Bellam Jalebi Recipe in Telugu : చాలా మందికి స్వీట్‌షాప్స్, జిలేబీ సెంటర్స్ వద్ద లభించే జిలేబీలంటే ఎంతో ఇష్టం. బాక్స్ ముందు పెడితే పిల్లలు, పెద్దలు ఇలా అందరూ ఒకటికి రెండు జిలేబీలు తింటారు. అయితే, కొన్ని టిప్స్ పాటిస్తూ ఈ స్టోరీలో చెప్పిన విధంగా చేస్తే మీరు కూడా జిలేబీలు రెడీ చేయచ్చు. ఈ బెల్లం జిలేబీలు ఎంతో టేస్టీగా, జ్యూసీగా ఉంటాయి. మరి ఈ బెల్లం జిలేబీలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
టేస్టీ బెల్లం జిలేబీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు:
- గోధుమ పిండి - కప్పు
- పొడి బియ్యం పిండి - 4 టేబుల్‌స్పూన్లు
- బెల్లం తురుము - కప్పు
- నీళ్లు - అరకప్పు
- నిమ్మరసం - 2 టేబుల్‌స్పూన్లు
- నెయ్యి - 2 టేబుల్‌స్పూన్లు
- వంటసోడా - పావు టీస్పూన్

"హోటల్ స్టైల్ మైసూర్ బోండా" - ఇలా చేస్తే పిండి లోపల ఉడుకుతుంది, అలాగే గుండ్రంగా వస్తాయి!
జిలేబీల తయారీ విధానం
- ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కప్పు బెల్లం తురుము వేయండి. ఇందులో అరకప్పు వాటర్ వేసి బెల్లం కరిగించుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత కాస్త పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి.
- ఆ విధంగా బెల్లం పాకం ప్రిపేర్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులో 2 టేబుల్‌స్పూన్లు నిమ్మరసం వేసి కలపండి. ఇలా పాకంలో నిమ్మరసం కలపడం వల్ల పాకం చిక్కబడదు. అలాగే జిలేబీలు పాకం పీల్చుకుని ఎన్ని గంటలైనా జ్యూసీగా ఉంటాయి.
- ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో కప్పు గోధుమ పిండి, 4 టేబుల్‌స్పూన్లు పొడి బియ్యం పిండి, 2 టేబుల్‌స్పూన్లు నెయ్యి, వంటసోడా వేసి బాగా కలుపుకోండి.
- తర్వాత ఇందులో కొద్దికొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి.
- జిలేబీలు రావడం కోసం పిండి మరీ చిక్కగా, పల్చగా కాకుండా ఉండాలి.
- ఇప్పుడు పిండిని సాస్ డబ్బాలోకి తీసుకోండి.
- జిలేబీలు చేయడం కోసం స్టవ్‌పై వెడల్పాటి పాన్ పెట్టి నూనె వేసి వేడి చేయండి.
- ఆయిల్ హీటైన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసి జిలేబీలు వేసుకోండి.
- అరనిమిషం తర్వాత గరిటెతో జిలేబీలను తిప్పుతూ ఫ్రై చేసుకోండి. జిలేబీలో దోరగా వేగిన తర్వాత బెల్లం పాకంలో వేయండి. నిమిషం పాటు బెల్లం పాకంలో జిలేబీలు డిప్ చేసిన తర్వాత వాటిని జాలి గరిటెలోకి తీసుకోండి.
- ఆపై వేడివేడిగా జిలేబీలను సర్వ్ చేసుకుంటే సరి! అంతే ఇలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకుంటే ఎంతో రుచికరమైన తీయటి బెల్లం జిలేబీలు మీ ముందుంటాయి.
- బెల్లం జిలేబీ తయారీ విధానం నచ్చితే మీరు ఓసారి ట్రై చేయండి.

"కమ్మటి మిరియాల రసం" - రోజూ తిన్నా బోర్ కొట్టదు! అలా ఉంటుంది మరీ!
10 నిమిషాల్లోనే "ఆలూ బజ్జీ" - ఈ టిప్‌తో తక్కువ పిండితోనే ఎక్కువ చేసేయొచ్చు!