ETV Bharat / offbeat

"బెంగాలీ స్టైల్​ చికెన్ కర్రీ" - ఇలా వండితే ఇంట్లో అందరూ ఆహా అనాల్సిందే!

- నార్మల్​ చికెన్​ కర్రీకి మించిన టేస్ట్​ - ఇలా చేస్తే నిమిషాల్లోనే రెడీ

Bengali Chicken Curry
How to Make Bengali Chicken Curry (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 8, 2024, 1:45 PM IST

How to Make Bengali Chicken Curry : చాలా మందికి చికెన్ అంటే ఎంతో ఇష్టం. అయితే.. చికెన్​తో ఎప్పుడూ ఓకేలా కాకుండా వెరైటీ కోరుకునే వారి కోసం సూపర్ రెసిపీ తీసుకొచ్చాం. అదే బెంగాలీ స్టైల్​ చికెన్ కర్రీ. ఈ స్టోరీలో చెప్పిన విధంగా చికెన్ కర్రీ వండితే రుచి అద్దిరిపోతుంది. మరి ఇక ఆలస్యం చేయకుండా బెంగాలీ స్టైల్​ చికెన్​ కర్రీ ఎలా వండాలో ఓ లుక్కేయండి.

కావాల్సిన పదార్థాలు :

  • చికెన్ - అర కేజీ
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - టేబుల్​స్పూన్​
  • పెరుగు - 2 టేబుల్​స్పూన్లు
  • బంగాళా దుంపలు-3
  • ఉల్లిపాయలు-3
  • పసుపు-పావు టీస్పూన్​
  • కారం-3 టేబుల్​స్పూన్లు
  • ఆవాల నూనె-4 టేబుల్​స్పూన్లు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • గరం మసాలా - టీస్పూన్​
  • జీలకర్ర పొడి- అరటీస్పూన్​
  • పంచదార- అరటీస్పూన్
  • బిర్యానీ ఆకులు-2
  • లవంగాలు-4
  • యాలకులు-4
  • దాల్చిన చెక్క-1
  • నీరు సరిపడా

తయారీ విధానం :

  • ముందుగా బంగాళదుంపలపైన చెక్కు తీసుకుని శుభ్రంగా కడగాలి. తర్వాత వీటిని కాస్త పెద్ద ముక్కలుగా కట్​ చేసుకోవాలి.
  • అలాగే ఉల్లిపాయలను సన్నగా కట్​ చేయాలి. ఇందులో కొన్ని మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా పేస్ట్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు చికెన్ మ్యారినేట్​ చేయడం కోసం ఒక మిక్సింగ్​ బౌల్​ తీసుకోండి. ఇందులో చికెన్​ వేయండి. తర్వాత పసుపు, కొద్దిగా కారం, రుచికి సరిపడా ఉప్పు, ఉల్లిపాయ పేస్ట్​, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆవాల నూనె వేసి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని గంటపాటు అలా వదిలేయండి.
  • తర్వాత స్టౌపై పాన్ పెట్టండి. ఇందులో ఆవాల నూనె వేసి వేడి చేయండి. (మీకు అచ్చం బెంగాలీ స్టైల్​ చికెన్​ కూర రుచి రావాలంటే.. ఆవాల నూనె మాత్రమే యూజ్​ చేయాలి.)
  • నూనె వేడయ్యాక కట్​ చేసిన పొటాటో ముక్కలు వేయండి. ఇందులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి 5 నిమిషాలు వేయించి ప్లేట్లోకి తీసుకోండి.
  • ఇప్పుడు అదే నూనెలో బిర్యానీ ఆకులు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేయండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయండి.
  • అలాగే కొద్దిగా చక్కెర వేయండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత పసుపు, కారం, జీలకర్ర పొడి వేసి మిక్స్ చేయండి. కొన్ని నీళ్లు పోసి మసాలా మిశ్రమం చిక్కగా మారిన తర్వాత.. మ్యారినేట్​ చేసుకున్న చికెన్​ వేసి కలపండి.
  • ఇప్పుడు గిన్నెపై మూతపెట్టి 5 నిమిషాలు మగ్గించుకోండి. తర్వాత పెరుగు వేసి మిక్స్​ చేయండి. అలాగే ఫ్రై చేసుకున్న బంగాళదుంపలు వేసి కలపండి.
  • తర్వాత గ్లాసు నీళ్లు పోసి కలిపి మూత పెట్టండి.
  • ఇప్పుడు మీడియం ఫ్లేమ్​లో కర్రీ పైన నూనె తేలెంత వరకు ఉడికించుకోండి.
  • ఆయిల్​ సేపరెట్​ అయిన తర్వాత గరం మసాలా వేసి మిక్స్ చేయండి. ఒక రెండు నిమిషాల తర్వాత స్టౌ ఆఫ్​ చేసుకుంటే సరిపోతుంది.
  • ఘుమఘుమలాడే రుచికరమైన బెంగాలీ స్టైల్​ చికెన్ కర్రీ రెడీ.

ఇవి కూడా చదవండి :

సూపర్​ టేస్ట్​తో బిహారీ స్టైల్​ "స్పైసీ చికెన్​ మసాలా కర్రీ" - ఇలా చేశారంటే ఒక్క ముక్క మిగలదు!

తమిళనాడు స్టైల్ "చికెన్ చింతామణి" రెసిపీ - ఈ సండే విందు అద్దిరిపోతుంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.