ETV Bharat / offbeat

చుక్క నూనె లేకుండా "స్పైస్ చికెన్ ఫ్రై" - పొడిపొడిగా నోట్లో కమ్మగా కరిగిపోతుంది! - CHICKEN FRY

నూనె వాడకుండా చికెన్ ఫ్రై తయారీ - బటర్​ రైస్​లోకి అద్ధిరిపోతుంది!

chicken_fry_with_out_oil
chicken_fry_with_out_oil (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 1, 2025 at 11:02 AM IST

3 Min Read

Chicken Fry With Out Oil : చాలా మందికి ముక్క లేనిదే ముద్దదిగదు. సెలవు రోజుల్లో, ఆదివారాల్లో మటన్, చికెన్, ఫిష్ లేదా కనీసం గుడ్డు అయినా ఉండాల్సిందే! ఇలాంటి వాళ్లలో కొందరు ఊబకాయం భయంతో డైట్ పాటిస్తుంటారు. కానీ, ఇప్పుడా ఆందోళన అక్కర్లేదు. డైట్​లో ఉన్నామని చికెన్ పక్కన పెట్టాల్సిన పన్లేదు. చుక్క నూనె కూడా వాడకుండా చికెన్ ఫ్రై రెడీ చేసుకుంటే ఎంతో బాగుంటుంది. చాలా స్పైసీగా, టేస్టీ గా ఉంటుంది.

హోటల్​ చట్నీ టేస్ట్ సీక్రెట్ ఏమీ లేదు! - పల్లీలను ఇలా చేసి చూడండి చట్నీ కోసమే టిఫిన్ తినేస్తారు!

ఇలా చేయండి :

  • నాన్​ స్టిక్ కడాయి, చికెన్ స్కిన్​తోనే తీసుకోవాలి.
  • పుల్లటి పెరుగు కంటే చిక్కటి తాజా పెరుగు వాడాలి.
  • హై ఫ్లేమ్​లో కాకుండా సన్నటి మంటపై చేసుకోవాలి.

కావాల్సిన పదార్థాలు :

  • చికెన్ - కిలో
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కారం - మూడు స్పూన్లు
  • పసుపు - పావు స్పూన్
  • మిరియాల పొడి - అర స్పూన్
  • ధనియాల పొడి - 1 స్పూన్
  • చికెన్ మసాలా - 1 స్పూన్
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
  • కరివేపాకు - కొద్దిగా
  • పెరుగు - అర కప్పు
  • నిమ్మరసం - అర చెక్క
  • పచ్చి మిర్చి - 6
  • మసాలా - 1 స్పూన్

బటర్ రైస్ కోసం :

  • బాస్మతి రైస్
  • బటర్ - 2 స్పూన్లు
  • వెల్లుల్లి - 2 స్పూన్లు
  • పచ్చి మిర్చి - 2
  • ఉప్పు - రుచికి సరిపడా
  • మిరియాల పొడి - అర స్పూన్
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

తయారీ విధానం :

  • ముందుగా చికెన్ బాగా శుభ్రం చేసుకుని మిక్సింగ్​ బౌల్​లోకి తీసుకోవాలి.
  • ఈ కర్రీలోకి కాల్చిన చికెన్ చాలా బాగుంటుంది. లేదా స్కిన్​తో తీసుకున్నా సరిపోతుంది.
  • శుభ్రం చేసుకున్న చికెన్​లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మూడు స్పూన్లు కారం, పావు స్పూన్ పసుపుతో పాటు అర స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 రెబ్బల కరివేపాకు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అర కప్పు చిక్కటి తాజా పెరుగు, నిమ్మరసం కలిపి అరగంట సేపు మారినేట్ చేసుకోవాలి.
  • ఇపుడు స్టవ్​పై కడాయి పెట్టుకుని 30 నిమిషాలు నానిన చికెన్ వేసుకుని అడుగు పట్టకుండా హై ఫ్లేమ్​లో వేయించాలి. 5 నిమిషాల్లో నీళ్లు ఊరగానే మంట మీడియం ఫ్లేమ్​లో పెట్టుకుని మరో సారి కలిపి నెమ్మదిగా ఉడికించుకోవాలి. 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కూర కలుపుతుండాలి.
  • నీళ్లు దగ్గర పడిన తర్వాత కారం కోసం 6 పచ్చి మిర్చి సన్నగా చీరుకుని వేసుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా వేసుకుని చికెన్ ముక్క డ్రై అయ్యే వరకు అడుగు పట్టకుండా కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ సమయంలో చికెన్ చక్కగా మెరుస్తూ ఉడికిపోతుంది. చివరగా కొత్తిమీర తరుగు వేసుకుని కలిపుకుంటే చాలు! చుక్క నూనె వాడకుండానే చికెన్ ఫ్రై రెడీగా ఉంటుంది.
  • ఈ చికెన్ ఫ్రై బటర్​ రైస్ లోకి అద్దిరిపోతుంది.
  • బటర్ రైస్ కోసం ముందుగా బాస్మతి రైస్ లేదా సన్న బియ్యం కాస్త పొడి పొడిగా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కడాయిలో బటర్ వేసి వేడి కాగానే సన్నగా తరిగిన వెల్లుల్లి పాయలు వేసుకుని దోరగా వేయించాలి.
  • ఇపుడు పచ్చి మిర్చి తరుగు వేసుకుని నిమిషంపాటు సన్నటి మంటపై వేయించాలి. ఆ తర్వాత పొడిగా ఉడికించుకున్న అన్నం వేసుకుని పైన రుచికి సరిపోను ఉప్పు, మిరియాల పొడి వేసుకుని బాగా కలపాలి. చివరగా సన్నటి కొత్తిమీర తరుగు వేసుకుని చికెన్ లేదా రైతాతో తింటే చాలా బాగుంటుంది.

స్వీట్ షాప్ స్పెషల్ "ఉల్లిపాయ పకోడీ" - ముందే పిండి కలపకుండా ఇలా చేయండి!

ఘుమఘుమలాడే 'వంకాయ వేపుడు' - ఇలా చేస్తే ముక్క చేదు లేకుండా కమ్మగా ఉంటుంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.