ETV Bharat / offbeat

నోరూరించే కొత్తరకం "దోశ" ట్రై చేయండి! - భలే రుచిగా ఉంటుంది!

- సొరకాయతో క్రిస్పీ అండ్ టేస్టీ 'దోశలు' - పిల్లలైతే ఒకటికి రెండు ఇష్టంగా తింటారు!

Crispy Dosa Recipe with Sorakaya
Crispy Dosa Recipe with Sorakaya (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : July 24, 2025 at 3:32 PM IST

3 Min Read
Choose ETV Bharat

Crispy Dosa Recipe with Sorakaya : మార్నింగ్ బ్రేక్​ఫాస్ట్​లో పిల్లల నుంచి పెద్దల వరకు క్రిస్పీ, టేస్టీగా ఉండే దోశలను ఎంతో ఇష్టంగా తింటారు. అలాగని రోజూ ఒకే రకమైన దోశలను తినాలంటే ఎవరికైనా బోరింగ్ ఫీల్ వచ్చేస్తుంది. అందుకే మీకోసం ఒక వెరైటీ రెసిపీని తీసుకొచ్చాం. అదే, కమ్మగా కరకరలాడే "సొరకాయ దోశలు". ఇవి రెగ్యులర్​గా తినే వాటిని మించిన టేస్ట్​తో భలే రుచికరంగా ఉంటాయి. పిల్లలు కూడా సొరకాయతో చేశారనే ఫీల్ రాకుండా ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే, వీటి తయారీ కోసం పిండినీ పులియబెట్టాల్సిన అవసరం లేదు! చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్​తో కమ్మగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి, నోరూరించే ఈ సొరకాయ దోశలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Crispy Dosa Recipe with Sorakaya
Rice (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  1. బియ్యం - రెండు కప్పులు
  2. శనగపప్పు - నాలుగు టేబుల్​స్పూన్లు
  3. మినపప్పు - నాలుగు టేబుల్​స్పూన్లు
  4. సొరకాయ - ఒకటి(అరకిలో)
  5. పచ్చిమిర్చి - నాలుగైదు
  6. అల్లం - చిన్న ముక్క
  7. నూనె - కొద్దిగా(దోశపై వేసుకోవడానికి)

బోనాల వేళ కొబ్బరి చిప్పలు మిగిలాయా? - ఇలా "కొబ్బరి లడ్డూలు" చేసుకోండి! - పాకంతో పని లేదు!

Crispy Dosa Recipe with Sorakaya
Sorakaya (Getty Images)

తయారీ విధానం :

  • ఈ వెరైటీ రుచికరమైన దోశ రెసిపీ కోసం ముందుగా పిండిని సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం ఒక గిన్నెలో బియ్యం, శనగపప్పు, మినపప్పుని తీసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేయాలి.
  • తర్వాత ఆ మిశ్రమంలో తగినన్ని నీళ్లు పోసి కనీసం 3 గంటల పాటు నాననివ్వాలి. అలాకాకుండా మీరు మార్నింగ్ బ్రేక్​ఫాస్ట్​లోకి చేసుకునేవారైతే రాత్రి పడుకునే ముందు నానబెట్టుకున్నా సరిపోతుంది.
  • అనంతరం తాజా లేత సొరకాయను తీసుకొని పైన చెక్కును పీలర్​ లేదా చాకుతో రిమూవ్ చేసుకోవాలి. ఆపై శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
Crispy Dosa Recipe with Sorakaya
Mirchi (Getty Images)
  • ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో బాగా నానిన బియ్యం పప్పుల మిశ్రమం, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వేసుకొని ముందుగా వాటర్ వేయకుండా కొంచం నలిగే వరకు మిక్సీ పట్టుకోవాలి.
  • తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను కొద్దికొద్దిగా యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి.
  • సొరకాయ ముక్కలన్ని వేసుకొని మిక్సీ పట్టుకున్నాక చివర్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మరోసారి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి.
  • తర్వాత గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్​లోకి తీసుకొని రుచికి తగినంత ఉప్పు, దోశ పిండి కన్సిస్టెన్సీకి అవసరమైన మేర వాటర్ యాడ్ చేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఆపై గిన్నె మీద మూత ఉంచి 20 నుంచి 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
Crispy Dosa Recipe with Sorakaya
Allam (Getty Images)
  • అనంతరం స్టవ్ మీద దోశ పాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. పెనం వేడయ్యాక కాస్త నూనె అప్లై చేసుకొని మంటను తగ్గించి ముందుగా రెడీ చేసుకున్న పిండిని ఒకట్రెండు గరిటెలు వేసుకొని పల్చని దోశలా స్ప్రెడ్ చేసుకోవాలి.
  • దోశను వేసుకున్నాక స్టవ్​ను మీడియం ఫ్లేమ్​కి టర్న్​ చేసి అంచుల వెంబడి, పైన కాస్త నూనెను వేసుకొని చక్కగా కాల్చుకోవాలి.
  • అది వన్​సైడ్ మంచిగా కాలిన తర్వాత నిదానంగా గరిటెతో రెండో వైపునకు టర్న్ చేసుకొని అటు వైపు కూడా బాగా కాలనిచ్చి ఆపై ప్లేట్​లోకి తీసుకుంటే చాలు. అంతే, సొరకాయతో కరకరలాడే కమ్మని "దోశలు" మీ ముందు ఉంటాయి!

చిట్కాలు :

  • ఇక్కడ కప్పు కొలతలో సొరకాయ ముక్కలు తీసుకోవాలనుకుంటే ఒక కప్పు బియ్యానికి మూడు కప్పుల సొరకాయ ముక్కలు సరిగా సరిపోతాయి.
  • అలాగే, ఒకవేళ మీరు ముదరు సొరకాయ తీసుకున్నట్లయితే గింజలు తొలగించి తీసుకోవాలి.
  • దోశను కాల్చుకునేటప్పుడు అది మాడిపోకుండా మీడియం ఫ్లేమ్​లో నెమ్మదిగా కాల్చుకోవాలి. అలాగే, క్రిస్పీగా రావాలంటే కాస్త పలుచగా వేసుకోవాలి.

బ్యాచిలర్స్ స్పెషల్ కమ్మని "టమాటా కర్రీ" - అల్లంవెల్లుల్లి పేస్ట్, మసాలాలు వేయకుండానే అద్భుతమైన రుచి!

ఉల్లిపాయలతో పకోడీ రొటీన్ - ఇలా కరకరలాడే "బోండాలు" చేసుకోండి! - కమ్మగా ఉంటాయి!