ETV Bharat / offbeat

రుచికరమైన "బ్రోకలీ మసాల కర్రీ"- 'హెల్త్ బెనిఫిట్స్' తెలిస్తే అస్సలు వదలరు! - BROCCOLI MASALA CURRY

ఎప్పుడూ కాలిఫ్లవర్, క్యాబేజ్​తో కూరలు వండుతున్నారా? - ఓసారి ఇలా బ్రోకలీ మసాలా కర్రీ ట్రై చేయండి!

Broccoli Masala Curry in Telugu
Broccoli Masala Curry in Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 18, 2025 at 12:08 PM IST

2 Min Read

Broccoli Masala Curry in Telugu : కాలిఫ్లవర్, క్యాబేజ్ మాదిరిగానే బ్రోకలీ కూడా క్రూసిఫరస్ ఆకుకూర. ఎక్కువ మంది తరచూ కాలిఫ్లవర్, క్యాబేజ్ తీసుకుంటారు కానీ, బ్రోకలీ వైపు మాత్రం అస్సలు చూడరు. ఈ బ్రోకలీ వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇప్పుడు మనం బ్రోకలీతో అద్భుతమైన మసాలా కర్రీ ప్రిపరేషన్ చూద్దాం. ఈ మసాలా కూర వేడివేడి అన్నం, చపాతీలతో రుచి బాగుంటుంది.

Broccoli
Broccoli (Getty Images)

బ్రోకలీ మసాలా కర్రీ కావాల్సిన పదార్థాలు

  • బ్రోకలీ - 1
  • నూనె - సరిపడా
  • 2 టేబుల్​స్పూన్లు - ధనియాలు
  • 2 టేబుల్​స్పూన్లు - జీలకర్ర
  • టేబుల్​స్పూన్ మిరియాలు
  • అల్లం ముక్కలు - 2 చిన్నవి
  • ఎండుమిర్చి - 6
  • పొట్టు తీసిన వెల్లుల్లి - 20
  • చిటికెడు - ఇంగువ
  • బిర్యానీ ఆకు - 1
  • ఉల్లిపాయలు - 2
  • బంగాళాదుంపలు - 2
  • కప్పు టమోటా ప్యూరీ
  • పసుపు - పావు టీస్పూన్​
  • కొద్దిగా - గరం మసాలా
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
Broccoli Masala Curry
Broccoli Masala Curry (ETV Bharat)

"జొన్న చపాతీలు" రోజూ చేసుకోవచ్చు - ఇలా ట్రై చేయండి - పెనంపై పొంగుతాయి!

తయారీ విధానం

  • ముందుగా ఒక మిక్సీ గిన్నెలో 2 టేబుల్​స్పూన్ల చొప్పున ధనియాలు, జీలకర్ర, టేబుల్​స్పూన్ మిరియాలు, అల్లం ముక్కలు, ఎండుమిర్చి, పొట్టు తీసిన వెల్లుల్లి కొన్ని నీళ్లు యాడ్​ చేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఈ మసాలా పేస్ట్​ని చిన్న గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
Broccoli Masala Paste
Broccoli Masala Paste (ETV Bharat)
  • అలాగే బ్రోకలీ శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్​ చేసుకోవాలి.
  • ఆపై స్టవ్​పై కడాయి పెట్టి 2 టేబుల్​స్పూన్లు నూనె వేసి వేడి చేయండి. ఆయిల్​ హీటయ్యాక ముందుగా కట్​ చేసుకున్న బ్రోకలీ ముక్కలు వేసి మీడియంలో ఫ్లేమ్​లో 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.
  • ఆ విధంగా బ్రోకలీ ముక్కలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు అదే కడాయిలో 3 టేబుల్​స్పూన్లు నూనె వేసి వేడి చేయండి. ఆయిల్​ హీటయ్యాక ఇంగువ, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ తరుగు వేసి రెండు నిమిషాలు ఫ్రై చేయండి.
  • ఆపై బంగాళాదుంప ముక్కలు వేసి కలుపుతూ మరో రెండు నిమిషాలు ఫ్రై చేయండి.
  • ఇప్పుడు ముందుగా గ్రైండ్​ చేసుకున్న మసాలా పేస్ట్​, కప్పు టమోటా ప్యూరీ, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి లో ఫ్లేమ్​లో 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.
  • ఆపై అరకప్పు నీళ్లు పోసి వాటర్​ బాగా మరిగించుకోవాలి.
  • ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న బ్రోకలీ ముక్కలు వేసి కలుపుతూ 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.
  • తర్వాత అరకప్పు నీళ్లు పోసి బ్రోకలీ ముక్కలు కాస్త మెత్తబడే వరకు ఉడికించుకోవాలి.
  • చివరిగా మసాలా కర్రీ కాస్త దగ్గరయ్యాక కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర తరుగు చల్లి బాగా కలిపి స్టవ్​ ఆఫ్ చేయండి.
  • అంతే ఇలా సింపుల్​గా ప్రిపేర్​ చేసుకుంటే బ్రోకలీ మసాలా క్రరీ రెడీ!

ఈ బ్రోకలీ మసాలా కూర వేడివేడి అన్నం, చపాతీలతో రుచి అద్భుతంగా ఉంటుంది.

చేప ఏదైనా సరే ఇలా ఇగురు పెట్టి చూడండి! - చిక్కని గ్రేవీ కమ్మగా, కారంగా నోరూరిస్తుంది

"పాయసం" ఇలా చేస్తే ఎవ్వరైనా 'ఫిదా' అవ్వాల్సిందే - ఈ టేస్ట్ సీక్రెట్ ఎవ్వరికీ చెప్పకండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.