ETV Bharat / offbeat

గుంటూరు స్టైల్ "దొండకాయ కారం" - ఇలా చేస్తే ఎంతో స్పైసీగా ముద్ద కూడా మిగల్చరు! - DONDAKAYA KARAM

దొండకాయ కారం సింపుల్​గా ఇలా చేసుకోండి - అన్నం మొత్తం తినేస్తారు

dondakaya_karam_recipe_in_telugu
dondakaya_karam_recipe_in_telugu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 10, 2025 at 12:26 PM IST

2 Min Read

Dondakaya karam : దొండకాయలు, బెండకాయలు జిగురుగా ఉంటాయిగానీ, సరైన పద్ధతుల్లో వంట చేస్తే వాటి రుచి అమృతమే. కూరగాయల్లో ఈ రెండు రకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సహజంగా దొండకాయలను చక్కగా నూనెలో ఫ్రై చేసి కారం వేసుకుని తింటే చాలు ఎంతో బాగుంటుంది. ఇవాళ గుంటూరు స్టైల్​లో దొండకాయ మసాలా కారం కర్రీ చేసుకుని రుచి చూడండి! ఎంతో బాగుంటుంది. ఈ కర్రీ వేడి వేడి అన్నంతో పాటు చపాతీల్లోకి అద్దిరిపోతుంది.

"వంకాయ మలాయి కుర్మా" ఇలా చేయండి! - బగారా రైస్, చపాతీ, పుల్కా ఏదైనా సరే మిగల్చరు!

dondakaya_karam_recipe_in_telugu
dondakaya_karam_recipe_in_telugu (ETV Bharat)

కావాల్సిన పదార్థాలు

  • దొండకాయలు - అర కిలో
  • నూనె - 2 టేబుల్ స్పూన్లు
  • ఉప్పు - ఒకటిన్నర టీ స్పూన్లు
  • పసుపు - అర టీ స్పూన్
  • పచ్చిశనగ పప్పు - 2 టేబుల్ స్పూన్లు
  • మినప్పప్పు - 2 టేబుల్ స్పూన్లు
  • ధనియాలు - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు
  • మెంతులు - చిటికెడు
  • ఎండు మిర్చి - 12
  • జీలకర్ర - 1 టీ స్పూన్
  • చింతపండు - కొద్దిగా
  • పల్లీలు - 3 టేబుల్ స్పూన్లు
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • ఎండు కొబ్బరి - 1 టేబుల్ స్పూన్
  • నువ్వులు - 1 టేబుల్ స్పూన్
  • వెల్లుల్లి రెబ్బలు - 6

తయారీ విధానం

  • ముందుగా అరకిలో లేత నాటు దొండకాయలు తెచ్చుకుని బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. అవసరమైతే కొసలు కట్ చేసుకుని వీటిని శుభ్రం చేసుకోవాలి.
  • పొడవుగా నాలుగు ముక్కలు లేదా కాయను అడ్డంగా రెండు ముక్కలు చేసుకుని ఆపై 8 చిన్న ముక్కలుగా లేదంటే అడ్డంగా గుండ్రంగా అయినా కట్ చేసుకోవచ్చు.
  • ఇపుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసుకుని వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత ఒకటిన్నర టీ స్పూన్ల ఉప్పు, అర టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలిపి మూత పెట్టి మగ్గించాలి.
  • దాదాపు 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్​లో మగ్గించుకుంటే చక్కగా ఫ్రై అయిపోతాయి. మధ్య మధ్యలో మూత తీసుకుని లో ఫ్లేమ్​లో కలర్ మారే వరకు వేయించాలి. ఈ లోగా మసాలా కారం సిద్ధం చేసుకోవచ్చు.
  • కడాయిలో పచ్చిశనగ పప్పు, మినప్పప్పు, ధనియాలు, మెంతులు, ఎండు మిర్చి, జీలకర్ర, చింతపండు వేసుకుని వేయించాలి.
  • ఆ తర్వాత పల్లీలు, కరివేపాకు వేసుకుని సన్నని మంటపై ఏ ఒక్కటీ మాడిపోకుండా వేయించాలి.
  • ఆ తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు, చివర్లో నువ్వులు వేసుకుని మాడిపోకుండా వేయించాలి.
  • ఆ తర్వాత కడాయి దించేసి పదార్థాలన్నీ చల్లార్చుకోవాలి.
  • అవి వేడి మీద ఉన్నపుడు గ్రైండ్ చేస్తే కారం ముద్దలాగా అయిపోతుంది. అందుకే చల్లారిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
  • మిక్సీ పట్టుకున్న పొడిని ఫ్రై చేసుకున్న దొండకాయల్లో వేసుకుని కలుపుకోవడమే.

మలయాళీల ఫేవరెట్ "ముట్టా కర్రీ!" - ఇలా చేస్తే రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!

చుక్క నూనె, సోడా లేకుండా "స్పాంజ్ దోసెలు" - ఈ సీక్రెట్​ ఫాలో అయితే చాలు మృదువుగా వస్తాయి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.