ETV Bharat / offbeat

తీయటి "పచ్చికొబ్బరి బెల్లం లడ్డూలు" - రక్తహీనతతో బాధపడేవారు ఓసారి ఇలా ట్రై చేయండి! - COCONUT JAGGERY LADDU

పచ్చి కొబ్బరితో పచ్చడే కాదు - ఇలా బెల్లం లడ్డూలు చేసుకోండి బాగుంటాయి

Coconut Jaggery Laddu Recipe in Telugu
Coconut Jaggery Laddu Recipe in Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 14, 2025 at 12:20 PM IST

2 Min Read

Coconut Jaggery Laddu Recipe in Telugu : చాలా మంది ఇంట్లో దేవుడికి నైవేద్యంగా సమర్పించిన కొబ్బరి చిప్పలు మిగిలిపోతే వాటితో పచ్చడి పెడుతుంటారు. మరికొందరు చక్కెర కలిపి తీయటి లడ్డూలు చేస్తుంటారు. అయితే, ఒసారి ఇలా బెల్లంతో పచ్చి కొబ్బరి లడ్డూలు ట్రై చేయండి. ఈ పచ్చికొబ్బరి బెల్లం లడ్డూలు పిల్లలు, పెద్దలందరూ ఇష్టంగా తింటారు. పైగా ఈ లడ్డూలు చేయడం కూడా సులభం. మరి ఎంతో కమ్మగా ఉండే పచ్చికొబ్బరి బెల్లం లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన ఇంగ్రీడియంట్స్ :

  • నెయ్యి - 3 టేబుల్​స్పూన్లు
  • బాదంపప్పు - అర కప్పు
  • జీడిపప్పు పలుకులు - అర కప్పు
  • పచ్చి కొబ్బరి తురుము - కప్పు
  • బెల్లం - 1 కప్పు
  • యాలకుల పొడి - టీస్పూన్
Dry Fruits
Dry Fruits (Getty Images)

పిల్లలు రాగులతో చేసిన వంటలు తినడం లేదా? - ఇలా "రాగి తోప" చేసి పెట్టండి! ఇష్టంగా తింటారు!

తయారీ విధానమిలా :

Coconut Jaggery Laddu
Coconut Jaggery Laddu (ETV Bharat)
  • ఇందుకోసం ముందుగా పచ్చి కొబ్బరి పైన ఉండే బ్రౌన్​ పార్ట్ పీలర్​ సహాయంతో​ తొలగించుకోవాలి.
  • అనంతరం గ్రేటర్​ సహాయంతో పచ్చి కొబ్బరి తురుముకోవాలి. ఈ పచ్చికొబ్బరి తురుము ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
  • ఇప్పుడు స్టవ్​ మీద ఒక మందపాటి పాన్ పెట్టుకొని 2 టేబుల్​స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అది కరిగి హీటయ్యాక బాదంపప్పు, జీడిపప్పు పలుకులు వేసుకొని లో ఫ్లేమ్ మీద చక్కగా వేయించుకోవాలి.
  • దోరగా వేగిన డ్రై ఫ్రూట్స్​ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి.
  • ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్​ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ మీద కడాయి పెట్టుకొని పచ్చి కొబ్బరి తురుము వేయండి. ఇందులోనే కప్పు బెల్లం తురుము, కొన్ని వాటర్​ పోసుకొని బెల్లం పూర్తిగా కరిగే వరకు కలుపుతూ ఫ్రై చేయాలి.
Coconut Jaggery Laddu
Coconut Jaggery Laddu (ETV Bharat)
  • బెల్లం పూర్తిగా కరిగి పచ్చి కొబ్బరిలో కలిసి కాస్త దగ్గర పడిన తర్వాత టీస్పూన్​ యాలకుల పొడి, గ్రైండ్​ చేసుకున్న డ్రై ఫ్రూట్స్​ పొడి వేసి బాగా కలపండి.
  • ఇప్పుడు స్టవ్​ ఆఫ్​​ చేసి మిశ్రమాన్ని కాస్త చల్లారనివ్వండి.
  • అనంతరం చేతులకు నెయ్యి రాసుకొని అందులో నుంచి కొద్దికొద్దిగా మిశ్రమం తీసుకొని లడ్డూల్లా చుట్టుకోవాలి.
  • అంతే, ఇలా సింపుల్​గా ప్రిపేర్​ చేసుకుంటే కమ్మని "పచ్చికొబ్బరి బెల్లం లడ్డూలు" రెడీ!
  • ఈ పచ్చికొబ్బరి బెల్లం లడ్డూలు ఫ్రిడ్జ్​లో పెట్టుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఈ లడ్డూల తయారీ విధానం నచ్చితే మీరు ట్రై చేయండి.

"తెలంగాణ దావత్ స్టైల్​ మటన్ కర్రీ" - ఓసారి ఇలా ఇంట్లో చేయండి! అందరూ "సూపర్"​ అంటారు!

గుంటూర్ స్పెషల్​ "గుత్తి వంకాయ కారం" - నెయ్యి వేసుకుని తింటే మైమరచిపోయే రుచి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.