TTD Online Ticket Booking : శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల విడుదల తేదీలను టీటీడీ వెల్లడించింది. జూలై నెల కోటాకు సంబంధించి ఆర్జిత సేవలతో పాటు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల తేదీలను వెల్లడించింది.
"జొన్న చపాతీలు" రోజూ చేసుకోవచ్చు - ఇలా ట్రై చేయండి - పెనంపై పొంగుతాయి!

ఆర్జిత సేవా టికెట్లు
- తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల టికెట్లను టీటీడీ ఈ నెల 19న శనివారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనుంది.
- సుప్రభాతం, అర్చన, తోమాల, అష్టదళ పాదపద్మారాధన తదితర ఆర్జితసేవల టికెట్లను టీటీడీ వెెబ్సైట్ లో బుక్ చేసుకోవచ్చు.
- ఈ నెల 19నుంచి 21 వరకు ఈ-సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుంది. మొబైల్కు అలర్ట్ మెసేజ్ వచ్చిన భక్తులు ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు డబ్బులు చెల్లిస్తే టికెట్లు మంజూరవుతాయని టీటీడీ వెల్లడించింది.

ఊంజల్ సేవ, కల్యాణోత్సవంతో పాటు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను ఏప్రిల్ 22న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. వర్చువల్ సేవలు, దర్శనం స్లాట్ల టికెట్లను సైతం అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ వర్గాలు వెల్లడించాయి.
ఈ నెల 23న బుధవారం ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణం టోకెన్లు, 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం కోటా టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని టీటీడీ ప్రకటించింది.

స్పెషల్ దర్శనం టికెట్లు
2025 జులై కోటా 300 రూపాయల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లను ఈ నెల 24న గురువారం ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. అదే విధంగా మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి, తిరుమలలో గదుల బుకింగ్ చేసుకోవచ్చు. జులైలో తిరుమల వెళ్లాలనుకుంటున్న భక్తులు టోకెన్లు, టికెట్ల కోటా విడుదల తేదీలు గమనించి టీటీడీ వెబ్సైట్లో టికెట్లు బుక్ చేసుకోవాలి.
"పాయసం" ఇలా చేస్తే ఎవ్వరైనా 'ఫిదా' అవ్వాల్సిందే - ఈ టేస్ట్ సీక్రెట్ ఎవ్వరికీ చెప్పకండి!
"ఫ్లోర్ క్లీనింగ్ నీళ్లలో ఇవి కలిపి చూడండి! - చీమలు, బొద్దింకలు పారిపోతాయి - ఇల్లంతా సువాసన