ETV Bharat / offbeat

రుచికరంగా ఏమైనా "స్నాక్స్" తినాలనిపిస్తే - కరకరలాడే "మీల్ మేకర్ మసాలా వడలు" చేసుకోండి! - SIMPLE SNACK RECIPE FOR KIDS

పిల్లలు మీల్ మేకర్ అంటే నో అంటున్నారా? - ఇలా "మసాలా వడలు" చేసి పెట్టండి!

Meal Maker Masala Vada in Telugu
Meal Maker Masala Vada (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : June 6, 2025 at 5:30 PM IST

4 Min Read

Meal Maker Masala Vada Making Process : పిల్లలు సాయంకాలం కాగానే తినడానికి ఏమైనా స్నాక్స్ అడుగుతుంటారు. ఇలాంటి టైమ్​లో రెగ్యులర్​గా చేసేవి కాకుండా ఈసారి కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే, మీకోసమే ఒక అద్భుతమైన స్నాక్ రెసిపీ వెయిట్ చేస్తోంది. అదే, "మీల్ మేకర్ మసాలా వడలు". వీటినే కొన్ని ప్రాంతాల్లో 'మసాలా గారెలు' అని కూడా పిలుస్తుంటారు. ప్రొటీన్స్​తో పాటు మరెన్నో పోషకాలు పుష్కలంగా ఉండే మీల్ మేకర్స్ తినని పిల్లలకు కమ్మగా, కరకరలాడే ఈ వడలు చేసి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తింటారు. పైన క్రంచీగా, లోపల సాఫ్ట్​గా ఉండే ఈ వడలను ఎన్ని తిన్నా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. వీటిని ఈవెనింగ్ స్నాక్​గానే కాదు మార్నింగ్ బ్రేక్​ఫాస్ట్​లోకి క్విక్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకొని ఆస్వాదించవచ్చు. మరి, ఈ క్రిస్పీ అండ్ టేస్టీ వడలను ఎలా చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.

Meal Maker Masala Vada
Meal Maker Masala Vada (ETV Bharat)

తీసుకోవాల్సిన పదార్థాలు :

  • పచ్చిశనగపప్పు - ఒక కప్పు
  • చిన్న సైజ్ మీల్ ​మేకర్స్ - 100 గ్రాములు
  • అల్లం - అంగుళం ముక్క
  • ఎండుమిర్చి - నాలుగు
  • వెల్లుల్లి రెబ్బలు - ఐదు
  • మిరియాలు - అరటీస్పూన్
  • జీలకర్ర - అరటీస్పూన్
  • ఉప్పు - రుచికి తగినంత
  • సన్నని కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • కరివేపాకు - ఒక రెమ్మ
  • పసుపు - పావుటీస్పూన్
  • ఉల్లిపాయ - ఒకటి
  • గరంమసాలా - అరటీస్పూన్
  • బియ్యప్పిండి - 3 టేబుల్​స్పూన్లు
  • నూనె - వేయించడానికి తగినంత

ఇడ్లీ పిండిలో ఇదొక్కటి వేసి "పునుగులు" చేయండి - కమ్మగా, కరకరలాడుతూ భలే రుచిగా వస్తాయి!

Meal Maker Masala Vada
Meal Maker Masala Vada (ETV Bharat)

తయారీ విధానం :

  • ఈ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ కోసం ముందుగా ఒక గిన్నెలో పచ్చిశనగపప్పుని తీసుకొని శుభ్రంగా కడిగి ఆపై తగినన్ని నీళ్లు పోసుకొని రెండు నుంచి మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి.
  • ఆలోపు మిగతా ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో చిన్న సైజ్ మీల్​ మేకర్స్ తీసుకొని అందులో తగినన్ని వేడి నీళ్లు పోసి ఒకసారి కలిపి ఐదు నిమిషాల పాటు పక్కనుంచాలి.
  • ఐదు నిమిషాల అనంతరం నానిన మీల్ మేకర్స్​లోని వేడి నీటిని​ మరో బౌల్​లోకి వంపేసుకొని చల్లని నీటిని పోసుకోవాలి. ఆపై మీల్ మేకర్స్​ని ఏమాత్రం వాటర్ లేకుండా గట్టిగా పిండేసుకొని ఇంకో బౌల్​లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • అలాగే, రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకును సన్నగా తరుక్కొని రెడీగా ఉంచుకోవాలి.
  • ఇప్పుడు మిక్సీ జార్​ తీసుకొని అందులో అల్లం ముక్కలు, ఎండుమిర్చి, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు, జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి.
Meal Maker Masala Vada
Masala Vada Making (ETV Bharat)
  • అనంతరం మిక్సీ పట్టుకున్న మిశ్రమంలో వాటర్ వడకట్టి పక్కన పెట్టుకున్న మీల్ మేకర్స్ వేసుకోవాలి.
  • తర్వాత చక్కగా నానిన పచ్చిశనగపప్పుని వాటర్ వడకట్టుకొని మరోసారి కడగాలి. ఆపై అందులో కొద్దిగా పప్పుని ఒక ప్లేట్​లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • అనంతరం మిగిలిన శనగపప్పుని మీల్ మేకర్స్ ఉన్న మిక్సీ జార్​లో వేసుకొని మెత్తని పేస్ట్​లా మిక్సీ పట్టుకోవాలి.
  • ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మీల్ మేకర్ పేస్ట్ మిశ్రమాన్ని ఒక వెడల్పాటి ప్లేట్ లేదా బేషన్​లోకి తీసుకోవాలి. ఆపై అందులో ముందుగా పక్కకు తీసుకున్న నానబెట్టుకున్న శనగపప్పు, రుచికి తగినంత ఉప్పు, సన్నని కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు వేసుకోవాలి.
  • అలాగే, పసుపు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్నని ఉల్లిపాయ ముక్కలు, కోటింగ్ కోసం తడి బియ్యప్పిండిని యాడ్ చేసుకొని మిశ్రమం చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఇక్కడ పిండి అనేది గారెల కన్సిస్టెన్సీకి తగినవిధంగా ఉండాలి.
  • అనంతరం కొద్దికొద్దిగా పిండిని తీసుకుంటూ ముందు ఉండలా చేసుకొని ఆపై ఎక్కడ పగుళ్లు లేకుండా వత్తుకుంటూ గారెల మాదిరిగా చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్​లో పెట్టుకొని పక్కనుంచాలి.
Meal Maker Masala Vada
Meal Maker Masala Vada in Telugu (ETV Bharat)
  • ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి తగినంత నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత అందులో ముందుగా ప్రిపేర్ చేసుకొని గారెలను పాన్​లో సరిపడా నెమ్మదిగా వేసుకొని మీడియం ఫ్లేమ్​లో వేయించుకోవాలి.
  • అయితే, వీటిని వేసిన వెంటనే తిప్పకుండా రెండు నిమిషాలు ఆగి ఆపై చిల్లుల గరిటెతో అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా ఎర్రగా, మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి.
  • అలా వేయించుకున్నాక టిష్యూ పేపర్ పరచిన ప్లేట్​లోకి తీసుకొని కాసేపు ఉంచి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, సూపర్ టేస్టీ అండ్ క్రిస్పీ "మీల్ మేకర్ మసాలా వడలు" రెడీ!

చిట్కాలు :

Meal Maker Masala Vada
Meal Maker Masala Vada Recipe (ETV Bharat)
  • ఒకవేళ ఇక్కడ మీరు పచ్చిశనగపప్పు వద్దనుకుంటే దాని ప్లేస్​లో తగినంత శనగపిండిని అయినా తీసుకొని ఈ వడలు చేసుకోవచ్చు.
  • అలాగే, బియ్యప్పిండి వద్దనుకుంటే దాని ప్లేస్​లో కార్న్ ఫ్లోర్​ని యూజ్ చేసుకోవచ్చు.
  • ఆయిల్ సరిగా కాగిన తర్వాత మాత్రమే వడలను వేసి వేయించుకోవాలి. లేదంటే వడల పిండి విడిపోయి నూనె మొత్తం వేస్ట్ అవుతుందని గుర్తుంచుకోవాలి.

"కజ్జికాయలు" చేసుకునే సరికొత్త పద్ధతి - పీట లేకున్నా ఒక్కరే నిమిషాల్లో ఎక్కువ మొత్తంలో చేసుకోవచ్చు!

పిల్లలకు "చిట్టి మురుకులు" చేసి పెట్టండి - ఇక దుకాణం మాటెత్తరు! - కరకరలాడే వాటిని కమ్మగా తినేస్తారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.