ETV Bharat / offbeat

నోరూరించే "ఎండు చేపలు - చింతచిగురు" - ఒక్కసారైనా తినాల్సిందే!

- ఈ పద్ధతిలో చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది! - రుచితోపాటు ఆరోగ్యం బోనస్!

Dry Fish Curry
Dry Fish Curry (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : October 12, 2025 at 12:44 PM IST

2 Min Read
Choose ETV Bharat

Dry Fish and Tamarind Leaves Curry : నాన్​ వెజ్​లో చేపలకు సెపరేట్​ ఫ్యాన్​ బేస్ ఉంటుంది. ఇందులోనూ ఎండు చేపలను అమితంగా ఇష్టపడేవారు కూడా ప్రత్యేకంగా ఉంటారు! అయితే స్మెల్ వస్తాయనే కారణంతో చాలా మంది వీటిని దూరం పెడతారు. కానీ, ఇందులో చింత చిగురు వేసి సరిగా కుక్ చేస్తే ఈ రెసిపీ ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇంకా హెల్దీ కూడా! మరి, ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలి? కావాల్సిన పదార్థాలేంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

ఎండు చేపలు - ఒక కప్పు

చింత చిగురు - ఒక కప్పు

ఆనియన్స్ - ఒక కప్పు

శనగపప్పు - ఒక స్పూన్

జీలకర్ర - అర స్పూన్

పచ్చీమిర్చి - నాలుగు

మసాలా - అర స్పూన్

తయారీ విధానం :

  • ఎండు చేపలను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. తోకలు, ఈకలు తుంచేసుకొని పెట్టుకోవాలి
  • ఆ తర్వాత స్టౌ మీద పాన్ పెట్టుకొని, చేపలను అందులో వేసి లో-ఫ్లేమ్​లో ఫ్రై చేసుకోవాలి. స్పూన్​తో అటూ ఇటూ తిప్పుతూ ఉండాలి
  • కాసేపటి తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని చక్కగా కలిసేలా తిప్పుకోవాలి. వేగిన తర్వాత వాటిని తీసి పక్కనపెట్టుకోవాలి
  • ఇప్పుడు స్టౌ మీద కుకింగ్ పాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత అందులో స్పూన్ ఆయిల్ వేసుకోవాలి
  • అందులో స్పూన్ పచ్చి శనగపప్పు, అర స్పూన్ జీలకర్ర, ఐదారు పచ్చి మిర్చీలను తుంచి వేసుకోవాలి
  • కాసేపు తర్వాత సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కలను కూడా యాడ్ చేయాలి. ఇవి రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డోన్ బ్రౌన్​ కలర్​లోకి మారేంత వరకు గరిటతో తిప్పుకుంటూ ఉండాలి
  • ఇప్పుడు ఫ్రైచేసి పక్కన పెట్టుకున్న ఎండు చేపలను ఇందులో వేయాలి. ఉల్లిగడ్డలు, ఎండు చేపలు కలిసిపోయేలా చక్కగా మిక్స్ చేసుకోవాలి
  • సుమారు 3 నిమిషాల సేపు ఇలా కలుపుకున్న తర్వాత స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు స్పూన్ అల్లం, వెల్లుల్లి పేస్టు కూడా వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి మూడు నిమిషాల సేపు ఉడకనివ్వాలి.
  • ఆ తర్వాత మూత తీసి చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు స్పూన్ కారం వేసుకోవాలి. రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసి, అదంతా మిశ్రమానికి పట్టేలా మిక్స్ చేసుకొని, మూత పెట్టి మరో మూడు నిమిషాలు కుక్ చేసుకోవాలి
  • ఇప్పుడు మూత తీసి ఓసారి మొత్తం కలుపుకొని, అందులో కప్పు చింత చిగురు వేసుకోవాలి. ఈ చిగురు మొత్తం మిశ్రమంలో కలిసేలా మిక్స్ చేసుకొని మూత పెట్టి మరో మూడు నిమిషాలు ఉడకనివ్వాలి
  • మూత తీసి మళ్లీ మిక్స్ ఒకసారి అడుగంటకుండా మిక్స్ చేసుకొని మూత పెట్టేయాలి. కాసేపు ఉడికిన తర్వాత మూత తీసి కలుపుకొని అర స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి.
  • అంతే.. అద్దిరిపోయే చింతచిగురు, ఎండు చేపల కర్రీ సిద్ధమైపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చింత చిగురులో విటమిన్ సీ ఉంటుంది. ఎండు చేపల్లో ఐరన్, కాల్షియం ఉంటుంది.
  • సో, రుచితోపాటు ఆరోగ్యం బోనస్ అన్నమాట. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి.