ఎండల్లో ఒంటికి చలువ చేసే "కొత్తిమీర దోశ" - పిండి నానబెట్టే పనిలేకుండానే అద్దిరిపోయే రుచి!
- కోరుకోగానే అద్దిరోపోయే దోశ మీ ప్లేట్లో!
Coriander Dosa (ETV Bharat)

Published : May 9, 2025 at 10:51 AM IST
Coriander Dosa : ఎండాకాలంలో ప్రతి ఒక్కరినీ వేధించే సమస్య డీహైడ్రేషన్! గ్లాసుల కొద్దీ నీళ్లు తాగినా చెమట రూపంలో ఆవిరైపోతూనే ఉంటాయి. అందుకే శరీరానికి చలువ చేసే ఆహారం కూడా తీసుకోవడం చాలా అవసరం. అలాంటి ఆహారాల్లో ఒక సూపర్ రెసిపీని ఇప్పుడు మనం చూడబోతున్నాం. అదే కొత్తిమీర దోశ! బాడీని కూల్ చేయడంలో కొత్తిమీర చాలా హెల్ప్ చేస్తుంది. మరి, అలాంటి దోశను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- కొత్తిమీర - 1 కప్పు
- పచ్చిమిర్చి - 2
- అల్లం ముక్క- 1 ఇంచు
- గోధుమపిండి - 1 కప్పు
- బియ్యం పిండి - 1/4 కప్పు
- బొంబాయి రవ్వ - 1/4 కప్పు
- ఉప్పు - తగినంత
- నీరు - తగినన్ని

తయారు విధానం :
- ముందుగా కొత్తిమీరను శుభ్రంగా క్లీన్ చేసుకొని మిక్సీ జార్ లో వేసుకోండి.
- అందులోనే పచ్చి మిర్చి, అల్లం ముక్క, కాసిన్ని నీళ్లు పోసి గ్రైండ్ చేయండి.
- మొత్తంగా ఈ మిశ్రమాన్ని మెత్తని పేస్టులా తయారు చేసుకోవాలి.
- అనంతరం ఈ పేస్టును మిక్సింగ్ బౌల్‌లో వేసుకోవాలి.
- ఆ తర్వాత అందులోనే బియ్యం పిండి, గోధుమపిండి, బొంబాయి రవ్వ వేయండి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి మొత్తం కలిసిపోయేలా బాగా మిక్స్ చేయాలి.
- కలుపుతున్నప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ కలుపుకోవాలి. దోశ వేయడానికి ఎంత కన్సెస్టెన్సీ అవసరమో అంత మేరకు పిండిని జారుగా చేసుకోవాలి.
- ఇప్పుడు స్టౌ మీద దోశ పెనం పెట్టి, సిద్ధమైన కొత్తిమీర పిండితో దోశ వేయండి.
- ఈ దోశను రెండువైపులా కాల్చుకుంటే బాగుంటుంది. స్టౌ మీడియం ఫ్లేమ్ లో పెట్టి, రెండు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత, మరో వైపు తిప్పుకొని అదేవిధంగా కాల్చుకోవాలి.
- అవసమైనంత మేరకు ఆయిల్ వేసుకోండి. నచ్చినవారు నెయ్యి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది.
- ఈ దోశలను పల్లీచట్నీతోపాటు కొబ్బరి, టమాటా చట్నీలతో తిన్నా కూడా చాలా బాగుంటాయి.
పిల్లల నుంచి పెద్దల దాకా :

- దోశలను పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ ఇష్టపడతారు. ఎండా కాలంలో ఒంటిని చల్లబరిచేందుకు ఇది ఎంతో మేలు చేస్తుంది.
- ఇందులో మరో ముఖ్యమైన విషయం ఏమంటే, రెగ్యులరో దోశ తయారీకోసం ముందు రోజు రాత్రి పిండి నానబెట్టాల్సి ఉంటుంది. కానీ, ఈ కొత్తిమీర దోశ కోసం ఇలాంటి అవసరం కూడా లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు నిమిషాల్లో దోశ ప్రిపేర్ చేసుకోవచ్చు.
- ఇంట్లో తినడానికి ఏమీ లేనప్పుడు, లేదా నోటికి ఇష్టంగా ఏదీ తినబుద్ధి కానప్పుడు, పిల్లలు ఏదైనా రెసిపీ కావాలని అడిగినప్పుడు కూడా ఈ దోశ పర్ఫెక్ట్ ఆప్షన్‌గా ఉంటుంది.
- సో, మీకు నచ్చితే తప్పుకుండా ట్రై చేయండి. పిల్లలైతే ఒకటికి రెండు తింటారు, మళ్లీ మళ్లీ కావాలని అడుగుతారు.

