Ragipindi Dosa Uttapam Recipe : బియ్యం, మినన గుండ్లు నానబెట్టుకుని వేసుకునే దోసెలు తెలుసు కానీ, రాగి పిండితో కూడా దోసెలు, ఊతప్పం వేసుకోవచ్చని తెలుసా? ఇవి ఎన్నో పోషక విలువలతో పాటు రాగి పిండి వల్ల డయాబెటిక్ పెషెంట్లకు ఎంతో ఆరోగ్యకరం. పెసరపప్పు వాడడం వల్ల పోషకాలు కూడా లభిస్తాయి. ఈ పిండి రెడీ చేసుకోవడం చాలా ఈజీ. దోసె పిండి రెగ్యులర్గా ఎలా రెడీ చేసుకుంటారో ఇది కూడా అంతే. ముందుగా పెసరపప్పును నానబెట్టుకుని మిక్సీ పట్టు అందులో రాగి పిండి కలుపుకోవడమే. ఈ పిండితో దోసెలు, ఊతప్పం కూడా వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్లు రుచి చాలా బాగుంటుంది. ఒక్కటి, రెండు దోసెలతో ఆగరు.
అన్నం, చపాతీలు, టిఫిన్లలోకి ఇదొక్కటి చాలు! - నోరూరించే వెజిటేబుల్ వంటకం
- కావాల్సిన పదార్థాలు
- కప్పు - రాగి పిండి
- కప్పు - పెసరపప్పు
- ఉప్పు - రుచికి సరిపడా
- టమోటా - 1 తరుగు కోసం
- ఉల్లిపాయ - 1 తరుగు కోసం
- కారం - 2 స్పూన్లు
తయారీ విధానం
- ముందుగా పెసరపప్పును రెండు గంటల పాటు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఆ తర్వాత నీళ్లు వడబోసి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇపుడు కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తగా రుబ్బుకుని గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. గిన్నెలోకి తీసుకున్న పెసరపప్పు మిశ్రమంలో రాగి పిండి కూడా కలుపుకుని రాత్రంతా నానబెట్టుకోవాలి. అప్పటికప్పుడు కావాలనుకుంటే వంట సోడా వేసుకుని కూడా వాడుకోవచ్చు. లేదంటే ఉదయానికి టిఫిన్లలోకి కావాలనుకుంటే మాత్రం కనీసం 4గంటలైనా నానబెడితే బాగుంటుంది.
- టిఫిన్ రెడీ చేయడానికి ముందుగా కావల్సినంత పిండి గిన్నెలోకి తీసుకుని కొద్దిగా ఉప్పు, నీళ్లు పోసుకుని కలుపుకోవాలి. ఇదే సమయంలో టమోటా సన్నగా తరిగి పెట్టుకోవాలి. అదే విధంగా ఉల్లిపాయలు, కొత్తిమీర కూడా సన్నగా తరిగి కలుపుకోవాలి. అందులో అర స్పూన్ ఉప్పు, అర స్పూన్ కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
- ఇపుడు రెడీ చేసుకున్న పిండితో ప్లేన్ దోసె వేసుకోవచ్చు. దీని కోసం పొయ్యిపై దోసె పెనం పెట్టుకుని సన్నటి మంటపై దోసె పిండి వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. మొదటి దోసె కంటే ఆ తర్వాత వేసే దోసెలు చక్కగా వస్తాయి. ఇలాగే దోసెలు కాల్చుకుని తీసుకోవాలి.
- ఇక ఊతప్పం కోసం అదే పాన్ పెట్టుకుని పిండి మందంగా వేసుకోవాలి. పిండి వేసుకున్న తర్వాత పైన ముందుగా కలుపుకున్న టమోటా ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసుకుని గరిటెతో ఒత్తుకోవాలి. ఇలా చేయడం వల్ల ఊతప్పం రెండో వైపు తిప్పి కాల్చినపుడు విడిపోకుండా ఉంటుంది.
నోరూరించే "ఆలూ మేతి మసాలా కర్రీ" - అన్నం, చపాతీ పులావ్లోకి అద్దిరిపోతుంది
ఘుమఘుమలాడే "వంకాయ, మునక్కాడ పులుసు" - ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది!