Chettinad Sweet Recipe Ukkarai : పెసర్లు, పెసర పప్పు బహుళ ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. అంతటి ప్రాధాన్యం కలిగిన పెసర్లను మొలకలు కట్టి తరచూ తీసుకుంటుంటారు. అయితే పెసర పప్పుతో తయారు చేసే ఈ స్వీట్ ఎంతో రుచితో పాటు బలాన్నిస్తుంది. స్వీట్ తినాలనిపించినా, పండుగలు, పుట్టిన రోజుల్లాంటి ప్రత్యేక రోజుల్లో ఇలా స్వీట్ తయారు చేసుకుంటే చాలు! కొత్త రుచిని అస్వాదించినట్లే!
వెన్నలా కరిగిపోయే "బెల్లం సున్నుండలు" - ఇలా చేస్తే నోటికి కూడా అంటుకోవు!

కావాల్సిన పదార్థాలు
- పెసపరప్పు - 1 కప్పు
- బొంబాయి రవ్వ - ఒక కప్పు
- నీళ్లు - రెండు కప్పులు
- బెల్లం - నాలుగు కప్పులు
- నెయ్యి - కప్పు
- యాలకుల పొడి - టీ స్పూన్
- జీడిపప్పులు - 15

తయారీ విధానం
- ముందుగా పెసరపప్పును మంచి రంగు వచ్చే వరకు సన్నని మంటపై వేయించుకోవాలి. మంట ఎక్కువైతే మాడిపోయి రుచి మారుతుంది. ఆ తర్వాత పప్పును బాగా రెండు సార్లు కడిగి శుభ్రం చేసుకుని కుక్కర్లో వేసుకోవాలి. ఒక కప్పు పప్పులో రెండు కప్పుల నీళ్లు పోసుకుని హై ఫ్లేమ్‌లో రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
- ఇపుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకుని (ఒక కప్పు పెసరపప్పులోకి నాలుగు కప్పుల బెల్లం) బెల్లం వేసుకుని ఒక అర కప్పు నీళ్లు పోసుకుని మంట లో టు మీడియంలో పెట్టుకుని కరిగించుకోవాలి. బెల్లం కరిగేలోపు కుక్కర్ లో ఉడికించిన పప్పును గుత్తితో కొద్దిగా మెదుపుకోవాలి. ఆ తర్వాత కరిగించుకున్న బెల్లం పక్కన పెట్టి పొయ్యిపై మరో కడాయి పెట్టుకుని అర కప్పు నెయ్యి వేసుకోవాలి. జీడి పప్పులు వేయించి పక్కకు పెట్టుకోవాలి.
- కడాయిలో మిగిలిన నెయ్యిలోకి (ఒక కప్పు పెసర పప్పులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ) బొంబాయి రవ్వ పోసుకుని సన్నటి మంటపై రవ్వ ఎర్రగా వేయించాలి. ఐదారు నిమిషాల తర్వాత నెయ్యి రవ్వను వదిలేస్తున్నపుడు పెసరపప్పు కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్లను వడకట్టుకుని పోసుకోవాలి. బెల్లం నీళ్లన్నీ ఒక్కసారే పోసుకోకుండా కొద్ది కొద్దిగా పోసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల రవ్వ ఉండలు కట్టకుండా ఉంటుంది.
- ప్రారంభంలో కడాయిలో అన్నీ కలిపిన తర్వాత జారుగా ఉంటుంది. ఆ తర్వాత మంట లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని ఉడికిస్తుంటే దగ్గరపడుతుంది. రవ్వ బెల్లం, పెసరపప్పులోని నీళ్లతో బాగా ఉడుకుతుంది. పాకం దగ్గరపడుతున్నా కొద్దీ రంగులో మార్పుకనిపిస్తుంది. పాకం ఉడుకుతున్నా కొద్దీ కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుతుండాలి. మధ్యలో టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని కలుపుకోవాలి. పది నిమిషాల తర్వాత వేయించిన జీడిపప్పులు వేసి కలుపుకోవాలి. ఇపుడు స్టవ్ ఆర్పేస్తే చాలు. స్వీట్ రెడీ అయినట్లే! ఈ స్వీట్ ఫ్రిజ్‌లో పెట్టుకుంటే వారం రోజులు నిల్వ ఉంటుంది.
చుక్క నూనె అవసరం లేదు, స్టవ్‌తో పనేలేదు! - ఆహా అనిపించే "పొలం పచ్చడి"
కుక్కర్లో చాలా ఈజీగా "రాగి సంగటి" - నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది!