Carrot Ravva Laddu Payasam in Telugu : నార్మల్‌గా సేమియా, సగ్గుబియ్యంతో పాయసం చేస్తుంటారు. ఈ పాయసం ఎంతో తియ్యగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఓసారి ఇలా క్యారెట్ రవ్వ లడ్డూ పాయసం ట్రై చేయండి. ఈ పాయసం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అమృతంలా అనిపిస్తుంది. పిల్లలు, పెద్దలందరూ ఈ పాయసం ఎంతో ఇష్టంగా తింటారు. మరి సింపుల్‌గా ఈ క్యారెట్ రవ్వ లడ్డూ పాయసం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు
- కాచి చల్లార్చిన పాలు - 2 కప్పులు
- ఫుల్ ఫ్యాట్ మిల్క్ - 3 కప్పులు
- క్యారెట్ - పావు కేజీ
- బొంబాయి రవ్వ - అరకప్పు
- సన్నగా తరిగిన డ్రైఫ్రూట్స్ మిశ్రమం - అరకప్పు (బాదం, పిస్తా, జీడిపప్పు, కిస్మిస్ )
- కుంకుమ పువ్వు - కొద్దిగా
- యాలకుల పొడి - అరటీస్పూన్
- టేబుల్‌స్పూన్ - నెయ్యి

ఎప్పుడూ పప్పుచారేనా? - ఇలా "టమోటా కంది పచ్చడి" చేసి చూడండి - కమ్మగా నోరూరుతుంది!
తయారీ విధానం
- ముందుగా క్యారెట్లను శుభ్రంగా కడిగి పైన తొక్క పీలర్‌తో తీసేయండి.
- అనంతరం క్యారెట్ ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో క్యారెట్ ముక్కలు వేసి గ్రైండ్ చేసుకోండి. ఆపై ఇందులోనే కప్పు కాచి చల్లార్చిన పాలు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
- ఇలా గ్రైండ్ చేసుకున్న క్యారెట్ పేస్ట్‌ని గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ క్యారెట్ పేస్ట్‌లో 2 టేబుల్‌స్పూన్లు మరొక చిన్న గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టండి. ఇందులో టేబుల్‌స్పూన్ నెయ్యి వేసి కరిగించండి. ఆపై కప్పు కాచి చల్లార్చిన పాలు , 2 టేబుల్‌స్పూన్లు చక్కెర వేసి బాగా కలుపుతూ 5 నిమిషాలు ఉడికించుకోండి. అనంతరం అరకప్పు బొంబాయి రవ్వ వేసి కలుపుతూ ఉడికించుకోండి.
- రవ్వ మిశ్రమం దగ్గరపడి ముద్దగా అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోండి. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి.

- ఇప్పుడు అదే కడాయిలో 3 కప్పులు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకొని ఒక పొంగు వచ్చే వరకు మరిగించండి. ఆపై 2 టేబుల్‌స్పూన్లు క్యారెట్ పేస్ట్, రుచికి సరిపడా చక్కెర వేసి కలుపుతూ మరిగించండి. 3 కప్పుల పాలు, 2 కప్పులుగా మారేంత వరకు మరిగించుకోవాలి.
- ఈ లోపు చల్లారిన క్యారెట్ మిశ్రమాన్ని బాగా కలిపి చిన్న బాల్స్ మాదిరిగా రెడీ చేసుకోవాలి.
- క్యారెట్ బాల్స్ ఆవిరి మీద ఉడికించుకోవడం కోసం లోతుగా ఉండే ఒక జల్లెడలోకి తీసుకోండి. ఇప్పుడు స్టవ్‌పై పెద్ద గిన్నెపెట్టి 2 గ్లాసులు వాటర్ పోసి మరిగించండి.
- ఆపై జల్లెడ పెట్టి ఆవిరి పోకుండా మూతతో కవర్ చేసి హై ఫ్లేమ్‌లో 5 నిమిషాలు ఉడికించుకోవాలి.
- అనంతరం ఈ క్యారెట్ బాల్స్ పక్కన పెట్టుకోవాలి.
- పాల మిశ్రమం కాస్త దగ్గరయ్యాక డ్రైఫ్రూట్స్, కుంకుమ పువ్వు, యాలకుల పొడి వేసి కలపండి.
- ఆపై ఇందులో స్టీమ్ చేసుకున్న క్యారెట్ బాల్స్ వేసి కలుపుతూ లో ఫ్లేమ్‌లో 5 నిమిషాలు ఉడికించుకోండి.
- అనంతరం స్టవ్ ఆఫ్ చేసి ఈ రెసిపీ పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి.
- పాయసం చల్లగా అయిన తర్వాత సర్వ్ చేసుకోండి.
డ్వాక్రా, మెప్మా మహిళలకు "గోల్డెన్ స్కీం" - ముందుగా లక్షమందికి అవకాశం - ఈ పథకంతో నిత్య ఆదాయం
నోరూరించే "చింతాకు చిన్న చేపల ఇగురు" - ఇలా చేస్తే ముద్దకో ముక్కతో ఇష్టంగా తింటారు!