ETV Bharat / offbeat

"కమ్మటి దొండకాయ పచ్చికారం" - ఇలా చేస్తే ఎప్పటికీ వదలరు - అంత బాగుంటుంది!

దొండకాయ కర్రీ తినడం లేదా? - ఓసారి ఇలా దొండకాయ పచ్చికారం చేయండి, ఇష్టంగా తింటారు!

Dondakaya PachiKaram Recipe in Telugu
Dondakaya PachiKaram Recipe in Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 19, 2025 at 10:13 AM IST

2 Min Read
Choose ETV Bharat

Dondakaya PachiKaram Recipe in Telugu : కొందరు దొండకాయ ఫ్రై, కర్రీ ఏది చేసినా ఎంతో ఇష్టంగా తింటారు. కానీ మరి కొంతమంది కర్రీ ఎంత బాగున్నా అస్సలు టేస్ట్​ చేయరు. అలాంటి వారు ఒక్కసారి ఇక్కడ చెప్పిన విధంగా "దొండకాయ పచ్చికారం" ట్రై చేయండి. ఈ విధంగా కూర వండితే వద్దన్న వారు కూడా కర్రీ మరోసారి వేసుకుని ఇష్టంగా తింటారు. దొండకాయ పచ్చికారం వేడివేడి అన్నంతో పాటు, చపాతీలు, పుల్కాల్లోకి టేస్ట్​ అద్దిరిపోతుందంటే నమ్మాల్సిందే. మరి ఇక లేట్​ చేయకుండా దొండకాయ పచ్చికారం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

Dondakaya
Dondakaya (ETV Bharat)

దొండకాయ పచ్చికారం తయారీకి కావాల్సిన పదార్థాలు :

  • లేత దొండకాయలు - పావు కేజీ
  • జీలకర్ర - అర టీ స్పూన్
  • ఆవాలు - అర టీ స్పూన్​
  • ఉల్లిపాయ-1
  • వెల్లుల్లి రెబ్బలు - 5
  • పచ్చిమిర్చి - 5
  • వాటర్-సరిపడా
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • పసుపు - అర టీ స్పూన్​
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • ధనియాల పొడి- టీ​స్పూన్​
  • పెరుగు-2 టేబుల్​స్పూన్లు
  • గరం మసాలా- అరటీస్పూన్
  • కారం- అరటీస్పూన్
  • కసూరీ మేథి -కొద్దిగా
Curd
Curd (Getty Images)

దొండకాయ పచ్చికారం తయారీ విధానం:

  • ఇందుకోసం ముందుగా దొండకాయలను శుభ్రంగా కడిగి చివర్లు కట్​ చేసి పొడుగ్గా, సన్నగా ముక్కలుగా కట్​ చేసుకోవాలి.
Dondakaya PachiKaram Recipe
Dondakaya PachiKaram Recipe (ETV Bharat)
  • అలాగే రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కట్​ చేసుకోవాలి.
  • అనంతరం ఓ మిక్సీ గిన్నెలో​ కట్​ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర తరుగు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్​ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి కడాయి పెట్టి 2 టేబుల్​స్పూన్లు నూనె పోసుకోవాలి. ఆయిల్​ ​ హీటెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి ఫ్రై చేయండి.
  • అనంతరం గ్రైండ్​ చేసిన ఉల్లిపాయ పేస్ట్​ వేసి పచ్చి వాసన పోయే వరకు మూడు నిమిషాలు ఫ్రై చేయండి. ఆపై పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపండి.
  • అనంతరం ముందుగా కట్​ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసి బాగా కలపండి. కర్రీ అడుగు పట్టకుండా ఉండడానికి కొన్ని వాటర్​ పోసి గిన్నెపై మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోవాలి.
  • దొండకాయ ముక్కలు కాస్త ఉడికిన తర్వాత ఇందులో పెరుగు వేసి బాగా కలపండి. అనంతరం ధనియాలపొడి, కారం, గరం మసాలా వేసి బాగా కలపండి.
  • ఆపై గ్రేవీకి సరిపడా అరకప్పు నుంచి పావు కప్పు వరకు నీళ్లు​ పోసుకుని కలిపి మూత పెట్టండి.
  • ఓ 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర తరుగు, కసూరీ మేథి చేతితో నలిపి వేసి కలిపి స్టవ్​ ఆఫ్ చేయండి.
  • అంతే ఇలా సింపుల్​గా ప్రిపేర్​ చేసుకుంటే ఎంతో రుచికరమైన దొండకాయ పచ్చికారం రెడీ!
  • ఈ దొండకాయ పచ్చికారం వేడివేడి అన్నం, చపాతీల్లోకి రుచి అద్భుతంగా ఉంటుంది. దొండకాయ పచ్చికారం తయారీ విధానం నచ్చితే ఇలా ఓ సారి దొండకాయ కర్రీ ట్రై చేయండి.

రుచికరమైన "ఆలు బజ్జీలు" - పొంగుతూ క్రిస్పీగా రావాలంటే ఈ టిప్స్ ఫాలో చేస్తే చాలు!

హోటళ్లలో ఎక్కడా దొరకని "హెల్దీ పచ్చడి" ఇది - ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది!