ETV Bharat / offbeat

స్ట్రీట్ స్టైల్​లో అరకేజీ "చికెన్ పకోడీ"కి పర్ఫెక్ట్ కొలతలివే! - నూనె కూడా పీల్చవు! - చల్లని వేళ మస్త్ మజానిస్తాయి! - PERFECT CHICKEN PAKODA RECIPE

- ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్​లో కరకరలాడే కమ్మని 'పకోడీ' - ఇలా చేసి పెడితే ఇంటిల్లిపాదీ ఫుల్ ఖుష్!

Street Style Crispy Chicken Pakoda
Street Style Crispy Chicken Pakoda (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : June 9, 2025 at 11:01 AM IST

3 Min Read

Street Style Crispy Chicken Pakoda : వాతావరణంగా కూల్​గా ఉన్నప్పుడు వేడివేడిగా ఏదైనా స్నాక్స్ తినాలనిపించడం కామన్. అందులోనూ నాన్​వెజ్​తో చేసినవైతే ఇంటిల్లిపాదీ లొట్టలేసుకుంటూ మరీ తింటారు. అలాంటి వాటిల్లో చికెన్ పకోడీ ముందు వరుసలో ఉంటుంది. అయితే, ఎక్కువ మంది దీన్ని ఇంట్లో చేసుకోవడం కాస్త టైమ్​ టేకింగ్ ప్రాసెస్​గా భావించి బయట బండ్లపై టేస్ట్ చేస్తుంటారు. మరికొందరు మాత్రం ఇంట్లో ట్రై చేస్తారు. కానీ, స్ట్రీట్ స్టైల్ రుచి రావట్లేదని ఫీల్ అవుతుంటారు. అలాంటి వారు ఓసారి ఈ కొలతలతో "చికెన్ పకోడీ" చేసుకొని చూడండి. అస్సలు నూనె పీల్చకుండా స్ట్రీట్ స్టైల్ రుచితో క్రిస్పీగా కరకరలాడుతూ వస్తుంది. వెదర్ కూల్​గా ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టారంటే పిల్లలే కాదు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. మొదటిసారి చేసుకునేవారూ ఈ కొలతలతో పర్ఫెక్ట్​గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి, ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

Crispy Chicken Pakoda
Chicken Pakoda Recipe (ETV Bharat)

కావాల్సిన పదార్థాలు :

  • చికెన్ - అరకేజీ
  • ఉప్పు - రుచికి తగినంత
  • పసుపు - పావుటీస్పూన్
  • నిమ్మరసం - అర చెక్క
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - రెండు టీస్పూన్లు
  • కారం - రెండు టీస్పూన్లు(రుచికి తగినంత)
  • ధనియాల పొడి - ఒకటీస్పూన్
  • జీలకర్ర పొడి - అరటీస్పూన్
  • గరంమసాలా - ఒకటిన్నర టీస్పూన్లు
  • మిరియాల పొడి - అరటీస్పూన్
  • చాట్ మసాలా - అరటీస్పూన్
  • పచ్చిమిర్చి చీలికలు - మూడు
  • సన్నని కరివేపాకు తరుగు - రెండు టేబుల్​స్పూన్లు
  • కొత్తిమీర తరుగు - రెండు టేబుల్​స్పూన్లు
  • పుదీనా ఆకులు - కొన్ని
  • బియ్యప్పిండి - రెండు టేబుల్​స్పూన్లు
  • కార్న్ ఫ్లోర్ - రెండు టేబుల్​స్పూన్లు
  • నూనె - అరటేబుల్​స్పూన్
  • కోడిగుడ్డు - ఒకటి
  • నూనె - వేయించడానికి తగినంత

బండి మీద చేసే క్రిస్పీ అండ్ టేస్టీ "రవ్వ దోశలు" - ఈ కొలతలు, టిప్స్​తో చేసుకుంటే పర్ఫెక్ట్​గా వస్తాయి!

Crispy Chicken Pakoda
Chicken Pakoda (ETV Bharat)

తయారీ విధానం :

  • చికెన్ పకోడీ తయారీ కోసం ​ముందుగా సగం బోన్​లెస్, మరో సగం విత్ బోన్స్ ఉన్న చికెన్​ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత చికెన్ ముక్కలను శుభ్రంగా కడగాలి.
  • ఆపై అందులో రుచికి తగినంత ఉప్పు, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం పిండుకొని వాటన్నింటిని చికెన్ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి.
Crispy Chicken Pakoda
Crispy Chicken Pakoda (ETV Bharat)
  • ఆ తర్వాత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరంమసాలా, మిరియాల పొడి, చాట్ మసాలా, పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి.
  • అలాగే, సన్నగా తరుక్కున్న కొత్తిమీర, కరివేపాకు తరుగు, పుదీనా ఆకులు, బియ్యప్పిండి, కార్న్ ఫ్లోర్​, నూనె యాడ్ చేసుకున్నాక కోడిగుడ్డు పగులగొట్టి పోసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్ ముక్కలకు చక్కగా పట్టేలా చేతితో బాగా కలుపుకోవాలి. ఆపై గిన్నెపై మూతపెట్టి గంటపాటు పక్కన పెట్టుకోవాలి.
Crispy Chicken Pakoda
Chicken Pakoda (ETV Bharat)
  • అనంతరం స్టవ్ మీద కడాయి పెట్టుకొని తగినంత నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక స్టవ్​ను మీడియం ఫ్లేమ్​లో ఉంచి గంటపాటు మారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్​ని పాన్​లో సరిపడా వేసుకొని గరిటెతో కదుపుతూ క్రిస్పీగా, ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి.
  • ఆవిధంగా వేయించుకున్నాక టిష్యూ పేపర్ పరచిన ప్లేట్​లోకి తీసుకొని కాసేపు ఉంచి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, స్ట్రీట్ స్టైల్ రుచితో కరకరలాడే కమ్మని "చికెన్ పకోడీ" రెడీ!
Crispy Chicken Pakoda
Crispy Chicken Pakoda in Telugu (ETV Bharat)

చిట్కాలు :

  • ఇక్కడ కార్న్​ఫ్లోర్ అందుబాటులో లేకపోతే దాని ప్లేస్​లో శనగపిండి లేదా మైదాను వాడుకోవచ్చు.
  • చికెన్ మిశ్రమాన్ని చక్కగా మారినేట్ చేసుకున్నాక నార్మల్​గా బయట అయితే గంటపాటు, ఫ్రిడ్జ్​లో అయితే అరగంట పాటు ఉంచితే సరిపోతుంది.

"బియ్యప్పిండి జంతికలు" గట్టిగా వస్తున్నాయా? - ఇలా చేశారంటే గుల్లగా, క్రిస్పీగా కరకరలాడుతాయి!

చుక్క ఆయిల్​ లేకుండా అద్దిరిపోయే "వడలు" - డీప్ ఫ్రై లేకుండానే సూపర్ టేస్టీగా, హెల్దీగా!!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.