MAMIDI ALLAM CHARU : ఎన్ని కూరలతో భోజనం చేసినా సరే చివరికి కాస్త చారు, కొద్దిగా పెరుగు లేకపోతే ఏదో వెలితిగా అనిపిస్తుంది. చారుతో నాలుగు ముద్దలన్నా తినకపోతే తృప్తిగా అనిపించదు. ఇక ఈ ఎండాకాలంలో చారు తప్పనిసరి. సాధారణంగా పెట్టే రసం కంటే ఇప్పుడు చెప్పుకొనే రెసిపీ ఎంతో బాగుంటుంది. చారు కాచే తీరు మాత్రమే కాదు చేయడం కూడా పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మామిడి అల్లం చారు రుచి, వాసన ఘుమఘుమలాడుతుంది. సాధారణంగా మసాలా మిశ్రమం వేయగానే చారును దించేస్తుంటారు. కానీ మామిడి చారు ఎంత మరిగితే అంత రుచిగా ఉంటుంది.
పెసరపప్పుతో "పాలక్ పనీర్ ఊతప్పం" - ఇది ఆరోగ్యానికి కేరాఫ్ అడ్రస్!

- మామిడి అల్లం ఎక్కువ తీసుకుంటే చారు ఘాటుగా ఉంటుంది. అందుకే ఇక్కడ ఇచ్చిన కొలతల్లోనే తీసుకోవాలి.
- ఒక వేళ ఘాటు ఎక్కువగా అనిపిస్తే చారు మరుతున్నప్పుడు చింతపండు పులుసు లేదా నిమ్మరసం కలుపుకుంటే సరిపోతుంది.
- కొద్దిగా బెల్లం వేసుకుంటే అల్లం ఘాటు, పులుపు రెండూ బ్యాలెన్స్ అవుతాయి.
అల్లం పేస్ట్ కోసం కావాల్సిన పదార్థాలు :
- 35 - 40 gms మామిడి అల్లం ముక్కలు
- 6 - 7 ఎండుమిర్చి
- జీలకర్ర - 1 టీ స్పూన్
- ధనియాలు - 2 టీ స్పూన్లు
- మిరియాలు - 1 టీ స్పూన్
చారు కోసం :
- చింతపండు - 50 గ్రాములు
- టొమాటోలు - 3
- కొత్తిమీర - ఒక కట్ట
- ఉప్పు - రుచికి సరిపడా
- నీరు - లీటరున్నర
- పచ్చిమిర్చి - 2
- పసుపు - పావు టీ స్పూన్
- బెల్లం - 2 టీ స్పూన్లు
- కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు

తాలింపు కోసం :
- నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
- ఆవాలు - 1 టీ స్పూన్
- జీలకర్ర - అర టీ స్పూన్
- ఎండు మిర్చి - 2
- కరివేపాకు - 2 రెబ్బలు
- పచ్చి కొబ్బరి - 3 టేబుల్ స్పూన్లు
- ఇంగువ - చిటికెడు
- తయారీ విధానం
- ముందుగా మిక్సీ జార్ లో అల్లం పేస్ట్ కోసం ఉంచిన పదార్థాలు మొత్తం వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి.
- చింతపండులో పిక్కలు, పీచు లేకుండా తీసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని, అందులోనే టొమాటోలు, కొత్తిమీర కాడలు వేసి గట్టిగా పిండుతూ సారాన్ని తీసుకోవాలి.
- చారు కాయడానికి అవసరమైన పదార్థాలను తీసుకుని టొమాటో పులుసు, ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, నీళ్లు పోసి బాగా కలిపి పొయ్యి మీద పెట్టి 15-20 నిమిషాలు మరగనివ్వాలి.
- చారు మరిగి పొంగువచ్చిన తర్వాత అందులో బెల్లం, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి.
- 5నిమిషాలు మరిగించుకున్న తర్వాత తాలింపు కోసం నెయ్యి వేసి అందులో తాలింపు సామానంతా వేసి వేపి చారులో కలిపేయండి.
- ఈ చారు అన్నంతో చాలా రుచిగా ఉంటుంది.
"ఇన్స్టెంట్ వెజ్ పొంగనాలు" - పిండి నానబెట్టే పనిలేకుండా అప్పటికప్పుడు చేసుకోవచ్చు!
కరకరలాడే "మిరియాల కారపూస" - ఈ టిప్స్ పాటిస్తే చాలు గుల్లగుల్లగా, రుచిగా వస్తాయి!