How to Check the Wheat Flour Purity : చాలా మంది ఇళ్లల్లో మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, నైట్ డిన్నర్‌లో చపాతీలను ఆహారంగా తీసుకుంటుంటారు. బరువు తగ్గాలనుకునేవారూ రాత్రి సమయాల్లో చపాతీలు మాత్రమే తింటుంటారు. మెజారిటీ పీపుల్ గోధుమపిండితోనే చపాతీలు చేస్తుంటారు. అయితే ఒకప్పుడు గోధుమల్ని శుభ్రం చేసి.. ఎండ బెట్టి పిండిని ఇంట్లోనే తయారు చేసుకునేవారు. ఇప్పుడు రోజులు మారిపోయాయి. చేసే టైమ్, ఓపిక లేక మార్కెట్లో దొరికే పిండితో చపాతీలు చేసుకుంటున్నారు. అయితే, ఆ పిండి కూడా కల్తీ అవుతోందని మీకు తెలుసా?. మీరు విన్నది నిజమే.. గోధుమపిండిని కూడా వదలడం లేదు కల్తీ రాయుళ్లు. అందులో తవుడు, చాక్ పౌడర్, ఊక వంటివి విరివిగా కలిపేసి అమ్మేస్తున్నారు. ఇలాంటి పిండి ఆరోగ్యానికి హానికరమంటున్నారు నిపుణులు. కాబట్టి ఇంట్లో వాడే పిండి స్వచ్ఛమైనదా? లేదా? అని గుర్తించాల్సి ఉంటుంది. ఇందుకోసం 'ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI)' కొన్ని టిప్స్ సూచిస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..
FSSAI సూచనలు పాటించి.. గోధుమ పిండి స్వచ్ఛతను ఈజీగా చెక్ చేయవచ్చు. దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇందుకోసం ముందుగా ఒక గాజు గ్లాసులో నీళ్లను తీసుకోవాలి. అందులో కొంచెం గోధుమ పిండిని వేయాలి. స్వచ్ఛమైన పిండి అయితే కొంచం పొట్టు మాత్రమే నీటి పైన తేలుతూ కనిపిస్తుంది. కానీ అదే పిండిలో పొట్టు లేదా తవుడు కలిస్తే.. చాలా పెద్ద మొత్తంలో నీళ్లపై తేలుతుంటుంది. అలా తేలితే కల్తీ జరిగిందని అర్థం.
నిమ్మకాయ కూడా.. పిండి నాణ్యత చెక్ చేయానికి మీరు నిమ్మకాయను కూడా ఉపయోగించవచ్చు. ఒక గిన్నెలో కొద్దిగా గోధుమ పిండి తీసుకోవాలి. అందులో కొన్ని చుక్కల నిమ్మరసం వేయాలి. పిండిలో బుడగలు వస్తే అది కల్తీ అయిందని అర్థం. ఎందుకంటే చాక్ పౌడర్ కలిపితేనే అలా బుడగలు వస్తాయి. స్వచ్ఛమైన పిండి అయితే.. ఇలాంటి లక్షణాలు కనిపించవు.
గోధుమల కల్తీని ఇలా కనిపెట్టండి: అయితే కేవలం గోధుమపిండి కల్తీని మాత్రమే కాదు గోధుమల స్వచ్ఛతను కనిపెట్టడానికి కూడా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) సూచనలు చేస్తోంది. ఆ టిప్స్ సాయంతో గోధుమల కల్తీని కూడా గుర్తించవచ్చు. అది ఎలాగంటే.. ముందుగా ఓ ప్లేట్లోకి కొద్ది మొత్తంలో గోధుమలు తీసుకోవాలి. ఆ గోధుమలు ముదురు రంగులో ఉంటే స్వచ్ఛమైనవని అర్థం. అలా కాకుండా అవి రంగు మారినా, రాళ్లు ఉన్నా అవి కల్తీ జరిగినట్లు గుర్తించాలంటున్నారు.
మార్కెట్ నెయ్యితో కల్తీ భయమా? - పాల మీగడతో స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకోండిలా!
మీరు ఉపయోగించే "పసుపు" స్వచ్ఛమైనదేనా ? - ఓ సారి ఇలా చెక్ చేసి తెలుసుకోండి!
మార్కెట్లో "కల్తీ టీ పొడి" హల్చల్ - మీరు వాడేది స్వచ్ఛమైనదేనా? ఇలా గుర్తించండి!