Chepala Pulusu Recipe in Telugu : నాన్‌వెజ్ ప్రియులు చేపల పులుసు ఎంతో ఇష్టంగా తింటారు. కర్రీ వండిన రోజు కంటే మరుసటి రోజు టేస్ట్ ఇంకా బాగుంటుందని చెబుతుంటారు చాలా మంది. అయితే, చేపల పులుసు రుచి కమ్మగా ఉండాలంటే కొన్ని మసాలా దినుసులను అప్పటికప్పుడు వేయించాలి. ఈ స్టోరీలో చెప్పిన విధంగా మసాలా పొడి చేసి కూర వండితే టేస్ట్ అద్దిరిపోతుంది. మరి చేపల పులుసు వండిన ప్రతిసారీ ఇన్‌స్టంట్‌గా ప్రిపేర్ చేయాల్సిన హోమ్మేడ్ మసాలా పొడి ఏంటో ఇప్పుడు చూద్దాం.

శనగపప్పు, మినపప్పు లేకుండానే "కమ్మటి పూర్ణం బూరెలు" - అప్పటికప్పుడు ఈ పద్ధతిలో చేయండి బాగుంటాయి!
కావాల్సిన పదార్థాలు :
- 4 టేబుల్‌స్పూన్లు - ఆయిల్
- కిలో - చేప ముక్కలు
- అర స్పూన్ - పసుపు
- రుచికి సరిపడా - ఉప్పు, కారం
- ఉల్లిపాయ - 1
- పచ్చిమిర్చి - 2
- టమోటా - 1
- కరివేపాకు - 2
- కొత్తిమీర తరుగు - 1 కట్ట
- నిమ్మకాయ సైజంత - చింతపండు
- టేబుల్‌స్పూన్ - ధనియాలు
- అరటీస్పూన్ - ఆవాలు
- అరటీస్పూన్ - జీలకర్ర
- అరటీస్పూన్ - మెంతులు
- వెల్లుల్లి - 10
- అల్లం ముక్కలు - 2

తయారీ విధానం :
- ముందుగా కిలో చేప ముక్కల్లో ఉప్పు, కొద్దిగా పసుపు, నిమ్మరసం పిండుకుని బాగా కలపాలి. ఆపై రెండు మూడు సార్లు నీటితో శుభ్రం చేసుకోవాలి.
- శుభ్రం చేసిన చేప ముక్కలు వాటర్ లేకుండా వంపేసి ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, పావుటీస్పూన్ పసుపు వేసుకుని బాగా పట్టించాలి.
- ఉప్పు, కారం పట్టించిన చేప ముక్కలను 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

- అలాగే ఒక బౌల్లో నిమ్మకాయ సైజంత చింతపండు వేసి గ్లాసు నీళ్లు పోసి 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. అనంతరం చింతపండు రసం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- మసాలా ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి పాన్ పెట్టండి. ఇందులో టేబుల్‌స్పూన్ ధనియాలు, అరటీస్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. ఏ రకమైనటువంటి చేపలతో పులుసు ఎప్పుడూ చేసినా ఈ నాలుగు మసాలా దినుసులను అప్పటికప్పుడు వేయించి పొడి చేయండి. వీటి వల్ల చేపల పులుసు అద్దిరిపోతుంది.
- మసాలా దినుసులు మాడిపోకుండా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఆపై మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఆపై ఇందులోనే వెల్లుల్లి, అల్లం ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇప్పుడు చేపల పులుసు చేయడం కోసం స్టవ్‌పై వెడల్పాటి కడాయి పెట్టి 4 టేబుల్‌స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేయండి.

- ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటా ముక్కలు వేసి 2 నిమిషాలపాటు ఫ్రై చేయండి. ఆనియన్స్ కాస్త మెత్తబడిన తర్వాత కరివేపాకు, రుచికి సరిపడా కారం, పావుటీస్పూన్ పసుపు వేసి నిమిషంపాటు బాగా ఫ్రై చేయండి.
- ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలా -అల్లం పేస్ట్ వేసి నిమిషంపాటు వేయించండి.
- అనంతరం చింతపండు రసం వేసి కలిపి మీడియం ఫ్లేమ్‌లో 5 నిమిషాలు మరిగించుకోవాలి.
- పులుసు మరుగుతున్నప్పుడు మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు వేసి మూత పెట్టి లోఫ్లేమ్‌లో 20 నిమిషాలు ఉడికించుకోవాలి.
- చేప ముక్కలు ఉడుకుతున్నప్పుడు గరిటెతో నిదానంగా కలపాలి.
- చివరిగా చేపల పులుసులో ఆయిల్ పైకి తేలిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం చెక్ చేసుకోండి. అవసరమైతే యాడ్ చేసుకోండి. ఆపై కాస్త కొత్తిమీర తరుగు చల్లి స్టవ్ ఆఫ్ చేయండి.
- అంతే ఇలా సింపుల్‌గా ప్రిపేర్ కమ్మని చేపల పులుసు రెడీ!
ఇడ్లీ, దోసెల్లోకి ఎప్పుడూ చట్నీయేనా - "టమోటా షేర్వా" ట్రై చేయండి - ఒకటికి రెండు ఎక్కువే తింటారు!
"హెల్దీ కొర్రల పాయసం" -పిల్లలు స్వీట్ అడిగితే ఇలా కొత్తగా చేసి పెట్టండి! -ఎంతో కమ్మగా ఉంటుంది!