Fish Pulusu Recipe in Telugu : ఆదివారం వచ్చిందంటే చాలు నాన్‌వెజ్ ప్రియులు ఈ రోజు ఏ మాంసం తీసుకురావాలి? అని ఆలోచిస్తుంటారు. ఇలాంటి వారికి కలిసి వచ్చేలా సండే మృగశిర కార్తె వచ్చేసింది. ఏ చేపల మార్కెట్ చూసిన జనాలతో కిటకిటలాడుతుంది. అయితే, మీకు చేపల పులుసు చేయడం రాకపోతే ఇలా అన్ని మసాలాలు కలిపి పెట్టుకుని స్టవ్ మీద ఉడికించుకోండి. అంతే ఘుమఘుమలాడే చేపల పులుసు మీ ముందుంటుంది. అయితే మీరు ఎప్పుడు చేపల పులుసు చేసినా మంచి నూనెతో పాటు కాస్త ఆవకాయ నూనె కలపండి. ఇలా రెండు నూనెలు కలపడం వల్ల రుచి అద్దిరిపోతుంది.
"ఇడ్లీలు" గట్టిగా వస్తున్నాయా? - ఈ ట్రిక్ ఫాలో అయితే చాలు - దూదిలాంటి మెత్తటి ఇడ్లీలు వస్తాయి!

కావాల్సిన పదార్థాలు :
- 4 టేబుల్‌స్పూన్లు - ఆయిల్
- 2 టేబుల్‌స్పూన్లు - ఆవకాయ నూనె
- కిలోన్నర - చేప ముక్కలు
- అర స్పూన్ - పసుపు
- రుచికి సరిపడా - ఉప్పు, కారం
- ఉల్లిపాయ - 1
- పచ్చిమిర్చి - 2
- కొత్తిమీర తరుగు - 1 కట్ట
- 50 గ్రాములు - చింతపండు
- మామిడికాయ - 1
మసాలా పేస్ట్ కోసం:
- ధనియాలు - 3 టేబుల్‌స్పూన్లు
- జీలకర్ర - 1 టీస్పూన్
- వెల్లుల్లి - 10
- అల్లం ముక్కలు - 2

తయారీ విధానం:
- ముందుగా చేప ముక్కలను క్లీన్ చేసుకోవాలి. ఇందుకోసం పెద్ద గిన్నెలోకి చేప ముక్కలు, కొంచెం నిమ్మరసం, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి క్లీన్ చేసుకోవాలి. ఇలా ఓ రెండు మూడు సార్లు నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆపై చేప ముక్కలను జల్లిబుట్టలో వేసి నీరు పూర్తిగా పోయేలా వడకట్టుకోవాలి. ఇలా చేప ముక్కలను నిమ్మరసం, ఉప్పు వేసి కలపడం వల్ల నీచు వాసన పోతుంది.

- ఒక మిక్సీ గిన్నెలోకి 3 టేబుల్‌స్పూన్లు ధనియాలు, జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు రెండు చిన్న అల్లం ముక్కలు, పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకొని మరొసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్‌ని చిన్న గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
- అలాగే ఓ గిన్నెలోకి చింతపండు తీసుకుని ఓసారి కడిగి గ్లాస్ నీళ్లు పోసి కాసేపు నానబెట్టాలి. ఆపై చింతపండు రసం తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

- ఇప్పుడు చేపలు వండడం కోసం ఒక వెడల్పాటి గిన్నె తీసుకోండి. ఇందులో చేప ముక్కలను తీసుకోవాలి. ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, గ్రైండ్ చేసుకున్న అల్లం-వెల్లుల్లి-ధనియాల పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, చింతపండు రసం, నూనె వేసుకొని ఓసారి బాగా కలుపుకోవాలి.
- ఇక్కడ మీరు ఆవకాయలోని నూనె కూడా రెండు టేబుల్‌స్పూన్లు వేసి చేతితో కలపండి. ఇలా చేపల పులుసులోకి కొద్దిగా ఆవకాయ నూనె యాడ్ చేయడం వల్ల రుచి బాగుంటుంది. అలాగే పైన మామిడికాయ ముక్కలు వేయండి.

- ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్‌లో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మరొ 10 నిమిషాలు సిమ్‌లో ఉడికించుకోవాలి.
- చేపల పులుసు దింపేసే ముందు రుచికి సరిపడా ఉప్పు, కారం చెక్ చేసుకోవాలి. అలాగే కాస్త కొత్తిమీర తరుగు చల్లితే సరి.
- అంతే ఇలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకుంటే పాత కాలం నాటి చేప కలగలుపు కూర మీ ముందుంటుంది.
"మృగశిర కార్తె"తో చేపలకి ఉన్న లింక్ ఏంటి? - ఆ రోజున "జల పుష్పాలు" ఎందుకు తింటారో తెలుసా!
కూరల్లో అన్నీ వేసినా రుచి రావట్లేదా? - ఈ పొడి ఒక్క స్పూన్ వేస్తే చాలు ఘుమఘుమలాడిపోతుంది!