How Many Types Ration Cards: "మీకు రేషన్ కార్డు ఉందా?" అని ప్రశ్నిస్తే లబ్ధిదారులంతా "ఉంది" అని సమాధానం చెబుతారు. కానీ "మీది ఏ రకమైన రేషన్ కార్డు?" అని అడిగితే మాత్రం కార్డు ముఖం చూడకుండా చాలా మంది చెప్పలేరు. ఇక, ఎన్ని రకాల కార్డులు ఉన్నాయి? ఏ కార్డుకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయని అడిగితే మాగ్జిమమ్ జనాలు "తెలియదు" అని ఆన్సర్ ఇస్తారు. మరి, మీకు తెలుసా? ఏ కార్డుకు ఎవరు అర్హులు? ఆ రేషన్ కార్డు ద్వారా లబ్ధిదారులు ఎలాంటి బెనిఫిట్స్ పొందుతారని? ఆ వివరాలు ఇక్కడ చూద్దాం.
రేషన్ కార్డ్ అనేది రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే అధికారిక గుర్తింపు కార్డు. ఈ కార్డు సహాయంతో జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) ప్రకారం రాయితీ ధరలకు ఆహార ధాన్యాలను కొనుగోలు చేయవచ్చు. అయితే NFSA అమలులోకి రాకముందు రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు ఆధారంగా, అర్హత కలిగిన కుటుంబాలు టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (TPDS) ద్వారా సబ్సిడీ ధరలకు ఆహార ధాన్యాలను కొనుగోలు చేసేవి. 2013లో NFSA అమలులోకి వచ్చాక దేశంలోని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అర్హత కలిగిన కుటుంబాలకు మూడు రకాల రేషన్ కార్డులను జారీ చేస్తున్నాయి. ఇందులో అంత్యోదయ అన్నయోజన (AAY), ఆహార భద్రతా (Food Security), అన్నపూర్ణ యోజన (Annapurna Yojana) కార్డులు ఉన్నాయి. కార్డు ప్రాతిపదికన లబ్దిదారులు పొందే ప్రయోజనాలు మారుతూ ఉంటాయి.
అంత్యోదయ అన్న యోజన రేషన్ కార్డు(AAY):
- ఈ రేషన్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత వెనుకబడిన కుటుంబాలకు ఇస్తుంటాయి. ముఖ్యంగా దినసరి కూలీలు, నిరుద్యోగులు, వికలాంగులు, వితంతువులు, వృద్ధులు(60ఏళ్లు పైబడిన వారు), దీర్ఘకాలిక వ్యాధులతో బాధితులు వంటి బలహీన వర్గాలకు అందిస్తాయి.
- ఈ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి నెలకు 35 కిలోల బియ్యం అందిస్తారు.
ప్రియారిటీ హౌస్ హోల్డ్ రేషన్ కార్డు:
- అంత్యోదయ అన్న యోజన కార్డు పరిధిలోకి రాని కుటుంబాలు ఆహార భద్రత కార్డుల పరిధిలోకి వస్తాయి.
- దారిద్య్ర రేఖకు దిగువన (BPL) ఉన్న కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని మంజూరు చేస్తాయి.
- BPL పరిధిలో ఉన్నవారితోపాటు 40 శాతానికిపైగా వైకల్యం ఉన్న వారు, ట్రైబల్ కుటుంబాలు, ట్రాన్స్ జెండర్లు ఈ కేటగిరీలోకి వస్తారు.
- కుటుంబ వార్షిక ఆదాయం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన పరిమితి కంటే తక్కువగా ఉండాలి.
- ఈ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికీ నెలకు 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాలు ఇస్తారు. ప్రస్తుతం తెలంగాణలో మనిషికి ఆరు కిలో బియ్యం ఇస్తున్నారు.
అన్నపూర్ణ కార్డులు :
- 65 సంవత్సరాల వయసు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న పేదలకు వీటిని అందిస్తారు.
- ఈ కార్డు కలిగిన లబ్ధిదారులకు ప్రతి నెలా 10 కిలోల ఆహార ధాన్యాలు ఉచితంగా అందజేస్తారు.
- జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం (NOAPS) లేదా రాష్ట్ర పెన్షన్ పథకం కింద పెన్షన్ పొందుతున్నవారు ఈ పథకానికి అనర్హులు.
రేషన్ కార్డు దరఖాస్తుల పరిశీలనకు యాప్ - అన్నీ చెక్ చేశాకే కొత్త కార్డు
2 రకాలుగా రేషన్‌కార్డులు - వారందరికీ ట్రై కలర్, వీరందరికీ గ్రీన్ కలర్