ETV Bharat / offbeat

"జొన్నరవ్వ కిచిడీ" - ఇలా చేస్తే టేస్ట్​ అద్దిరిపోతుంది! పైగా ఆరోగ్యం బోనస్​! - Jowar Khichdi

Jowar Khichdi Recipe : కిచిడి.. అంటే అందరికీ ఇష్టమే. ఎక్కువ మంది పప్పులు, కూరగాయలతో కిచిడి చేస్తుంటారు. అయితే, వీటితోనే కాకుండా జొన్న రవ్వతో కూడా కిచిడి చేయవచ్చు. పైగా టేస్ట్​కు టేస్ట్​.. ఆరోగ్యానికి ఆరోగ్యం. మరి ఈ కిచిడీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

author img

By ETV Bharat Features Team

Published : Sep 11, 2024, 4:47 PM IST

Jowar Khichdi
Jowar Khichdi Recipe (ETV Bharat)

How To Make Jowar Khichdi : అన్నం, పప్పు, కూర.. వంటివన్నీ చేసుకోవడం కాస్త కష్టంగా అనిపించినప్పుడు.. కిచిడి చేస్తుంటారు. అలాగే పిల్లల లంచ్​ బాక్స్​లోకి వివిధ రకాల కూరగాయలతో కిచిడి చేసి పెడుతుంటారు మమ్మీలు. పిల్లల కుడా ఎంతో ఇష్టంగా మెతుకు మిగల్చకుండా తింటారు. అయితే ఎప్పుడూ పప్పులు, కూరగాయలతోనే కాకుండా.. జొన్న రవ్వతోనూ కిచిడి చేయండి. ఈ కిచిడి ఎంతో రుచికరంగా ఉండడంతోపాటు, ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. మరి ఇంకెందుకు ఆలస్యం టేస్టీ అండ్​ హెల్దీ జొన్న కిచిడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • పెసలు- అర కప్పు
  • జొన్న రవ్వ- కప్పు
  • నెయ్యి -3 టేబుల్​స్పూన్లు
  • జీలకర్ర-టీస్పూన్​
  • దాల్చిన చెక్క
  • పచ్చిమిర్చిలు-2
  • కరివేపాకు
  • పసుపు - అరటీస్పూన్​
  • అల్లం తరుగు -టీస్పూన్​
  • తాజా బఠానీ-అరకప్పు
  • క్యారెట్​ ముక్కలు -అరకప్పు
  • లవంగాలు-4
  • బిర్యానీ ఆకు

తయారీ విధానం :

  • జొన్న కిచిడి కోసం ముందుగానే పెసలను నీటిలో 4 గంటలు నానబెట్టుకోవాలి. అలాగే జొన్న రవ్వను 6 గంటల నీటిలో నానబెట్టుకోవాలి.
  • తర్వాత స్టౌపై పాన్​ పెట్టి 2 టేబుల్​స్పూన్​ నెయ్యి వేసి.. దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసి వేయించండి.
  • అలాగే కరివేపాకు, అల్లం తరుగు, పచ్చిమిర్చిలు వేసి వేపండి. ఇప్పుడు తాజా బఠానీలు, క్యారెట్​ ముక్కలు వేసి మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గించండి. తర్వాత పసుపు వేయండి.
  • ఇప్పుడు పెసలను కడిగి ఇందులో వేసి 5 నిమిషాలు మగ్గించుకోండి. ఇందులోకి మూడు గ్లాసుల నీళ్లు పోయండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోని, నీటిని బాగా మరిగించండి.
  • ఇందులోకి జొన్న రవ్వ వేసుకుని సన్నని మంట మీద 15 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకుని దింపేసుకుంటే టేస్టీ జొన్న కిచిడి రెడీ.

ఈ కిచిడిలోకి "దోసకాయ రైతా" కాంబినేషన్​..

  • ముందుగా 2 కప్పుల పెరుగుని గిన్నెలోకి తీసుకుని బాగా చిలకాలి.
  • ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అరచెంచా వేయించిన జీలకర్ర పొడి, అరచెంచా మిరియాల పొడి, కొద్దిగా చాట్​ మసాలా వేసి కలపండి.
  • తర్వాత కప్పు కీరదోసకాయ తురుము, కొద్దిగా కొత్తిమీర వేసి కలపండి. అంతే ఇలా ప్రిపేర్​ చేస్తే దోసకాయ రైతా మీ ముందుంటుంది.
  • ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే.. జొన్న కిచిడి, దోసకాయ రైతా రెసిపీలను మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.

ఇవి కూడా చదవండి :

సగ్గుబియ్యంతో పసందైన వంటలు - టేస్ట్​ సూపర్​! తింటే వదిలిపెట్టరు!

వెజ్​.. నాన్ వెజ్​ కలిపి ఇలా వండేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.