ETV Bharat / offbeat

మీరు వాడే "జీలకర్ర" కల్తీది కావొచ్చు - FSSAI సూచిస్తున్న ఈ సింపుల్​ ట్రిక్​తో ఈజీగా గుర్తించండి!

-జీలకర్రతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు - కల్తీ జీరాను కనిపెట్టేందుకు నిపుణుల సూచనలు!

How to Identify Adulterated Cumin Seeds
Adulterated Cumin Seeds (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : June 20, 2025 at 10:43 AM IST

3 Min Read
Choose ETV Bharat

How to Identify Adulterated Cumin Seeds : ప్రతి వంటింటి పోపుల పెట్టెలో తప్పనిసరిగా ఉండే సుగంధ ద్రవ్యాలలో జీలకర్ర ఒకటి. ఈ క్రమంలోనే మనం నిత్యం కూరల తాలింపులో జీలకర్రను వాడుతుంటాం. కేవలం పోపులో మాత్రమే కాకుండా బిర్యానీ, పిండి వంటలు, పలు రకాల కూరలలో జీలకర్రను, జీలకర్ర పొడిని యూజ్ చేస్తుంటాం. ఇవి వంటకాలకు మంచి సువాసనతో పాటు టేస్ట్​ని కూడా ఇస్తాయి. అలాగే జీలకర్ర వంటకాలకు మాత్రమే కాదు ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా కీలక పాత్రను పోషిస్తుంది.

దీనిలో ఐరన్, పాస్ఫరస్, కాల్షియం, సోడియం, పొటాషియం, విటమిన్ ఏ, విటమిన్ సీ వంటివి పుష్కలంగా ఉండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అయితే, మనలో చాలా మంది జీలకర్రను పదే పదే కొనడం కంటే ఒకేసారి ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసి స్టోర్ చేసుకుంటుంటారు. కానీ, కొన్నిసార్లు కల్తీ జీలకర్రను కొనే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే మార్కెట్లో కొందరు మాయగాళ్లు గ్రాస్ సీడ్స్​ని చాక్ కోల్ డస్ట్​తో కలర్ వేసి అమ్ముతున్నారు. కాబట్టి, అలాంటి జీలకర్రను వాడడం వల్ల ఆరోగ్యానికి జరిగే మేలు కంటే నష్టమే ఎక్కువ అంటున్నారు. అందుకే జీలకర్ర కొనే ముందు అప్రమత్తంగా ఉండడంతో పాటు ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు.

Testing Cumin Seeds Adulteration
Cumin Seeds Adulteration (Getty Images)

ఈ నేపథ్యంలోనే 'ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI)' కూడా కల్తీ జీలకర్రను ఏవిధంగా గుర్తించాలనే దానిపై ఒక వీడియోను విడుదల చేసింది. FSSAI విడుదల చేసిన వీడియోలోని ఈ సింపుల్​ టెస్ట్​ని ఫాలో అవ్వడం ద్వారా నకిలీ జీలకర్ర సింపుల్​గా కనిపెట్టవచ్చంటున్నారు.

ఇందుకోసం ముందుగా విడిగా జీలకర్ర కొనేటప్పుడు కొద్దిగా చేతిలోకి తీసుకొని రబ్ చేయాలి. అప్పుడు మీ వేళ్లకు ఏదైనా రంగు అంటుకుంటే లేదా నల్లటి పొడి వస్తే అది కల్తీ చేసిన జీలకర్రగా గుర్తించాలంటున్నారు FSSAI అధికారులు. అదే, స్వచ్ఛమైన జీలకర్ర అయితే ఎలాంటి రంగు మారది గమనించాలంటున్నారు. ఇలా సింపుల్​గా ఈ చిన్న టెస్ట్​తో నకిలీ జీలకర్రను ఇట్టే కనిపెట్టవచ్చంటున్నారు.

మీరు వాడుతున్న బెల్లం మంచిదేనా? - FSSAI సూచనలతో కల్తీని క్షణాల్లో కనిపెట్టండిలా!

కల్తీ జీలకర్రను గుర్తించే మరికొన్ని టిప్స్ :

నీటితో ఇలా చేయండి :

  • కల్తీ జీలకర్రను గుర్తించడం కోసం ఒక గ్లాసులో కొద్దిగా వాటర్ తీసుకొని అందులో ఒక చెంచా జీలకర్ర వేయండి. అప్పుడు అది కల్తీదైతే రంగు వేసిన పదార్థం కరిగి నీరు గోధుమరంగు లేదా నలుపు రంగులోకి మారడం గమనించవచ్చంటున్నారు నిపుణులు. అలాగే, ప్లాస్టిక్ గింజలు, రాళ్లు వంటివి అడుగు భాగానికి వెళ్లకుండా పైన తేలియాడతాయని చెబుతున్నారు.
  • అదే, స్వచ్ఛమైన జీలకర్ర అయితే గ్లాసు అడుగు భాగానికి చేరుతుంది. కొన్ని తేలికపాటి గింజలు పైన ఉండవచ్చు. కానీ, చాలా వరకు అడుగు భాగానికి చేరుతాయంటున్నారు.
How to Identify Adulterated Cumin Seeds
Testing Cumin Seeds Adulteration (FSSAI)

స్మెల్ టెస్ట్ : ఈ చిన్న టెస్ట్ ద్వారా కూడా నకిలీ జీరాను గుర్తించవచ్చంటున్నారు నిపుణులు. అందుకోసం కాస్త జీలకర్ర పట్టుకొని స్మెల్ చెక్ చేయండి. అప్పుడు అది స్వచ్ఛమైనదైతే బలమైన, ఘాటైన మంచి సువాసనను వెదజల్లుతుంది. అదే, నకిలీదైతే సువాసన చాలా తక్కువగా ఉంటుందట. లేదంటే ఒక రకమైన కెమికల్​ స్మెల్​ రావొచ్చంటున్నారు.

ఆకృతి పరీక్ష : స్వచ్ఛమైన జీలకర్ర ఎప్పుడు కూడా పొడవుగా, ఒక చివర సన్నగా ఉండి ముదురు గోధుమ కలర్​లో కనిపిస్తుంది. అలాగే, ఆ గింజల ఉపరితలం గీతలతో గరుకుగా ఉండడాన్ని గమనించవచ్చు. అదే, నకిలీదైతే చాలా ముదురు లేదా చాలా లేత రంగులో ఉండవచ్చంటున్నారు నిపుణులు. అలాగే, నార్మల్ దాని కంటే కాస్త డిఫరెంట్ షేప్​లో కనిపించవచ్చంటున్నారు.

'కల్తీ కారం తింటే క్యాన్సర్​ వచ్చే అవకాశం' - మీ ఇంట్లో వాడే చిల్లీ పౌడర్​ని ఇలా టెస్ట్ చేయండి!

మీరు వాడుతున్న వంట నూనె మంచిదా? - కల్తీ చేశారా? - ఇలా ఈజీగా తెలుసుకోండి!