Ginger Candy Recipe in Telugu : నేటి తరం పిల్లలకు అలం మురబ్బా గురించి తెలిసి ఉండకపోవచ్చు! కానీ, 90's కిడ్స్ చాలా మందికి ఈ స్వీట్ గురించి తెలిసే ఉంటుంది. ఒకప్పుడు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో, ఇంటింటికీ తిరుగుతూ దీనిని అమ్మేవారు. ఈ అల్లం మురబ్బా తినడం వల్ల జలుబు, దగ్గు వంటి అనేక రకాల అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయని అంటుంటారు. అయితే, ఇప్పుడు మనం తాటి బెల్లంతో ఈజీగా ఈ అల్లం మురబ్బా ఎలా చేయాలో చూద్దాం.
అల్లం మురబ్బా తయారీకి కావాల్సిన పదార్థాలు
- అల్లం ముక్కలు - 100 గ్రాములు
- బ్లాక్ సాల్ట్ - అరటీస్పూన్
- పెప్పర్ పౌడర్- అరటీస్పూన్
- పసుపు - అరటీస్పూన్
- తాటి బెల్లం తురుము - 500 గ్రాములు
- నీళ్లు - కప్పు

కందిపప్పుతో "క్రిస్పీ గారెలు" - ఇలా చేస్తే ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు!
తయారీ విధానం

- ముందుగా అల్లం ముక్కలను శుభ్రంగా కడిగి పైన చెక్కు తీసేయండి. అనంతరం అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.
- ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో కట్ చేసిన అల్లం ముక్కలు, అరటీస్పూన్ బ్లాక్‌సాల్ట్, అరటీస్పూన్ పెప్పర్ పౌడర్, అరటీస్పూన్ పసుపు వేసి నీళ్లు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
- ఇలా గ్రైండ్ చేసుకున్న అల్లం పేస్ట్ ఒక చిన్న గిన్నెలోకి తీసుకోండి.
- ఇప్పుడు స్టవ్‌పై పాన్ పెట్టి తురుముకున్న తాటిబెల్లం, కప్పు నీళ్లు వేసి వేడి చేయండి.
- స్టవ్ లో ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసి గడ్డలు లేకుండా బెల్లం పూర్తిగా కరిగించుకోవాలి. ఇలా కరిగించుకున్న బెల్లం పాకాన్ని స్టీల్ టీ జాలి గరిటె సహాయంతో ఒక గిన్నెలోకి వడకట్టుకోవాలి. (ఎందుకంటే తాటిబెల్లం ఇసుక ఉండే అవకాశం ఉంటుంది. ఇలా వడకట్టుకోవడం వల్ల ఇసుక ఉండదు.)
- వడకట్టుకున్న బెల్లం పాకాన్ని మరొక పాన్‌లో పోసి మరిగించండి.
- స్టవ్ లో ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసి మధ్యమధ్యలో కలుపుతూ పాకం కాస్త చిక్కగా మారే వరకు ఉడికించుకోవాలి.
- పాకం చిక్కబడడానికి సుమారు 30 నిమిషాల టైమ్ పడుతుంది. కాబట్టి నిదానంగా కలుపుతూ మరిగించుకోవాలి.
- ఈలోపు అల్లం మురబ్బా అచ్చు వేసుకోవడానికి ఒక ట్రేకి పూర్తిగా నెయ్యి అప్లై చేసుకోండి. అలాగే పైన బటర్ పేపర్ పెట్టండి. మీ దగ్గర ట్రే లేకపోతే స్టీల్ ప్లేట్‌కి నెయ్యి రాసి అల్లం మురబ్బా అచ్చు వేసుకోవచ్చు.
- పాకం పర్ఫెక్ట్గా వచ్చిందని తెలుసుకోవడానికి ఓ చిట్కా ఉంది. అదేంటంటే పాకం చిక్కగా మారిన తర్వాత గరిటెతో కొద్దిగా తీసుకుని చల్లటి నీళ్లలో వేయాలి. ఇలా వేస్తే పాకం ముద్ద కట్టిపోవాలి. నీటిలో వేసిన పాకాన్ని చేతితో తీసి చూస్తే ముద్దగా ఉండి, సాగుతూ ఉంటే అల్లం మురబ్బా తయారీకి పాకం సిద్ధమైపోయినట్లుగా గుర్తుంచుకోండి.
- పాకం ఆ విధంగా చిక్కబడిన తర్వాత నెయ్యి అప్లై చేసుకున్న ట్రేలో పోసుకోండి.
- ఓ 15 నిమిషాల తర్వాత అల్లం మురబ్బా అచ్చుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. మీకు నచ్చిన ఆకారంలో కత్తితో గాట్లు పెట్టుకోండి.
- అచ్చు పూర్తిగా చల్లారిన తర్వాత అల్లం మురబ్బా కట్ చేసి ఎయిర్‌టైట్ బాక్స్‌లో స్టోర్ చేసుకుంటే సరి!
- ఈ తాటిబెల్లం అల్లం మురబ్బా ఏడాది వరకు నిల్వ ఉంటుంది.
- పిల్లలకు ఈ తాటిబెల్లం అల్లం మురబ్బా చాలా నచ్చుతుంది!
"నేతి బొబ్బట్లు" స్వీట్ షాపులో కొన్నట్లుగా రావాలంటే ఇలా చేయండి - నోట్లే వేసుకోగానే కరిగిపోతాయి!
కప్పు రవ్వతో "కేక్ పిజా" - ఉప్మా కంటే తక్కువ టైమ్‌లో చేసుకోవచ్చు!