ETV Bharat / offbeat

"కమ్మటి చింతాకు కారంపొడి" - ఇలా చేస్తే నెల రోజులపాటు నిల్వ! వేడివేడి అన్నంలోకి అద్ధిరిపోతుంది! - CHINTAKU PODI RECIPE

చింత చిగురుతో పప్పు, పచ్చడి అందరూ చేస్తారు! - ఓసారి ఇలా చింతాకు కారం పొడి రెడీ చేయండి!

Chintaku Podi Recipe In Telugu
Chintaku Podi Recipe In Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 11, 2025 at 4:01 PM IST

2 Min Read

Chintaku Podi Recipe In Telugu : చాలా మంది చింత చిగురుతో పప్పు, చింత చిగురు పచ్చడి, చారు చేస్తుంటారు. ఈ రెసిపీలన్నీ పుల్లపుల్లగా నోటికి ఎంతో రుచిగా ఉంటాయి. అయితే, మీరు ఎప్పుడైనా చింతాకుతో కారం పొడి ప్రిపేర్ చేశారా? ఈ చింతాకు కారం పొడి వేడివేడి అన్నంలోకి ఎంతో రుచిగా ఉంటుంది. పైగా చింతాకు కారం పొడి చేయడం కూడా సులభం. మరి ఈజీగా చింతాకు కారం పొడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

Chintaku
Chintaku (Getty Images)

తీసుకోవాల్సిన పదార్థాలు :

  • చింతాకు - రెండు కప్పులు
  • 2 టేబుల్​స్పూన్లు ధనియాలు
  • టీస్పూన్ జీలకర్ర
  • ఎండు మిర్చి - 20
  • కొద్దిగా నూనె
  • గుప్పెడు కరివేపాకు
  • వెల్లుల్లి - 10
Dhania
Dhania (Getty Images)

హనుమాన్ జయంతి స్పెషల్ "వడలు" - సింపుల్​గా ఇలా చేసేసి నైవేద్యం పెట్టేయండి!

తయారీ విధానం

  • ఇందుకోసం ముందుగా మరీ ముదురుగా, లేతగా కాకుండా ఉన్న చింతాకు రెండు కప్పులు తీసుకోండి. ఈ చింతాకు రెండు రోజులపాటు ఆరబెట్టి తీసుకోండి. చింతాకు పూర్తిగా ఎండిన తర్వాత వేయించాలి.
Chintaku
Chintaku (ETV Bharat)
  • ఇందుకోసం ముందుగా స్టవ్​పై పాన్​ పెట్టి చింతాకు వేయండి. స్టవ్​ లో ఫ్లేమ్​లో అడ్జస్ట్ చేసి చింతాకు 10 నిమిషాలు దోరగా వేయించండి.
  • చింతాకు ఆ విధంగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి.
  • ఇప్పుడు అదే పాన్​లో 2 టేబుల్​స్పూన్లు ధనియాలు, టీస్పూన్ జీలకర్ర వేసి దోరగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి.
  • అదే పాన్​లో ఎండు మిర్చి, కొద్దిగా నూనె వేసి దోరగా ఫ్రై చేయండి. ఎండుమిర్చి క్రిస్పీగా ఫ్రై అయ్యాక గుప్పెడు కరివేపాకు వేసి వేయించండి. కరివేపాకు ఫ్రై అయ్యాక మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి.
  • ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇందులో చింతాకు వేయండి. చింతాకు మెత్తగా పొడి చేసుకుని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి.
  • అదే మిక్సీ గిన్నెలో వేయించి చల్లార్చుకున్న ధనియాలు, ఎండుమిర్చి మిశ్రమం, వెల్లుల్లి, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా పొడి చేసుకోండి.
  • ఈ ఎండుమిర్చి పొడిని గ్రైండ్​ చేసుకున్న చింతాకు పొడిలో వేసి కలుపుకోండి. అంతే ఇలా సింపుల్​గా ప్రిపేర్​ చేసుకుంటే ఎంతో రుచికరమైన చింతాకు కారం పొడి రెడీ!
  • ఈ చింతాకు పొడి ఎయిర్​టైట్​ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే నెల రోజులపాటు ఫ్రెష్​గా ఉంటుంది.
  • వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని చింతాకు పొడితో కలిపి తింటే టేస్ట్​ అద్దిరిపోతుంది. ఈ చింతాకు కారం పొడి తయారీ విధానం నచ్చితే మీరు ఓసారి ట్రై చేయండి.

"పచ్చిమిర్చి కారప్పొడి" ఎప్పుడైనా ట్రై చేశారా? - నిల్వ చేసుకుని ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు!

మహిళలు తప్పక తినాల్సిన "స్వీట్" ఇది! - రక్తహీనత, ఐరన్ లోపం ఉంటే ట్రై చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.