ETV Bharat / offbeat

"ఇన్​స్టెంట్ వెజ్ పొంగనాలు" - పిండి నానబెట్టే పనిలేకుండా అప్పటికప్పుడు చేసుకోవచ్చు! - PONGANALU

పిండి అవసరమే లేదు - అప్పటికప్పుడు నోరూరించే పొంగనాలు రెడీ

rava_ponganalu_recipe_in_telugu
rava_ponganalu_recipe_in_telugu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 7, 2025 at 12:31 PM IST

2 Min Read

Rava Ponganalu Recipe : గుంత పొంగనాలు అంటే ఇడ్లీ, రవ్వ, మినప్పప్పు వేసుకుని రాత్రంతా నానబట్టి చేస్తుంటారు. కానీ, ఇలా కొత్తగా కూరగాయ ముక్కలతో ట్రై చేసి చూడండి ఎంతో రుచిగా ఉంటాయి. ఆరోగ్య పరంగా కూడా ఈ రెసిపీ ఎంతో మేలు చేస్తుంది. పిండి అవసరం లేకుండా, రాత్రంతా నానబెట్టాల్సిన పనిలేకుండా మీకు ఎంతో సమయం ఆదా అవుతుంది.

పల్లీ, పుట్నాలు లేకుండానే ఇడ్లీ, దోసెల్లోకి సూపర్ చట్నీ - వారం రోజులు నిల్వ ఉంటుంది!

wheat_Rava
wheat_Rava (Gettyimages)

కావాల్సిన పదార్థాలు :

  • గోధుమ రవ్వ - కప్పు
  • మజ్జిగ - 1 కప్పు
  • నూనె - 1 టేబుల్ స్పూన్
  • అర టీ స్పూన్ - ఆవాలు
  • అర టీ స్పూన్ - జీలకర్ర
  • కొద్దిగా - పసుపు
  • టేబుల్ స్పూన్ - మినప్పప్పు
  • అల్లం - 1 టేబుల్ స్పూన్
  • ఉల్లిపాయ - పెద్దది
  • పచ్చిమిర్చి - 2
  • కరివేపాకు 1 రెమ్మ
  • 2 టేబుల్ స్పూన్లు - బీన్స్
  • 2 టేబుల్ స్పూన్లు - క్యారెట్ తురుము
  • కొద్దిగా - ఇంగువ
  • 1 టేబుల్ స్పూన్ - సేమియా
rava_ponganalu_recipe_in_telugu
rava_ponganalu_recipe_in_telugu (ETV Bharat)

తయారీ విధానం :

  • ముందుగా గోధుమ రవ్వ, మజ్జిగ రెండింటిని బాగా కలుపుకుని 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. గోధుమ రవ్వ మజ్జిగను పీల్చుకుని మృదువుగా మారుతుంది.
  • ఈ లోగా కడాయిలో నూనె వేడి చేసుకుని అందులో ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పసుపు, మినప్పప్పు వేసుకుని వేయించాలి.
  • ఆ తర్వాత అల్లం, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, బీన్స్, క్యారెట్ తురుము వేసుకుని సన్నటి మంటపై ఫ్రై చేసుకోవాలి. ఈ సమయంలో కొద్దిగా ఇంగువ వేసుకుని బాగా ఫ్రై చేసుకుని దించుకుంటే సరిపోతుంది. కూరగాయ ముక్కలు పూర్తిగా ఉడికించాల్సిన పని లేదు. సగానికి పైగా ఉడికితే చాలు
  • ఇపుడు ఒక బౌల్ తీసుకుని మజ్జిగ బాగా పీల్చుకున్న రవ్వ వేసుకుని కొన్ని నీళ్లు పోసుకుని కలుపుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మిక్స్ చేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ సేమియా వేసుకుని మిక్స్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నీ కలిపిన తర్వాత మరో 5 నిమిషాలు పక్కన పెట్టుకుంటే మొత్తం పీల్చుకుంటుంది. ఇప్పుడు కొన్ని నీళ్లు పోసుకుని పొంగనాల మిశ్రమాన్ని కలుపుకోవాలి.
  • ఇప్పుడు పొంగనాల పెనం పెట్టుకుని నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. ఇందులో కూరగాయలు కలుపుకున్న పిండిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపు కాల్చుకోవాలి. చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే ఈ గుంత పొంగనాలు మీకు నచ్చిన చట్నీతో ట్రై చేసి చూడండి.

కరకరలాడే "మిరియాల కారపూస" - ఈ టిప్స్​ పాటిస్తే చాలు గుల్లగుల్లగా, రుచిగా వస్తాయి!]

ఈ సీక్రెట్ పిండితో "పెసరట్టు" వేయండి! - ఇంట్లో వాళ్లందరూ ఒకటికి రెండు ఇష్టంగా తింటారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.