ETV Bharat / offbeat

రుచికరమైన "ఆలు బజ్జీలు" - పొంగుతూ క్రిస్పీగా రావాలంటే ఈ టిప్స్ ఫాలో చేస్తే చాలు! - ALOO BAJJI

సూపర్​ టేస్టీ ఆలూ బజ్జీ - అప్పటికప్పుడు సింపుల్​గా ఇలా ట్రై చేయండి, బాగుంటాయి!

Aloo Bajji Recipe In Telugu
Aloo Bajji Recipe In Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 18, 2025 at 4:26 PM IST

2 Min Read

Aloo Bajji Recipe In Telugu : ఈవెనింగ్​ టీ టైమ్​లో చాలా మందికి, మిర్చీ బజ్జీ, పకోడీ, ఆలూ బజ్జీ వంటివి తినాలనిపిస్తుంటుంది. కారంగా ఏదైనా స్నాక్​ తిన్న తర్వాత టీ లేదా కాఫీ తాగితే ఆ ఫీలింగ్​ చాలా బాగుంటుంది. ఈ క్రమంలోనే ఎక్కువ మంది స్నాక్స్​గా వేడివేడిగా బజ్జీలు చేసుకుంటారు. అయితే, ఈ సారి ఇంట్లో ఆలూ బజ్జీలు తయారు చేసేటప్పుడు పిండి ఈ విధంగా ప్రిపేర్​ చేయండి. ఇలా చేస్తే తక్కువ పిండితో ఆలూ బజ్జీలు ఎక్కువగా చేసుకోవచ్చు. మరి ఆలూ బజ్జీలు ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Aloo
Aloo (Getty Images)

ఆలూ బజ్జీ తయారీకి కావాల్సిన పదార్థాలు :

  • శనగపిండి - కప్పు
  • పొటాటోలు - 2
  • పసుపు - అర చెంచా
  • బియ్యప్పిండి - టేబుల్​స్పూన్
  • జీలకర్ర - 1 టీస్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • బేకింగ్ సోడా - అర చెంచా
  • నూనె - తగినంత
  • సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు
  • వాము - అరటీస్పూన్​
  • అల్లం వెల్లుల్లి పేస్ట్​ - అరటీస్పూన్
Aloo Bajji Batter
Aloo Bajji Batter (ETV Bharat)

లంచ్ బాక్సుల్లోకి సూపర్ రెసిపీ - అన్నీ కలిపేసి కుక్కర్​లో చేసుకోవడమే!

ఆలూ బజ్జీ తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా పొటాటోలను రెండు, మూడుసార్లు శుభ్రంగా కడగండి. ఆపై పీలర్​ సహాయంతో పైన పొట్టు తీసేసుకోండి.
  • ఇప్పుడు పొటాటోలను చిప్​ స్లైసర్​ లేదా కత్తితో వీలైనంత సన్నగా ముక్కలు కట్​ చేసుకోవాలి.
  • ఇలా కట్​ చేసుకున్న పొటాటో స్లైసెస్​ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇందులో వాటర్​ పోసి రెండుసార్లు కడిగి కాసేపు నానబెట్టుకోండి.
Aloo Bajji
Aloo Bajji (ETV Bharat)
  • అనంతరం బజ్జీల పిండి రెడీ చేయడం కోసం ఒక మిక్సింగ్​ గిన్నెలో కప్పు శనగపిండి తీసుకోండి.
  • ఇందులో అరటీస్పూన్​ కారం, టేబుల్​స్పూన్​ బియ్యం పిండి, అరటీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్​, కొద్దిగా పసుపు, సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు వంటసోడా, అరటీస్పూన్​ వాము వేసి బాగా కలపండి.
  • వంటసోడా వేయడం ఇష్టం లేనివారు టేబుల్​స్పూన్​ వేడివేడి ఆయిల్​ పోసి పిండి కలుపుకోవచ్చు. ఇలా పిండిలో నూనె వేయడం వల్ల బజ్జీలు క్రిస్పీగా వస్తాయి.
  • ఇప్పుడు పిండిలో కొద్దికొద్దిగా వాటర్​ పోసుకుంటూ గట్టి పిండిలా కలుపుకోవాలి.
  • ఆపై పిండిలో సరిపడా వాటర్​ పోసుకుంటూ ఆలూ స్లైసెస్​కి కోటింగ్​ అయ్యే విధంగా పిండిని కలుపుకుంటే సరిపోతుంది. పిండి మరీ గట్టిగా ఉంటే తక్కువ పిండితో ఎక్కువ బజ్జీలు చేయడం కుదరదు.
  • ఇప్పుడు ఆలూ బజ్జీలు ఫ్రై చేయడం కోసం స్టవ్​పై కడాయి పెట్టి సరిపడా ఆయిల్​ పోసి వేడి చేయండి.
  • నూనె​ వేడైన తర్వాత ఒక్కో ఆలూ స్లైసెస్​ని పిండిలో ముంచి నిదానంగా వేడివేడి ఆయిల్లో వేసుకోవాలి.
  • కడాయిలో సరిపడా ఆలూ బజ్జీలు వేసుకున్న తర్వాత నెమ్మదిగా గరిటెతో తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి.
Aloo Bajji Recipe
Aloo Bajji Recipe (ETV Bharat)
  • ఆలూ బజ్జీలు మంచి రంగులో దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. మిగిలిన పిండితో ఇలా సులభం​గా ఆలూ బజ్జీలు ప్రిపేర్​ చేసుకుంటే సరి!
  • అంతే ఇలా ఈజీగా రెడీ​ చేసుకుంటే నోరూరించే ఆలూ బజ్జీలు మీ ముందుంటాయి.
  • ఈ టేస్టీ ఆలూ బజ్జీల తయారీ విధానం నచ్చితే మీరు ఓసారి ఇంట్లో ట్రై చేయండి.

రుచికరమైన "పెసరపప్పు, సేమియా కేసరి" - స్వీట్​గా చేసుకోవచ్చు, ప్రసాదంలో పెట్టొచ్చు!

ఘుమఘుమలాడే "క్యాబేజీ నిల్వ పచ్చడి" - ఇలా పెట్టుకుంటే 2 నెలలు నిల్వ ఉంటుంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.