Alasanda Vadalu Recipe in Telugu : నార్మల్‌గా మినప్పప్పు, పచ్చిశనగపప్పు నానబెట్టి క్రిస్పీ వడలు చేస్తుంటారు. అయితే, వీటితోనే కాకుండా అలసందలతో కూడా కరకరలాడే కమ్మని వడలు చేయచ్చు. ఈ స్టోరీలో చెప్పిన విధంగా బొబ్బర్లతో వడలు చేస్తే మినప్పప్పుతో చేసిన వడల కంటే క్రిస్పీగా, ఎంతో టేస్టీగా ఉంటాయి. మరి ఈ కరకరలాడే అలసందల వడలను సింపుల్‌గా ఎలా చేయాలో తెలుసుకుందాం.

ఈ టిప్‌తో తియ్యని "సాఫ్ట్ పూరీలు" చేసేయండి - ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపిస్తాయి!
కావాల్సిన పదార్థాలు
- అలసందలు - 250 గ్రాములు
- రుచికి సరిపడా ఉప్పు
- నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
- కరివేపాకు - 2
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- టీస్పూన్ - జీలకర్ర
- పచ్చిమిర్చి - 4
- అల్లం ముక్కలు - 2
- కొంచెం - వంటసోడా

అలసందల వడలు తయారీ విధానం :
- ముందుగా ఒక గిన్నెలో పావుకిలో అలసందలను వేసుకొని బాగా కడిగి 6 గంటలు నానబెట్టుకోవాలి. ఉదయాన్నే వడలు ప్రిపేర్ చేసుకోవాలనుకునే వారు నైట్ మొత్తం నానబెట్టుకోవచ్చు.
- తర్వాత ఒక జాలి గిన్నెలో అలసందలను తీసుకుని నీళ్లు లేకుండా వడకట్టుకోవాలి.

- ఒక మిక్సీ గిన్నెలో పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టీస్పూన్ జీలకర్ర వేసి నీళ్లు వేయకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి.
- ఆపై మిక్సీ గిన్నెలో అలసందలు వేసి నీళ్లు యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని పచ్చిమిర్చి పేస్ట్ బౌల్లో వేసుకోండి.

- ఇందులో కొత్తిమీర తరుగు, కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం వంటసోడా వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
- ఈ అలసందల వడలు చేయడం కోసం పిండి కాస్త గట్టిగానే ఉండాలి. ఒకవేళ పిండి కొద్దిగా జారుగా ఉంటే కాస్త పొడి బియ్యం పిండి వేసుకుని కలుపుకోండి.

- ఇప్పుడు వడలు డీప్ ఫ్రై చేయడం కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి సరిపడా నూనె వేసి వేడి చేయండి.
- ఆయిల్ బాగా హీటైన తర్వాత కొద్దిగా పిండిని తీసుకుని వడలు చేసుకుని నూనెలో వేసుకోండి.
- ఈ అలసందల వడలను మీడియం ఫ్లేమ్‌లో రెండువైపులా క్రిస్పీగా మారే వరకు ఫ్రై చేసుకోవాలి.
- అలసంద వడలు రెండు వైపులా దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి.
- అంతే మిగిలిన పిండితో ఇలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది.
- ఈ అలసందల వడలు చాలా కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉంటాయి. టేస్టీ అలసందల వడలు తయారీ విధానం నచ్చితే మీరు ఓసారి ట్రై చేయండి.
చేపల పులుసు కమ్మగా ఉండాలా - ఈ "మసాలా దినుసులు" యాడ్ చేస్తే అదుర్స్!
ఇడ్లీ, దోసెల్లోకి ఎప్పుడూ చట్నీయేనా - "టమోటా షేర్వా" ట్రై చేయండి - ఒకటికి రెండు ఎక్కువే తింటారు!