Jonna Idli Recipe in Telugu : ఇడ్లీ అనగానే మనందరి మనసులో తెల్లగా ఉండే ఇడ్లీలే మెదులుతుంటాయి. హోటల్స్, టిఫిన్ సెంటర్స్‌లోనే కాకుండా ఇంట్లోనూ చాలా మంది తెల్లటి ఇడ్లీ రవ్వతోనే వీటిని తయారు చేస్తుంటారు. అయితే, షుగర్, బీపీ వంటి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఇడ్లీలు తినడానికి వెనకడుగు వేస్తుంటారు. అలాగే బరువు తగ్గాలనుకునే వారు మిల్లెట్స్‌తో చేసిన ఆహారం తినడానికి ప్రయత్నిస్తారు. అయితే, ఈ స్టోరీలో చెప్పిన విధంగా జొన్నరవ్వతో ఇడ్లీలు చేసుకుంటే రుచి ఎంతో బాగుంటాయి. వీటిని పలు రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, వెయిట్‌లాస్ కోసం ప్రయత్నిస్తున్నవారు తీసుకోవచ్చు. మరి ఇంట్లోనే మృదువైన జొన్నరవ్వ ఇడ్లీలు చేయడానికి కావాల్సిన పదార్థాలు? తయారీ విధానం మీ కోసం!
కావాల్సిన పదార్థాలు :
- జొన్న రవ్వ - 3 గ్లాసులు
- మినప్పప్పు - 1 గ్లాసు
- ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం :
- ముందుగా ఒక బౌల్లో మినప్పప్పు తీసుకొని శుభ్రంగా కడిగి, తగినన్ని వాటర్ పోసుకొని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి.
- అలాగే, మరో బౌల్లో జొన్నరవ్వను తీసుకొని తగినన్ని వాటర్ పోసుకొని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి.
- మినప్పప్పు నానిన తర్వాత నీళ్లు వడకట్టుకొని మిక్సీ జార్‌లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
- ఇప్పుడు పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో నానబెట్టుకున్న జొన్నరవ్వను శుభ్రంగా కడిగి నీరు లేకుండా వడకట్టుకొని వేసుకొని మొత్తం మిశ్రమం పూర్తిగా కలిసేలా బాగా కలుపుకోవాలి.
- అనంతరం గిన్నెపై మూతపెట్టి ఒక మూడు గంటలపాటు పిండిని పక్కన పెట్టుకోవాలి.
- ఇడ్లీలు చేసే ముందు పిండిని ఓసారి కలిపి రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి.
- ఆపై స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర పెట్టి తగినన్ని వాటర్ పోసి మరిగించుకోవాలి.
- ఈలోపు ఇడ్లీ ప్లేట్స్‌కు ఆయిల్ లేదా నెయ్యి అప్లై చేసి జొన్నరవ్వ ఇడ్లీ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇలా అన్ని ప్లేట్స్‌లోకి ఇడ్లీ పిండిని వేసుకోవాలి.
- ఇడ్లీ పాత్రలోని నీరు మరుగుతున్నప్పుడు ప్లేట్స్ పెట్టి మూత పెట్టి 10-15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించాలి.
- ఇడ్లీలు ఉడికిన తర్వాత స్పూన్‌తో తీసి ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే చాలు.
- అంతే, ఇలా ఈజీగా చేసుకుంటే టేస్టీ అండ్ హెల్దీ "జొన్న ఇడ్లీలు" రెడీ!
- జొన్న ఇడ్లీలు సాంబార్, పల్లీ చట్నీ, అల్లం చట్నీతో రుచి చాలా బాగుంటాయి. జొన్న ఇడ్లీ తయారీ నచ్చితే మీరు ఓసారి ఇలా ట్రై చేయండి.
గుడిలో పులిహోర ప్రసాదం రుచి కావాలా! - ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా కలుపుకోవచ్చు
కర్ణాటక స్పెషల్ కమ్మటి "బిసి బెలే బాత్" - ఇలా చేస్తే ఇంటిల్లిపాది తృప్తిగా తినొచ్చు!