ETV Bharat / offbeat

బొంబాయి రవ్వతో "కమ్మటి అప్పాలు" - స్వీట్ తినాలనిపిస్తే అప్పటికపుడు ఈజీగా చేసుకోండిలా! - BELLAM RAVA APPALU RECIPE

బొంబాయి రవ్వతో ఉప్మా, కేసరీ చేయడం కామన్​! -ఇలా తీయటి బెల్లం అప్పాలు ట్రై చేయండి!

Rava Appalu in Telugu
Rava Appalu in Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 14, 2025 at 2:30 PM IST

2 Min Read

Rava Appalu in Telugu : సాధారణంగా బొంబాయి రవ్వతో ఉప్మా, కేసరి వంటివి ఎక్కువగా చేస్తుంటారు. అయితే, ఈ రవ్వతో మీరు ఎప్పుడైనా అప్పాలను ట్రై చేశారా? ఇక్కడ చెప్పిన విధంగా బెల్లంతో రవ్వ అప్పాలు చేస్తే ఎంతో రుచికరంగా ఉంటాయి. ఈ బెల్లం రవ్వ అప్పాలను పిల్లలు ఒకటికి రెండు ఇష్టంగా తింటారు. ఈ అప్పాలు చేయడం కూడా చాలా ఈజీ. మరి ఇక ఆలస్యం చేయకుండా బెల్లం రవ్వ అప్పాలు చేయడానికి కావాల్సిన పదార్థాలు? తయారీ విధానం ఇప్పుడు చూద్దాం.

Rava
Rava (Getty Images)

రవ్వ అప్పాలు తయారీకి కావాల్సిన పదార్థాలు

  • బెల్లం తురుము - పావుకప్పు
  • నీళ్లు - కప్పు
  • చిటికెడు ఉప్పు
  • బొంబాయి రవ్వ - అర కప్పు
  • ఎండుకొబ్బరి పొడి - పావుకప్పు
  • నెయ్యి - సరిపడా
  • యాలకుల పొడి - అరటీస్పూన్
Jaggery
Jaggery (Getty Images)

కుక్కర్లో చాలా ఈజీగా "రాగి సంగటి" - నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది!

రవ్వ అప్పాలు తయారీ విధానం

  • ఇందుకోసం ముందుగా స్టవ్​పై ఒక కడాయి పెట్టి అందులో కప్పు వాటర్​ పోసి వేడి చేయండి. వాటర్​ మరుగుతున్నప్పుడు పావుకప్పు బెల్లం తురుము, చిటికెడు ఉప్పు వేసి బాగా కలపండి.
  • బెల్లం పూర్తిగా కరిగాక ఇందులో అరకప్పు బొంబాయి రవ్వ, అరటీస్పూన్ యాలకుల పొడి వేసి కలుపుతూ ఉడికించండి.
  • రవ్వ వాటర్​ని పీల్చుకుని పిండి ముద్దగా మారి, పాన్​ నుంచి సెపరేట్ అయ్యే వరకు కలుపుతూ నిదానంగా ఉడికించుకోండి.
Rava Appalu Process
Rava Appalu Process (ETV Bharat)
  • రవ్వ మిశ్రమం దగ్గర పడిన తర్వాత టేబుల్​స్పూన్​ నెయ్యి వేసి బాగా కలిపి స్టవ్​ ఆఫ్​ చేయండి.
  • ఈ రవ్వ మిశ్రమం ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వండి. పిండి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు పావుకప్పు ఎండుకొబ్బరి పొడి వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు పిండిని చిన్నచిన్న ఉండలుగా చేసుకోండి.
  • ఆపై ఒక ప్లాస్టిక్​ కవర్​కు నెయ్యి రాసి పిండి ఒక ఉండను పెట్టి కాస్త మందంగా అప్పాల మాదిరి వత్తుకోండి.
  • ఇలా తయారు చేసుకున్న అప్పాలను ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి.
  • అనంతరం అప్పాలు డీప్​ ఫ్రై చేయడం కోసం స్టవ్​పై కడాయి పెట్టి సరిపడా ఆయిల్​ పోసి వేడి చేయండి.
  • నూనె​ హీటైన తర్వాత రెడీ చేసుకున్న అప్పాలు వేసి కాసేపు అలా వదిలేయండి.
  • ఆపై గరిటెతో నెమ్మదిగా తిప్పుతూ ఎర్రగా మారే వరకు ఫ్రై చేసుకోండి.
  • రవ్వ అప్పాలు రెండువైపులా దోరగా కాల్చుకున్న అనంతరం ఒక ప్లేట్లోకి తీసుకోండి.
  • అంతే ఇలా సింపుల్​గా మిగిలిన అప్పాలను నూనెలో వేయించుకుంటే సరి!
  • ఈ బెల్లం రవ్వ అప్పాలు ఎంతో రుచికరంగా ఉంటాయి. ఎప్పుడైనా స్వీట్​ తినాలనిపిస్తే ఇలా ఓసారి ట్రై చేయండి.

తీయటి "పచ్చికొబ్బరి బెల్లం లడ్డూలు" - రక్తహీనతతో బాధపడేవారు ఓసారి ఇలా ట్రై చేయండి!

"తెలంగాణ దావత్ స్టైల్​ మటన్ కర్రీ" - ఓసారి ఇలా ఇంట్లో చేయండి! అందరూ "సూపర్"​ అంటారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.