Ice Cream Recipe in Telugu : సమ్మర్లో ఎండవేడి నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది ఐస్‌క్రీమ్ తింటారు. చల్లటి ఐస్‌క్రీమ్ తింటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. ఐస్‌క్రీమ్ ప్రియుల అభిరుచులకు అనుగుణంగా మార్కెట్లో రకరకాల ఐస్‌క్రీమ్స్ లభిస్తున్నాయి. అయితే, కొన్ని టిప్స్ పాటిస్తూ ఇక్కడ చెప్పిన విధంగా ప్రిపేర్ చేస్తే ఇంట్లోనే మీరు కూడా ఐస్‌క్రీమ్ చేయచ్చు. ఈ ఐస్‌క్రీమ్ చేయడానికి ఎలాంటి పౌడర్లు, క్రీమ్ అవసరం లేదు. మరి సింపుల్‌గా ఐస్‌క్రీమ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
బర్త్‌డే, పెళ్లిరోజుల్లో సింపుల్‌గా ఈ స్వీట్ చేసుకోండి - హల్వాను మించే చెట్టినాడు స్పెషల్ "ఉక్కారై"

ఐస్‌క్రీం తయారీకి కావాల్సినవి :
- మిగడ తీయని పాలు - అర లీటర్
- జీడిపప్పు పలుకులు - 15
- బెల్లం తురుము - 3 టేబుల్‌స్పూన్లు
- కుంకుమ పువ్వు - కొద్దిగా
- యాలకుల పొడి - అరటీస్పూన్
- సన్నని డ్రై ఫ్రూట్స్ తరుగు - కొద్దిగా (గార్నిష్ కోసం)

ఐస్‌క్రీమ్ తయారీ విధానం
- ముందుగా ఒక చిన్న గిన్నెలో జీడిపప్పు పలుకులను కొద్దిగా వేడి నీళ్లను పోసుకొని అరగంటపాటు నానబెట్టుకోవాలి. అనంతరం మిక్సీ జార్లో జీడిపప్పు పలుకులను వేసుకొని చిక్కటి పేస్ట్ చేసుకోండి.
- అలాగే, మరో చిన్న గిన్నెలో చిటికెడు కుంకుమపువ్వు తీసుకుని కొన్ని చల్లటి పాలు పోసి నానబెట్టాలి.
- అనంతరం స్టవ్‌పై ఒక కడాయిలో పాలు తీసుకొని కలుపుతూ 5 నిమిషాలు బాగా మరిగించుకోవాలి.
- పాలు కాస్త చిక్కగా అయ్యాక మంటను తగ్గించి అందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న కాజు పేస్ట్, కుంకుమపువ్వు నానబెట్టుకున్న పాలను వేసుకొని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి.
- ఆపై పాలను 4 నిమిషాల పాటు కలుపుతూ మరిగించుకోవాలి.
- ఆవిధంగా మరిగించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని పాలను పూర్తిగా చల్లార్చుకోవాలి.

- అనంతరం మిక్సీ జార్ తీసుకొని అందులో బెల్లం తురుము, చల్లారిన పాల మిశ్రమం, యాలకుల పొడి వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి.
- అంతే ఇలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకుంటే ఐస్‌క్రీమ్ పాల మిశ్రమం రెడీ! ఈ మిశ్రమాన్ని చిన్న టీ గ్లాసులు లేదా కుల్ఫీ మౌల్డ్స్ తీసుకొని డీఫ్రిడ్జ్లో 8 గంటల నుంచి 10 గంటల పాటు ఉంచాలి. లేదా మీరు మిక్సింగ్ బౌల్లోనే ఐస్‌క్రీమ్ పాల మిశ్రమం, సన్నని డ్రై ఫ్రూట్స్ తరుగు వేసుకొని డీఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు.
- ఐస్‌క్రీమ్ లేదా కుల్ఫీ రెడీ అయిన తర్వాత సర్వ్ చేసుకుంటే సరి!
- అంతే ఇలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకుంటే టేస్టీ ఐస్‌క్రీమ్ రెడీ!
మహారాజులు ధరించిన వజ్రం - వచ్చే నెలలోనే "గోల్కొండ బ్లూ" డైమండ్ వేలం - కళ్లు చెదిరే ధర!
నోరూరించే "మీల్ మేకర్ మంచూరియా" - ఇది స్పైసీ, జ్యూసీగా చికెన్ కంటే బాగుంటుంది!