ETV Bharat / offbeat

హెల్దీ "జొన్న పిండి ఇడ్లీలు" - ఎప్పుడంటే అప్పుడు ఇలా ఈజీగా చేసుకోవచ్చు! - JOWAR IDLI

"జొన్న రొట్టె" చేయడం రాని వాళ్లు ఇలా ఇడ్లీలు చేయండి - ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు

Jowar Idli Recipe in Telugu
Jowar Idli Recipe in Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 7, 2025 at 9:26 AM IST

2 Min Read

Jowar Idli Recipe in Telugu : బ్రేక్​ఫాస్ట్‌ అనగానే చాలా మందికి మెత్తని ఇడ్లీలు గుర్తుకొస్తుంటాయి. ఇడ్లీలు చేయాలంటే ఫ్రిడ్జ్​లో సరిపడా పిండి ఉందో లేదో చూస్తుంటాం. అయితే, ఇంట్లో ఇడ్లీ పిండి లేకపోతే ఓసారి ఇలా జొన్న పిండితో హెల్దీగా ఇడ్లీలు చేసుకోండి. ఈ జొన్న పిండి ఇడ్లీలు చాలా సాఫ్ట్​గా ఎంతో రుచిగా ఉంటాయి. జొన్న రొట్టెలు చేయడం రాని వారు కూడా ఈ ఇడ్లీలను ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. మరి టేస్టీ అండ్ హెల్దీ జొన్న ఇడ్లీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

హోటల్ దోసె పిండిలో వంట సోడా వేయరు - కానీ, కిటుకు అంతా అక్కడే!

Jowar Flour
Jowar Flour (Getty Images)

జొన్న పిండి ఇడ్లీ తయారీకి కావాల్సిన పదార్థాలు:

  • జొన్న పిండి - కప్పు
  • అరకప్పు - బొంబాయి రవ్వ
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కప్పు - పెరుగు
  • వంటసోడా - కొద్దిగా
Jowar Idli Recipe
Jowar Idli Recipe (ETV Bharat)

జొన్న పిండి ఇడ్లీ తయారీ విధానం:

  • ముందుగా ఒక మిక్సింగ్​ బౌల్లో కప్పు జొన్న పిండి, అరకప్పు బొంబాయి రవ్వ తీసుకోండి. ఇలా బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల ఇడ్లీలు ముందు రోజు పిండి పులియబెట్టినట్లు చక్కగా వస్తాయి. ఆపై ఇందులో కప్పు పెరుగు, అరకప్పు నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి.
  • పిండిని ఇడ్లీ పిండిలా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
  • అనంతరం పిండిలో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా వంటసోడా, కొన్ని నీళ్లు వేసి బాగా కలపండి.
  • ఇప్పుడు స్టవ్​ వెలిగించి ఇడ్లీ పాత్ర పెట్టి గ్లాసున్నర వాటర్​ పోసి మరిగించుకోవాలి.
Jowar Idli
Jowar Idli (ETV Bharat)
  • ఈ లోపు ఇడ్లీ ప్లేట్స్​కు కొద్దిగా ఆయిల్​ లేదా నెయ్యి అప్లై చేసి జొన్న పిండి మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇలా అన్ని ఇడ్లీ ప్లేట్స్​లోకి పిండిని వేసుకోవాలి.
  • ఇప్పుడు ఇడ్లీ పాత్రలోని వాటర్​ మరుగుతున్నప్పుడు ప్లేట్స్​ పెట్టి మూత పెట్టండి. ఈ ఇడ్లీలను 10 నుంచి 15 నిమిషాల పాటు హై ఫ్లేమ్​లో ఉడికించాలి.
Jowar Idli
Jowar Idli (ETV Bharat)
  • అనంతరం స్టవ్ ఆఫ్ చేయండి. ఇడ్లీలు చక్కగా ఉడికిన 5 నిమిషాల తర్వాత తీసి ప్లేట్​లోకి సర్వ్​ చేసుకోవాలి.
  • అంతే ఇలా సింపుల్​గా ప్రిపేర్ చేసుకుంటే ఎంతో హెల్దీ అయిన జొన్న ఇడ్లీ రెడీ.
  • ఈ జొన్న ఇడ్లీలు పల్లీ చట్నీ, టమోటా పచ్చడితో సూపర్​గా ఉంటాయి.
  • జొన్న ఇడ్లీ రెసిపీ నచ్చితే మీరూ ట్రై చేయండి.

"మిర్చీ బజ్జీ"లో మిరపకాయ వదిలేస్తున్నారా? -ఈ మసాలా పేస్ట్​తో చేస్తే ఎన్నైనా అలానే తినేస్తారు -అంత బాగుంటాయి!

పిల్లలు స్నాక్స్ అడిగితే అప్పటికప్పుడు ఇవి చేసి పెట్టండి - చాలా సింపుల్​, టేస్టీ టైంపాస్ స్నాక్స్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.