Idli preparation in 10 munuts : ఆఫీసుకు టైం అవుతోందని, అర్జంటు పని ఉందని బయటకు వెళ్లి ఇడ్లీ తింటున్నారా? రాత్రి పిండి నానబెట్టడం మర్చిపోయామని, టిఫిన్‌లోకి ఏం చేయాలో అని అర్థం కావడం లేదా? ఇప్పుడు ఇలాంటి ఆందోళన అవసరమే లేదు! 15 నిమిషాల్లో పిండి, చట్నీ రెడీ చేసుకుని మరో 10 నిమిషాల్లో ఇడ్లీ రెడీ చేసుకునే విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అవును! అప్పటికప్పుడు, అరగంట వ్యవధిలో తెల్లని దూదిలాంటి మృదువైన ఇడ్లీ ఇలా రెడీ చేసుకోండి. అంతే కాదు అదే సమయంలో చట్నీ కూడా రెడీ చేసుకోవచ్చు. ఆశ్చర్యపోయినా ఇది నిజమే. ఎలా చేయాలో తెలుసుకుందామా!
పాకం పట్టకుండా "రవ్వ లడ్డూలు" - ఇలా చేయండి ఒకటికి రెండు తింటారు!
ఇడ్లీకి కావల్సిన పదార్థాలు
- ఇడ్లీ రవ్వ - కప్పు
- అటుకులు - అర కప్పు
- పెరుగు - అర కప్పు
చట్నీ కోసం
- పల్లీలు - 150 గ్రాములు
- టమోటా - చిన్నది
- పచ్చి మిర్చి - 3
- అల్లం - ఇంచు
- వెల్లుల్లి - 4
- నూనె - 1 టేబుల్ స్పూన్
రేషన్ బియ్యంతో మెత్తని దూదిలాంటి ఇడ్లీలు - రవ్వ కొనాల్సిన అవసరమే లేదు!
పోపు కోసం
- నూనె - 1 టీ స్పూన్
- ఎండు మిర్చి - 1
- ఆవాలు - అర స్పూన్
- జిలకర - అర స్పూన్
- మినపగుండ్లు - అర స్పూన్
- కరివేపాకు - 1 రెమ్మ
ఇడ్లీ పిండి తయారీ విధానం
- ఒక బౌల్లోకి ఇడ్లీ రవ్వ, అటుకులు తీసుకోవాలి. నీళ్లు పోసుకుని రెండు సార్లు శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత నీళ్లన్నీ వంపేసుకుని అర కప్పు పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
- ఈ లోగా చట్నీ కోసం ఒక కడాయిలో నూనె వేసుకుని పల్లీలు వేయించాలి. పల్లీలు సగం వేగిన తర్వాత సన్నగా తరిగిన టమోటా ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసుకుని వేయించాలి. అన్ని దినుసులు వేగిన తర్వాత చల్లారే వరకు పక్కన పెట్టుకుని ఆ తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకుని రుబ్బు కోవాలి. ఆ తర్వాత పోపు పెట్టుకుని చట్నీలో కలుపుకొంటే సరిపోతుంది.
- చట్నీ కోసం 15 నిమిషాల టైం సరిపోతుంది. ఈ లోగా ఇడ్లీ రవ్వ పెరుగులోబాగా నానిపోతుంది. ఇపుడు ఇడ్లీ రవ్వను మిక్సీ జార్‌లోకి తీసుకుని మెత్తగా రుబ్బు కోవాలి. రెండు దఫాలుగా మిక్సీ పట్టుకుని పిండినంతా ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ సమయంలో ఒక పాకెట్ ఈనో లేదా వంట సోడా వేసుకోవాలి. పిండి మిశ్రమం కూడాగట్టిగా అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ నీళ్లు పోసుకుని కలుపుకుంటే ఈనో పొడి బాగా కలిసిపోయి పిండి కూడా పొంగుతుంది.
- ఈనో, వంట సోడా లేకుండా కూడా ఇడ్లీ తయారు చేసుకోవచ్చు. ఇవి వేసుకోవడం వల్ల ఇడ్లీలు స్పంజీగా వస్తాయి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకుని నూనె రాసుకుని ఇడ్లీ పిండి వేసుకుని ఉడికించుకుంటే సరిపోతుంది. అంతే! తెల్లని దూదిలాంటి మెత్తని ఇడ్లీలు, కమ్మని చట్నీ రెడీతో ఆరగించడమే!
పెసరపప్పు, కొబ్బరితో "హెల్దీ బర్ఫీ" - ఇలా చేస్తే కమ్మగా, ఐస్‌క్రీమ్‌లా కరిగిపోతుంది!
ఘుమఘుమలాడే "మటన్ గ్రేవీ కర్రీ" - ఇలా చేస్తే ముక్క జ్యూసీగా, త్వరగా ఉడికిపోతుంది!