White Pumpkin Halwa Recipe in Telugu : ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా స్వీట్లతోనే మన భావాలను పంచుకుంటాం. తెలుగువారు అనేక రకాల స్వీట్లను పండుగ వేళల్లో, ఉత్సవాల సమయంలో చేసుకుని తింటారు. ముఖ్యంగా కొందరు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు క్యారెట్‌తో హల్వా చేసుకొని మనసు తృప్తి చేసుకుంటారు. అయితే, మీరు ఎప్పుడైనా గుమ్మడికాయతో హల్వా ట్రై చేశారా? ఈ గుమ్మడికాయ హల్వా రుచి ఎంతో బాగుంటుంది. గుమ్మడికాయతో ఎన్నో రకాల ఆరోగ్య లాభాలున్నాయి. ఈ హల్వా పిల్లలకు తినిపిస్తే వారు ఆరోగ్యంగా, బలంగా ఉండడానికి తోడ్పడుతుంది. మరి ఈజీగా ఈ గుమ్మడికాయ హల్వా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

గుమ్మడికాయ హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు
- గుమ్మడి కాయ - 1
- నెయ్యి - సరిపడా
- చక్కెర - రుచికి సరిపడా
- కొద్దిగా కుంకుమ పువ్వు
- అరటీస్పూన్ యాలకుల పొడి
- కాస్త పచ్చ కర్పూరం,
- టేబుల్ స్పూన్ నిమ్మరసం

పిల్లలు రాగులతో చేసిన వంటలు తినడం లేదా? - ఇలా "రాగి తోప" చేసి పెట్టండి! ఇష్టంగా తింటారు!
తయారీ విధానం
- ఇందుకోసం ముందుగా గుమ్మడి కాయను శుభ్రంగా కడిగి కట్ చేసుకోండి.
- ఆపై అందులోని గింజలను మొత్తం తీసేయాలి. అలాగే పీలర్ సహాయంతో గుమ్మడి కాయపైన ఉన్న చెక్కును కూడా తీసేయాలి.
- అనంతరం గుమ్మడికాయను గ్రేటర్ సహాయంతో సన్నగా తురుముకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టండి. ఇందులో గుమ్మడికాయ తురుము వేసి మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ ఉడికించుకోండి. ఇక్కడ మీరు గుమ్మడికాయ తురుము నీళ్లతో సహా వేసుకోండి. అప్పుడే రుచి బాగుంటుంది.
- గుమ్మడికాయ తురుము కాస్త దగ్గర పడడానికి 20 నుంచి 25 నిమిషాల సమయం పడుతుంది. అంత వరకు అడుగు పట్టకుండా కలుపుతూ ఉడికించుకోండి. హల్వా కాస్త దగ్గర పడిన తర్వాత రుచికి సరిపడా చక్కెర వేసి కలుపుతూ ఉడికించుకోవాలి.

- పంచదార పూర్తిగా కరిగి చిక్కబడడానికి మరో 10-15 నిమిషాల సమయం పడుతుంది. అంత వరకు మీడియం ఫ్లేమ్‌లో కలుపుతూ ఉడికించుకోండి.
- అనంతరం ఇందులో టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి కలపండి. ఇలా నిమ్మరసం వేయడం వల్ల హల్వా చల్లారిన తర్వాత కూడా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది.
- అలాగే కొద్దిగా కుంకుమ పువ్వు, అరటీస్పూన్ యాలకుల పొడి, కాస్త పచ్చ కర్పూరం వేసి కలుపుతూ లో ఫ్లేమ్ లో మరో 10 నిమిషాలు ఉడికించుకోండి.
- ఈ లోపు మరో స్టవ్ పై కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి కరిగించండి. వేడివేడి నెయ్యిలో జీడిపప్పులు వేసి దోరగా ఫ్రై చేయండి.
- చక్కగా రంగు మారిన జీడిపప్పులు హల్వాలో వేసి కలుపుకోండి.
- అంతే ఇలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గుమ్మడికాయ హల్వా రెడీ!
- ఈ హల్వా తయారీ విధానం నచ్చితే మీరు ట్రై చేయండి.
"తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ" - ఓసారి ఇలా ఇంట్లో చేయండి! అందరూ "సూపర్" అంటారు!
కుక్కర్లో చాలా ఈజీగా "రాగి సంగటి" - నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది!