Instant Ragi Dosa in Telugu : ఎక్కువ మంది ఇష్టపడే టిఫిన్లలో దోశ ఒకటి. ఇంట్లో దోశలు చేయాలంటే ముందు రోజే నైట్ పిండిని పులియబెట్టుకోవాలి. దీంతో ఇదంతా పెద్ద ప్రాసెస్‌తో కూడుకున్న పని అని చాలా మంది వదిలేస్తారు. అలాంటివారు ఒక్కసారి ఇక్కడ చెప్పిన విధంగా రాగిపిండితో అప్పటికప్పుడు దోశలు ట్రై చేయండి. ఈ రాగి పిండి సెట్ దోశలు మెత్తగా చాలా రుచిగా ఉంటాయి. మరి ఈజీగా రాగి పిండి సెట్ దోశలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు
- ఒక కప్పు - రాగి పిండి
- అర కప్పు - బొంబాయి రవ్వ
- రుచికి సరిపడా - ఉప్పు
- అర కప్పు - పెరుగు
- నీళ్లు - సరిపడా
- వంటసోడా - పావు టీస్పూన్
- ఉల్లిపాయ తరుగు - కప్పు
- టమోటా తరుగు - కప్పు
- పచ్చిమిర్చి - 2
- అల్లం చిన్న ముక్కలు - టేబుల్‌స్పూన్
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- కరివేపాకు తరుగు - కొద్దిగా
- టీస్పూన్ జీలకర్ర
తయారీ విధానం
- ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు రాగి పిండి, అర కప్పు బొంబాయి రవ్వ, అర కప్పు పెరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.
- ఆపై కొద్దిగా కొద్దిగా నీళ్లు పోస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ పిండి దోశ పిండిలా ప్రిపేర్ చేసుకొని మూతపెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టాలి.
- ఈ లోపు రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- అనంతరం నానబెట్టుకున్న దోశ పిండిని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
- ఆపై ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో ఉల్లిపాయ తరుగు, టమోటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు తరుగు, అల్లం చిన్న ముక్కలు, వంటసోడా, టీస్పూన్ జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి.
- ఇప్పుడు దోశలు చేయడం కోసం నార్మల్ దోశ పాన్ కాకుండా ఫ్రైయింగ్ పాన్ స్టవ్‌పై పెట్టండి.
- ఇందులో 2 టేబుల్‌స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేయండి. ఆపై మూడు గరిటెలు దోశ పిండి వేసి మూత పెట్టి ఉడికించుకోండి.
- స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసి మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకుంటే దోశ చక్కగా ఉడుకుతుంది.
- ఆపై దోశను మరోవైపు తిప్పి ఒక నిమిషంపాటు ఫ్రై చేసుకోవాలి.
- అనంతరం దోశను ప్లేట్లోకి తీసుకోండి. మిగిలిన పిండితో ఇలా సింపుల్‌గా దోశలు చేసుకుంటే సరి!
- రాగి పిండితో అప్పటికప్పుడు చేసిన ఈ సెట్ దోశలు ఎంతో మెత్తగా రుచిగా ఉంటాయి. టమోటా, పల్లీ చట్నీతో టేస్ట్ అద్దిరిపోతాయి.
- ఈ రాగి పిండి దోశ తయారీ విధానం నచ్చితే మీరు ఓసారి ట్రై చేయండి.
కారం లేకుండా కమ్మని తెలంగాణ స్టైల్ "నువ్వుల ఆవకాయ పచ్చడి" - ఎంతో విభిన్నమైన రెసిపీ!
అప్పటికప్పుడు చేసుకునే "మేతి పులావ్" - లంచ్ బాక్సుల్లోకి ఎంతో బాగుంటుంది!