Easy Lunch Box Recipe in Telugu : చాలా మంది వేడివేడిగా ఉండే పులావ్ ఎంతో ఇష్టంగా తింటారు. రైతాతో వెజ్ పులావ్ టేస్ట్ అద్దిరిపోతుంది. అలాంటి వారి కోసం ఒక సింపుల్ పులావ్ రెసిపీ పరిచయం చేయబోతున్నాం. ఇక్కడ చెప్పిన విధంగా వెజ్ పులావ్ చేస్తే కూరగాయలు ఏవీ అవసరం లేదు. ఈ వెజ్ పులావ్ ఆఫీస్‌కు వెళ్లే వారు లంచ్ బాక్స్‌లోకి తీసుకెళ్లచ్చు. పిల్లలకు పులావ్ చేసి పెడితే మెతుకు మిగల్చకుండా తింటారు. మరి సింపుల్‌గా ఈ పులావ్‌కు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం

కావాల్సిన పదార్థాలు :
- బాస్మతి రైస్ - కప్పు
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- జీలకర్ర - అర టీ స్పూన్
- ఎండు మిర్చి - 2
- కరివేపాకు - 2 రెమ్మలు
- ఆవాలు - అర టీ స్పూన్
- జీలకర్ర- అర టీ స్పూన్
- మినప్పప్పు - అర టీ స్పూన్
- నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
- పచ్చి శనగపప్పు - అర టీ స్పూన్
- పసుపు- పావు టీ స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- కారం - రుచికి సరిపడా
- ధనియాల పొడి - అర టీ స్పూన్
- వెల్లుల్లి రెబ్బలు - 5
- సాంబార్ ఉల్లిపాయలు - కప్పు
- ఉల్లిపాయలు - 2
- మిరియాల పొడి - పావు టీస్పూన్
- చింత పండు - చిన్న నిమ్మకాయ సైజ్
- కొబ్బరి పాలు - కప్పు

"ఊటీ, మున్నార్" ఈ సమ్మర్లో ఎటు ప్లాన్ చేస్తున్నారు? - ఊరిస్తున్న టూరిజం ప్యాకేజీలు!
తయారీ విధానం:
- ముందుగా బాస్మతి రైస్ శుభ్రంగా కడిగి ఒక అరగంటపాటు నీటిలో నానబెట్టుకోవాలి.
- చిన్న గిన్నెలో చింతపండు 10 నిమిషాలు నానబెట్టుకొని, ఆపై చిక్కటి చింతపండు రసం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- అలాగే రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి. సాంబార్ ఉల్లిపాయలు పొట్టు తీసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్‌పై కడాయి పెట్టి 2 టేబుల్‌స్పూన్లు నెయ్యి వేసి వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చి శనగపప్పు వేసి ఫ్రై చేయండి. ఆపై కరివేపాకు, ఎండు మిర్చి, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి దోరగా వేయించండి.
- ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ తరుగు, సాంబార్ ఉల్లిపాయలు, కొత్తిమీర తరుగు వేసి కలుపుతూ 3 నిమిషాలు ఫ్రై చేయండి.
- ఆపై రుచికి సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు, అర టీస్పూన్ ధనియాల పొడి, పావు టీస్పూన్ మిరియాల పొడి, చిక్కటి చింతపండు రసం, కప్పు కొబ్బరి పాలు పోసి బాగా కలపండి.

- తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కప్పున్నర నీళ్లు పోసి మిక్స్ చేయండి. ఈ స్టేజ్‌లోనే పులావ్‌లో ఉప్పు, కారం, పులుపు అన్ని రుచికి సరిపడా చూసి అడ్జస్ట్ చేసుకోండి.
- అనంతరం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ నీళ్లు వంపేసి వేసి బాగా కలపండి.
- స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసి కుక్కర్‌పై మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఆపై స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లో ఆవిరి పోయిన తర్వాత వేడివేడిగా పులావ్ సర్వ్ చేసుకోండి.
- అంతే ఇలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకుంటే సూపర్ టేస్టీ పులావ్ మీ ముందుంటుంది.
ఈ పులావ్ లంచ్‌బాక్స్‌లోకి కూడా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్దీ పులావ్ తయారీ విధానం నచ్చితే మీరు ట్రై చేయండి.
టేస్టీ, హెల్దీ "రాగి పిట్టు" - ఈ బలమైన ఆహారం ఎవరైనా తినొచ్చు!
రాగి పిండితో "బన్ దోసెలు" - అప్పటికప్పుడు నిమిషాల్లో చేసేయండి - పిల్లలు ఇష్టంగా తింటారు!