వులు కూడా వేసుకోవచ్చు.
నోరూరించే "వంకాయ పెరుగు పచ్చడి" - ఈ పద్ధతిలో చట్నీ చేస్తే తృప్తిగా భోజనం చేస్తారు!
బొంబాయి రవ్వతో "గులాబ్ జామ్" - అప్పటికప్పుడు ఇలా చేస్తే జ్యూసీగా భలే ఉంటుంది!

