ETV Bharat / offbeat

పల్లీ చట్నీ అందరూ చేస్తారు - కానీ హోటల్​ టేస్ట్ మాత్రం రాదు! - ఈ టిప్స్ పాటిస్తే అద్భుతం - Palli Chutney Recipe

Hotel Style Palli Chutney : అందరికీ హోటల్​ స్టైల్లో చేసే పల్లీ చట్నీ ఎంతో నచ్చుతుంది. కానీ.. ఇంట్లో చేస్తే మాత్రం ఆ రుచి రాదు! ఈ టిప్స్ పాటిస్తే.. హోటల్ స్టైల్లో టేస్టీ పల్లీ చట్నీ తయారు చేయొచ్చు.

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2024, 11:02 AM IST

Updated : Sep 10, 2024, 11:07 AM IST

Hotel Style Palli Chutney
Hotel Style Palli Chutney (ETV Bharat)

How To Make Palli Chutney : ఉదయాన్నే బ్రేక్​ఫాస్ట్​లో ఏ టిఫెన్​ అయినా పల్లీ చట్నీతో తింటే టేస్ట్​ అద్దిరిపోతుంది. హోటల్లో తిన్నారంటే.. ఆ రుచే వేరు! ఇలాంటి రుచిని ఇంట్లో కూడా ఆస్వాదించాలని చాలామంది కోరుకుంటారు. కోరుకోవడమే కాదు.. ఇంట్లో పల్లీ చట్నీ ప్రిపేర్​ చేస్తారు. కానీ.. హోటల్ స్టైల్ టేస్ట్​ మాత్రం రాదు. మీరు కూడా ఇలాంటి పరిస్థితిలో ఉంటే.. ఇక్కడ చెప్పబోయే టిప్స్ పాడటిస్తూ ఒక్కసారి ట్రై చేయండి. ఇక ఎప్పటికీ ఇదే విధంగా పల్లీ చట్నీ చేసుకుంటారు. అంత బాగుంటుంది దీని టేస్ట్​. మరి.. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

హోటల్​ స్టైల్​ పల్లీ చట్నీకి కావాల్సిన పదార్థాలు:

  • పల్లీలు - కప్పు
  • ఉల్లిపాయ - ఒకటి
  • నూనె - టేబుల్​ స్పూన్​
  • ఎండు మిర్చి - 7
  • అల్లం తరుగు - అర టీ స్పూన్​
  • టమాటా ముక్కలు - పావు కప్పు
  • చింతపండు - కొద్దిగా
  • వాటర్​ - సరిపడా
  • వెల్లుల్లి రెబ్బలు - 7
  • ఉప్పు - రుచికి తగినంత
  • జీలకర్ర - అర టీ స్పూన్​

తాళింపు కోసం..

  • ఆవాలు, జీలకర్ర - అర టీ స్పూన్​
  • పచ్చి శనగపప్పు - అర టీ స్పూన్​
  • నూనె - టేబుల్​ స్పూన్​
  • ఎండు మిర్చి - 1
  • కరివేపాకు - 2 రెమ్మలు

తయారీ విధానం:

  • ముందుగా సన్నని మంట​ మీద పల్లీలు వేయించుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత పొట్టు తీసి పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు.. అదే గిన్నెలో టేబుల్​ స్పూన్​ నూనె​ వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి.
  • తర్వాత.. ఇందులోకి ఎండు మిర్చి, టమాట ముక్కలు, అల్లం తరుగు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేయాలి. టమాటాలు మగ్గేంత వరకు సన్నని మంట మీద ఉడికించుకొని స్టవ్​ ఆఫ్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు మిక్సీ జార్​లోకి వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు, ఉల్లిపాయ టమాటా మిశ్రమం, రుచికి సరిపడా ఉప్పు, చింతపండు వేసి నీళ్లు కలుపుకుంటూ మెత్తగా పేస్ట్​ చేసుకోవాలి.
  • తర్వాత తాళింపు కోసం పాన్​లో ఆయిల్​ వేయాలి. అది వేడైన తర్వాత ఆవాలు, పచ్చి శనగపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకుని చట్నీలో కలుపుకోవాలి.
  • ఇంతే.. ఎంతో రుచికరమైన హోటల్​ స్టైల్​ పల్లీ చట్నీ మీ ముందుంటుంది.
  • ఈ చట్నీతో పూరి, దోశ, ఇడ్లీ, వడ, మైసూర్​ బజ్జీ వంటి ఏ టిఫెన్ తిన్నా టేస్ట్​ సూపర్​గా ఉంటుంది.
  • నచ్చితే మీరు కూడా ఈ స్టైల్లో పల్లీ చట్నీ ట్రై చేయండి.

ఇవి కూడా చదవండి :

గుంటూరు స్టైల్ "స్పైసీ అల్లం చట్నీ" - వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్భుతం!

5 నిమిషాల్లో అద్భుతమైన టమాటా నువ్వుల పచ్చడి - వేడి వేడి అన్నంలో అమృతమే!

Last Updated : Sep 10, 2024, 11:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.